‘జన్మభూమి’తో సాధించిందేమిటి? | ysrcp leader reddy shanthi fired on tdp leaders | Sakshi
Sakshi News home page

‘జన్మభూమి’తో సాధించిందేమిటి?

Published Sat, Jan 13 2018 9:32 AM | Last Updated on Fri, Aug 10 2018 8:34 PM

ysrcp leader reddy shanthi fired on tdp leaders - Sakshi

ఎల్‌.ఎన్‌.పేట: జన్మభూమి పేరుతో ఏడాదికోసారి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమంగా మార్చుకున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి దుయ్యబట్టారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు 5 విడతల్లో జన్మభూమి మాఊరు కార్యక్రమాన్ని నిర్వహించి ఏం సాధించారో ముఖ్య మంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు బహిరంగంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ప్రజల నుంచి వచ్చిన వినతులు ఒక్కటీ పరిష్కరించలేని దుస్థితిలో పరిపాలన సాగుతోందని దుయ్యబట్టారు. సభల నిర్వహణ పేరుతో ప్రభుత్వం రూ.99 లక్షలు ఖర్చు చేసిందన్నారు. గ్రామ సభలకు వెళ్లిన  అధికారులను, తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రజలే నిలదీశారని గుర్తు చేశారు.  నాలుగేళ్ల పాలనలో ఒక్క హామీ నెరవేర్చలేని ముఖ్యమంత్రిగా చంద్రబాబు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఎద్దేవా చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement