reddy shanthi
-
సీఎంగా ఉండి ఇలాగేనా మాట్లాడేది: Reddy Shanthi
-
100 రోజుల పాలనపై చంద్రబాబును ఏకిపారేసిన రెడ్డి శాంతి
-
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డిశాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు. శ్రీకాకుళం, ఒడిశా రాష్ట్ర పర్యటనలో భాగంగా మంగళవారం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్‌కు మంత్రులు అవంతి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డాక్టర్ సత్యవతి, మేయర్ హరి వెంకటకుమారి, విశాఖ కలెక్టర్ మల్లికార్జున ఘన స్వాగతం పలికారు. చదవండి: MLA RK Roja: బ్యాడ్మింటన్ ఆడిన ఎమ్మెల్యే ఆర్కేరోజా -
CM Jagan: నవంబర్ 9న విశాఖకు సీఎం జగన్
సాక్షి, మహారాణిపేట (విశాఖ దక్షిణ): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 9న విశాఖ రానున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో 9న ఉదయం 11.50 గంటలకు విశాఖ చేరుకుంటారు. మధ్యాహ్నం 12:05కు హెలికాప్టర్లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై..అక్కడ నుంచి మధ్యాహ్నం 2.50 గంటలకు విశాఖ చేరుకుంటారు. విశాఖ ఎయిర్‌పోర్టులో మధ్యాహ్నం 2.50 గంటలనుంచి 3.30 వరకు సీఎం ప్రోగ్రాం రిజర్వ్‌లో ఉంచారు. మధ్యాహ్నం 3.30 గంటలకు విమానంలో బయలుదేరి భువనేశ్వర్ వెళతారు. చదవండి: (మరవలేని మహా యజ్ఞం.. ప్రజా సంకల్పం) -
రెడ్డి శాంతి కుమార్తె వివాహానికి సీఎం జగన్‌కు ఆహ్వానం
సాక్షి, ఎల్.ఎన్.పేట: పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె, ఐఏఎస్ అధికారి రెడ్డి వేదిత వివాహ రిసెప్షన్ నవంబర్ 9న పాతపట్నంలో జరగనుంది. ఈ వేడుకకు రావాలని కోరుతూ.. ఎమ్మెల్యే రెడ్డి శాంతి మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి ఆహ్వానపత్రికను అందజేశారు. సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యేతో పాటు ఆమె కుమారుడు రెడ్డి శ్రావణ్‌కుమార్ ఉన్నారు. చదవండి: (రాష్ట్రాభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం) చదవండి: (Andhra Pradesh: చిట్టి చెల్లెమ్మకు 'స్వేచ్ఛ') -
కరోనా సంక్షోభం లో నూ ఆగని సంక్షేమ పథకాలు
-
ఎమ్మెల్యే రెడ్డి శాంతి భర్త కన్నుమూత
సాక్షి, శ్రీకాకుళం : పాతపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి నాగభూషణరావు మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. నాగభూషణరావు మృతితో పాతపట్నం నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, శాంతి-నాగభూషణరావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. నాగభూషణరావు ఐఎఫ్ఎస్ అధికారిగా దేశంలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. గోవా ఫారెస్ట్ కంజర్వేటర్‌గా, డామన్ డయ్యూ టూరిజం డైరక్టర్‌గా, పర్యావరణం, కాలుష్యం, అడవులు, ఇందనవనరుల శాఖలకు సంబంధించిన పలు విభాగాల్లో పనిచేశారు. పలువురు కేంద్ర మంత్రుల వద్ద ఓఎస్డీగా కూడా విధులు నిర్వర్తించారు. పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ వద్ద ప్రిన్సిపల్ సెక్రటరీగా చేస్తూ స్వచ్చంద పదవీ విరమణ చేశారు. గత కొద్దికాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స తీసుకున్నారు. క్యాన్సర్ పూర్తిగా నయమయ్యాక కొద్ది నెలల క్రితం మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నాగభూషణరావు మృతిపట్ల సీఎం జగన్ సంతాపం ఎమ్మెల్యే రెడ్డి శాంతి భర్త నాగభూషణరావు మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రెడ్డిశాంతికి, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
దోపిడీదారులే ధర్నాలు చేయడం విడ్డూరం
