
అధికారులు బయటపడేసిన తన దరఖాస్తు కోసం వెతుకుతున్న వృద్ధురాలు
తనకల్లు: తనకల్లులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన ‘జన్మభూమి–మా ఊరు’లో ప్రజల నుంచి స్వీకరించిన వివిధ దరఖాస్తులను అధికారులు ఇలా తీసుకొని అలా పడేశారు. పింఛన్లు, ప్రభుత్వ గృహాలు, రేషన్‌కార్డుల కోసం ప్రజల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు రాగా... అధికారులు వాటన్నింటినీ తీసుకొని మధ్యాహ్నం భోజన విరామంలో గది బయట పడేసి అక్కడి నుండి మెల్లగా జారుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వృద్ధులు, వికలాంగులు బయటపడి ఉన్న తమ అర్జీలను వెతుక్కోవడం అక్కడున్న ప్రజలను కలిచివేసింది. అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.