సాక్షి, టెక్కలి: గత ప్రభుత్వ హయాంలో నారాలోకేష్ బినామీ సంస్థ బ్లూఫ్రాగ్ రూపొందించిన ‘మన శాండ్ యాప్’ ద్వారా లక్షల టన్నుల ఇసుక దోపిడీ చేసిన టీడీపీ నాయకులు ఇప్పుడు ఇసుక దీక్షల పేరుతో ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. టెక్కలిలో శుక్రవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. ఇసుక దోపిడీపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ ప్రభుత్వంపై వందల కోట్ల రూపాయలు జరిమాన విధించడాన్ని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా ఇసుక సరఫరాలో సరికొత్త విధానాన్ని తీసుకువచ్చి అమలు చేస్తున్నారన్నారు. ఇసుక సరఫరాను ప్రైవేటు సంస్థ నుంచి ప్రభుత్వ సంస్థ అయిన ఏపీఎండీసీకి అప్పగించడం ద్వారా పారదర్శకతకు పెద్దపీఠవేశారని అన్నారు. అయితే చంద్రబాబుకు బినామీగా ఉన్న బ్లూఫ్రాగ్ సంస్థ ద్వారా ఏపీఎండీసీ వెబ్‌సైట్‌ను హ్యాకింగ్ చేసి ఆన్లైన్లో ఇసుక బుకింగ్ జరగకుండా కుట్రలు పన్నారని దువ్వాడ ఆరోపించారు. కుట్రలు బయటపడడంతో సీఐడీ అధికారులు బ్లూఫ్రాగ్ సంస్థపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇదే బ్లూఫ్రాగ్ సంస్థ ద్వారా ఎన్నికల ముందు ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించి ఓట్ల తొలగింపునకు టీడీపీ నాయకులు పాల్పడ్డారని అన్నారు. వీటన్నింటిపై ఏమాత్రం అవగాహన లేని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసంబద్ధ ప్రేలాపనలు చేస్తున్నారని దువ్వాడ మండిపడ్డారు. పేదవారి పిల్లలు ఇంగ్లిష్‌లో చదవకూడదా..? పేదవాళ్ల పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలనే సదుద్దేశంతో సీఎం జగన్ ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. దీనిపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. మీ పిల్లలు ఇంగ్లిష్ చదువులు చదవచ్చు.. పేదోడి పిల్లలు ఇంగ్లి‹Ùలో చదవకూడదా? అంటూ ప్రశ్నించారు. గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలు.. పవన్‌కల్యాణ్ ప్యాకేజీలపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని దువ్వాడ సవాల్ విసిరారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్య పెట్టేందుకు పేజీల కొద్దీ మేనిఫెస్టో విడుదల చేసిన మీకు, సింగిల్ పేజీ మేనిఫెస్టోతో.. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఇచ్చిన అనేక హామీలను అమలు చేసి చూపించిన జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు. చంద్రబాబుది దొంగ దీక్ష : ఎమ్మెల్యే రెడ్డి శాంతి కొత్తూరు: రాష్ట్రంలో ఇసుక కొరత ఉందంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దొంగ దీక్షలు చేస్తున్నారని ఎమ్మెల్యే రెడ్డి శాంతి విమర్శించారు. అంగూరు వద్ద వంశధార నదిలో నిర్వహిస్తున్న ఇసుక రీచ్‌ను శుక్రవారం ఆమె పరిశీలించారు. రీచ్‌లో ఇసుక నిల్వల లభ్యత వివరాలను రీచ్ ఇన్చార్జి కూర్మరావు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల ఇసుక లభ్యత తగ్గిందన్నారు. ఇటీవల వర్షాలు, వరదల వల్ల ఇసుక సరఫరాలో కొంత జాప్యం నెలకొందన్నారు. అంగూరు ఇసుక రీచ్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి అయినప్పటికీ ప్రజలకు తగినంత ఇసుక సరఫర చేస్తున్నట్లు చెప్పారు. మరో వారం రోజుల్లో వంశధార నదిలో మరికొన్ని రీచ్‌లు ప్రారంభిస్తామన్నారు. చంద్రబాబు పాలనలో ఉచిత ఇసుక పాలసీ పేరుతో జిల్లాలో టీడీపీ నేతలు కూన రవికుమార్, కలమట వెంకటరమణ, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు వారి అనుచరలు కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు ఎస్.ప్రసాదరావు, మాజీ ఎంపీపీ చల్లం నాయుడు, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ అధ్యక్షుడు తోట నందకుమార్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కన్నయ్య స్వామి, పార్టీ నేతలు పాల్గొన్నారు. -
కలమట కుమారుడిని కఠినంగా శిక్షించాలి
సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): పాతపట్నం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కుమారుడు సాగర్ ఆగడాలు రోజురోజుకూ మితిమీరి పోతున్నాయని, ఇటువంటి వారిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని ఎమ్మెల్యే రెడ్డి శాంతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆర్ఎన్ అమ్మిరెడ్డిని కోరారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో ఆయనను సోమవారం కలిసిన ఆమె.. వినతిపత్రం అందజేశారు. ఈనెల 9న కొత్తూరు మండలం మాతల గ్రామంలో సామాజిక భవనం వద్ద శ్రమదానం చేస్తున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, ప్రభుత్వం నియమించిన వలంటీర్లపై కలమట కుమారుడు తన అనుచరులతో కలిసి దాడికి దిగారని తెలిపారు. అసభ్య పదజాలంతో దుర్బాషలాడుతూ కర్రలతో దాడి చేసి, గాయాలపాలు చేశారన్నారు. బాధితుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని, కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్నారన్నారు. అక్కడి నుంచి తప్పించుకున్న ప్రధాన నిందితుడైన సాగర్‌ను ముమ్మరంగా గాలించి, పట్టుకోగా.. బెయిల్‌తో ఇంటికి చేరుకున్నారని పేర్కొన్నారు. సామాన్యులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఇటువంటి వారికి బెయిల్ నిరకరించడంతో పాటు కఠినంగా శిక్షించాలని ఆమె విన్నవించారు. దీనిపై స్పందించిన ఎస్పీ.. ఘటనపై వివరాలు సేకరించి, బాధ్యులపై చర్యలు చేపడతామని హామీ ఇచ్చారన్నారు. -
వారికి కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు
సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తర సయమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ.. పాతపట్నం పరిధిలోని గిరిజనులను ఆదుకోవాలని కోరారు. ఏనుగుల దాడి నుంచి గిరిజనులను రక్షించాలని విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్ల కాలంలో గిరిజనలు ఆదుకునే నాధుడే లేరని ఆరోపించారు. ఏనుగుల దాడిలో ఎంతో మంది గిరిజనులు చనిపోయారని, వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఏనుగులు గ్రామాలలోకి రాకుండా అడ్డుకట్ట వేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏనుగుల దాడిలో నష్టపోయిన పంటకు పరిహారం ఇవ్వాలని ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు కోరారు. సభ్యుల విజ్ఞప్తిపై మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గతంలో జరిగిన పొరపాట్లను జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 11 మంది బాధిత కుటుంబాలకు పరిహారం ఇచ్చామని వెల్లడించారు. ఏనుగుల దాడిలో నష్టపోయిన పంటకు పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. కాపులను చంద్రబాబు మోసం చేశారు కాపుల విషయంలో చంద్రబాబు నాయుడు కపట నాటకం ఆడారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విమర్శించారు. రిజర్వేషన్లపై మంజునాథన్ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. కాపు ఉద్యమాన్ని పోలీసులతో ఏ విధంగా అణచివేశారో అందరికీ తెలుసన్నారు. కాపులను ఏ విధంగా బీసీలలో చేరుస్తారని కేంద్రం అడిగిన ప్రశ్నకు చంద్రబాబు జవాబు ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. వెన్నుపోటులో దిట్ట అయిన బాబు కాపులను కూడా అలాగే మోసం చేశారని ఆరోపించారు. కాపు సామాజిక వర్గ సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు. -
‘వైఎస్సార్ మరణించగానే వంశధారను నిర్వీర్యం చేశారు’
సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్రలో వెనుకబడిన ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేయాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వంశధార ప్రాజెక్టును ప్రారంభించారని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి గుర్తుచేశారు. జలయజ్ఞంలో భాగంగా వైఎస్సార్ హయంలో 80 శాతం భూసేకరణ పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. వైఎస్సార్ మరణం తర్వాత ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా వంశధార ప్రాజెక్టుకు సంబంధించి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడారు. వంశధార పూర్తయితే 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆమె తెలిపారు. రైతులు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. గత ఐదేళ్లుగా వంశధార నిర్వాసితులను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. చంద్రబాబు హయంలో నిర్వాసితుల ఆందోళనను దేశం మొత్తం చూసిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయంలో జరిగిన అవినీతిని బయటపెట్టాలని కోరారు. గత పాలకులు వంశధార ప్రాజెక్టు నిధులను స్వాహా చేశారని ఆరోపించారు. ప్రజాతీర్పును వంచించి అక్కడి ఎమ్మెల్యే టీడీపీ పంచన చేరారని గుర్తుచేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యే, జిల్లా మంత్రి ప్రభుత్వం అండతో అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. నిర్వాసితులకు జరిగిన అన్యాయాన్ని బయటకు తీయాలని కోరారు. అనంతరం మాట్లాడిన నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వంశధార ప్రాజక్టు నిర్వాహితులకు పరిహారం చెల్లింపుపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని స్పష్టం చేశారు. అవినీతిని వెలికి తీసీ చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిర్వాసితులకు ఇచ్చే ప్యాకేజీల విషయంలో కూడా అవినీతి జరడం దారుణమన్నారు. -
అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా..
సాక్షి, ఎల్.ఎన్.పేట (శ్రీకాకుళం): పాలవలస రాజశేఖరం కుమార్తెగా రెడ్డి శాంతి జిల్లా ప్రజలకు సుపరిచితం. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో అదే పార్టీ తరఫున పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. నిత్యం ప్రజలతో మమేకమై, వారికి చేదోడువాదోడుగా ఉంటూ వారి అభిమానాన్ని పొందారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. విరామ సమయంలో తన మససులోని మాటలను ‘సాక్షి’తో పంచుకున్నారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అంటున్నారు. సాక్షి: నియోజకవర్గ ప్రజలతో ఎలా మమేకమయ్యారు? రెడ్డి శాంతి: గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించిన ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తన స్వార్థ ప్రయోజనాల కోసం అధికార పార్టీలో చేరిపోయారు. వైఎస్సార్ కుటుంబాన్ని, వైఎస్సార్సీపీని, వైఎస్ జగన్మోహన్రెడ్డిని నమ్మి ఆయనకు ఓట్లు వేసిన ప్రజలకు నమ్మక ద్రోహం చేశారు. నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకుని, వారికి అండగా నిలవాలని జగన్మోహన్రెడ్డి నన్ను నియోజకవర్గానికి పంపించారు. 2016 మే నెలలో ఇక్కడ అడుగు పెట్టాను. అప్పటి నుంచి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషిచేస్తూ వారి ఆదరాభిమానాన్ని పొందాను. ఇక్కడి వారు నన్ను వారి కుటుంబ సభ్యురాలిగా అక్కున చేర్చుకుని ఆదరించారు. గత ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటు సభ్యురాలిగా పోటీ చేసి ఓటమి చెందాను. పాలవలస రాజశేఖరం కూతురిగా నియోజకవర్గంతో పాటు జిల్లా ప్రజలకు నేను సుపరిచితురాలినే. సాక్షి: సమస్యల పరిష్కారానికి ఎలా కృషి చేస్తారు? రెడ్డి శాంతి: 2016 నుంచి నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి రెండు, మూడు సార్లు వెళ్లి అక్కడి ప్రజలతో కూర్చోని గ్రామాల్లోని ప్రధాన సమస్యలు వారిని అడిగి తెలుసుకున్నాను. వంశధార నిర్వాసితులకు 2013 ఆర్ఆర్ చట్టం, 2017 వరకు యూత్ ప్యాకేజీ వర్తింప చేసి న్యాయం చేస్తాం. అక్రమంగా నమోదు చేసిన కేసులు ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటాం. మెళియాపుట్టి ఆఫ్‌షోర్ రిజర్వాయర్ బాధితులకు అండగా ఉంటాం. గిరిజన గ్రామాలను వెంటాడుతున్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. కొత్తూరు, హిరమండలం, ఎల్.ఎన్.పేట మండలాల్లో వంశధార నదికి కరకట్టలు నిర్మిస్తాం. బాలికల జూనియర్ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ఏర్పాటు చేయాల్సి ఉంది. పాతపట్నం, కొత్తూరు సీహెచ్‌సీల్లో సదుపాయాలు మెరుగుపర్చుతాం. వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపట్టడం ద్వారా ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తాం. కల్లట, జిల్లేడుపేట, కోరసవాడ, కాగువాడ గ్రామస్తుల వంతెన కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వంతెన నిర్మాణానికి కృషిచేస్తాను. సాక్షి: మీ విజయానికి వ్యూహాలు ఏమిటి? రెడ్డి శాంతి: ప్రత్యేక వ్యూహాలు అంటూ ఏమీ లేవు. ఫిరాయింపు ఎమ్మెల్యే అక్రమాలు, టీడీపీ వైఫల్యాలే మా విజయానికి దోహదపడతాయి. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని ఎమ్మెల్యే కలమట గంగలో కలిపేశారు. ప్రజాసమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాల్సిన ఎమ్మెల్యే ఇసుక అక్రమ వ్యాపారం, ప్రభుత్వ భూములు కబ్జాపై దృష్టిసారించారు. అందుకే పార్టీ ఫిరాయించారు. టీడీపీ పాలనపై ప్రజలు విసుగు చెందారు. మార్పు కోరుకుంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ పాలనే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ముందుకు పోతోంది. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను ప్రతీ కుటుంబానికి అందజేస్తాం. సాక్షి: నియోజకవర్గంలో మీరు గుర్తించిన ప్రధాన సమస్యలు ఏంటి? రెడ్డి శాంతి: నియోజకవర్గంలో ఎక్కువగా గిరిజనులు, వంశధార నిర్వాసితులు ఉన్నారు. వారికి పరిహారం అందించి న్యాయం చేయాల్సిన పాలకులు కట్టుబట్టలతో గ్రామాల నుంచి గెంటేశారు. పంట కోతకొచ్చిందని, సంక్రాంతి పండగను వారి స్వగ్రామాల్లో చేసుకుని వెళ్లిపోతామని ఎంత బతిమాలినా వినకుండా మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు, ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పోలీసులతో భయపెట్టి, ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేసి బలవంతంగా బయటకు పంపించారు. ఆ సంఘటన నన్న ఎంతగానో కలచివేసింది. సమస్యను జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లాను. ఆయన హిరంమడలం వచ్చి బహిరంగ సభ నిర్వహించి నిర్వాసితులకు అండగా ఉంటానని, 2013 చట్టం వర్తింప చేస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసితులపై అక్రమంగా నమోదు చేసిన కేసులు ఎత్తివేస్తామన్నారు. 2017 వరకు యూత్ ప్యాకేజీ ఇస్తామన్నారు. అలాగే గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కొరతతో పాటు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం. వంశధార, మహేంద్ర తనయ నదులకు ఏటా వచ్చే వరదల కారణంగా తీర ప్రాంత గ్రామాల రైతులు, ప్రజలు నష్టపోతున్నారు. వరద గట్టుల నిర్మాణం పూర్తి చేస్తాం. రైతులను ఆదుకుంటాం. ఏనుగుల సమస్య పరిష్కారానికి కృషిచేస్తాను. అలాగే ఏబీ రోడ్డుతో పాటు గ్రామీణ రహదార్లు అధ్వానంగా ఉన్నాయి. -
నిరుద్యోగులను వంచించిన ప్రభుత్వం
శ్రీకాకుళం , ఎల్.ఎన్.పేట: గత ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు, విద్యార్థులకు ఎన్నో ఆశలు కల్పించిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా అమలు చేయకుండా నిలువునా ముంచేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జాబు కావాలంటే బాబు రావాలని, నిరుద్యోగులకు రూ.2వేలు భృతి ఇస్తామని, విద్యాసంస్థల్లో ఫీజులు భారం లేకుండా చేస్తామని.. ఇలా ఎన్నో ఆశలు కల్పించి గద్దెనెక్కాక విస్మరించారని దుయ్యబట్టారు. ఇప్పటికే ఫీజుల భారం భరించలేక అనేక మంది పేదింటి విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో మరోసారి మభ్యపెట్టేందుకు నిరుద్యోగ భృతి పెంపు పేరిట డ్రామాలు అడుతున్నారని విమర్శించారు. నాలుగున్నరేళ్లలో 6వేల ఉపాధ్యాయ పోస్టులకు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం శోచనీయమన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పి, వైఎస్సార్ సీపీని గెలిపించాలని ఆమె కోరారు. -
నిరుద్యోగ భృతికి నిబంధనలా?
శ్రీకాకుళం, కొత్తూరు: నిరుద్యోగ భృతి కోసం సొంత మండలాల్లోనే బయోమెట్రిక్ వేయాలన్న నిబంధనలు విధించడం తగదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగ భృతి లబ్ధిదారులను తగ్గించుకునే యత్నాల్లో భాగంగానే ఇటువంటి నిబంధనలు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగాల కోసం ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగులు తాజా నిబంధనతో నిరుద్యోగ భృతిని పొందలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మొదటి నుంచీ నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తునే ఉందని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పథకాలను కాపీ కొడుతున్న సీఎం చంద్రబాబునాయుడుకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. డ్వాక్రా రుణమాఫీ పేరుతో మహిళలను మోసం చేశారని, తాజాగా పసుపు కుంకుమ పేరుతో మరోసారి మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. -
డ్వాక్రా రుణమాఫీ పేరుతో మోసం
శ్రీకాకుళం, కొత్తూరు: డ్వాక్రా రుణమాఫీ పేరుతో మహిళలను సీఎం చంద్రబాబు నాయుడు మోసగించారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి దుయ్యబట్టారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2014 ఎన్నికల సమయంలో మహిళా సంఘాల రుణాలు రద్దు చేస్తానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారని ధ్వజమెత్తారు. పసుపు–కుంకుమ పేరుతో ప్రతి డ్వాక్రా సభ్యురాలి ఖాతాకు రూ.10వేలు జమ చేస్తామని చెప్పి ఇంతవరకు పూర్తిస్థాయిలో చెల్లించలేదని మండిపడ్డారు. రుణమాఫీ కాకపోవడంతో మహిళా సంఘాలు సభ్యులు అప్పులు ఊబిలో కూరుకుపోయారని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున మరోసారి మోసం పూరితమైన హామీలు ఇచ్చేందుకు చంద్రబాబు వస్తాడని, ఈసారి వాటిని నమ్మే స్థితిలో జనం లేరని స్పష్టం చేశారు. -
ప్రజాదరణ విజయానికి నాంది
శ్రీకాకుళం, ఎల్.ఎన్.పేట: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు అడుగడుగునా ఎంతో ఆదరణ లభించిందని, వచ్చే ఎన్నికల్లో విజయానికి ఇదే తొలి నాంది కావాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ముగించే వరకు ప్రతి రోజూ ఆయనతో పాటు తాను నడిచానని గుర్తుచేశారు. ఈ పాదయాత్రకు వెళ్లిన అన్ని చోట్లా ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలకడంతో పాటు వారి సమస్యలు తెలియజేశారని, ప్రభుత్వం చేతిలో ఎలా మోసపోయామో వివరించారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వివరించారు. పాదయాత్ర ముగింపు రోజున ఆశేష జనవాహిని హాజరు కావడం విజయానికి తొలిమొట్టుగా చెప్పుకోవచ్చన్నారు. పాదయాత్ర విజయవంతం చేసిన ప్రజలందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి
శ్రీకాకుళం, ఎల్.ఎన్ పేట: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమైన చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో బు ద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధించేందుకు ఉమ్మడి పోరాటం చేద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చి రకరకాల పోరాటాలు చేస్తే కేసులు బనాయించిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని పేర్కొన్నారు. డ్వాక్రా రుణ మాఫీ చేయడంలోనూ, రైతులకు రుణ విముక్తులను చేయడంలోను పూర్తిగా విఫలమైన ఈయనకు వచ్చే ఎన్నికలే చివరి ఎన్నికలు కావాలని ప్ర జలకు పిలుపునిచ్చారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. జాబు కావాలంటే బాబు రావాలని ఊదరగొట్టి, కొత్తగా 40లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగుల్లో ఆశలు కల్పించి ఏమీ చేయలేని మోసగాడిగా మిగిలిపోయారని దుయ్యబట్టారు. మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి రకరకాల పథకాలు కావాలని దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు ఒక్క పథకం కూడా మంజూరు చేయలేని, చేతకాని పరిపాలన నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో కొనసాగుతోందన్నారు. ఇసుక అక్రమ వ్యాపారం, నీరు–చెట్టు పనుల పేరుతో రూ.కోట్లు దోపిడీలతో అధికార పార్టీ నాయకులు అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. రాజధాని పేరుతో ఆక్కడి రైతులకు తీరని అన్యాయం చేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి గెలవలేమని రోజుకో పార్టీతో పొత్తులకు వెంపర్లాడుతున్నారని ఇలాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటం బాధాకరమని అన్నారు. -
అగ్రిగోల్డ్ పాపం టీడీపీదే
శ్రీకాకుళం, ఎల్.ఎన్.పేట: అగ్రిగోల్డ్ పాపంలో చంద్రబాబు, లోకేష్‌తో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు, నాయకులకు వాటాలు ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఈ విషయాన్ని మారుమూల గ్రామాలకు వెళ్లి అడిగితే అక్కడి బాధితులే బాహాటంగా చెపుతున్నారని పేర్కొన్నారు. ఈ పాపం తెలుగుదేశం పార్టీని శాపంలా వెంటాతునే ఉంటుందన్నారు. అగ్రిగోల్డ్ వ్యాపార లావాదేవీల్లో చంద్రబాబు, లోకేష్‌తో పాటు మంత్రులు జోక్యం చేసుకోకుండా వదిలేస్తే ఏదోవిధంగా తంటాలు పడి వారే మదుపుదారులకు చెల్లింపులు చేసేవారని అన్నారు. విలువైన ఆస్తులు స్వాహా చేసుకునేందుకు లోకేష్ రంగంలో దిగడంతో ఖాతాదారులు నెత్తిన టోపీ పెట్టించారని విమర్శించారు. ఆధారాలతో సహా అనేక మంది బాధితులు, అగ్రిగోల్డ్ ఏజెంట్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే పాలకులు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారని విమర్శించారు. పొదుపు చేసుకున్న బాధితులకు చెల్లించేందుకు అవసరమైన రూ.1100 కోట్లు ప్రభుత్వమే చెల్లించి స్వాహా చేసుకున్న ఆస్తులు విక్రయించాలన్నారు. కోర్టుకు కూడా తప్పుదారి పట్టిస్తున్న పాలకులు తీరు అందరికీ తెలిసిందే అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు కాజేసేందుకు మీరు చేసిన కుట్రలో అమాయకులైన డిపాజిట్‌దారులు బలైపోవాల్సిందేనా? అని నిలదీశారు. ఎన్నో ఫైనాన్స్ కంపెనీలు బోర్డులు తిప్పేసిన వెంటనే ఖాతాదారులకు చెల్లింపు జరిగాయని, అగ్రిగోల్డ్ విషయంలో అలా ఎందుకు జరగలేదన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు మీకు అవసరం కాబట్టి కోర్టును కూడా తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. న్యాయం కోసం పోరాడుతున్న ఖాతాదారులను ఎందుకు అరెస్టులు చేస్తున్నారని నిలదీశారు. -
తెలంగాణ ఫలితాలు బాబుకు చెంపపెట్టు
శ్రీకాకుళం , పాతపట్నం/ఎల్.ఎన్.పేట: విలువలు లేకుండా సొంత లాభం కోసం సిద్ధాంతాలను మరిచి కాంగ్రెస్‌పార్టీతో జతకట్టి, ప్రజాకూటమి పేరుతో మోసం చేయాలని చూసిన ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ ఫలితాలు చెంపపెట్టు లాంటింవని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో తిత్లీ తుపాను, తీవ్ర వర్షాభావం నెలకొని దుర్భిక్ష పరిస్థితుల్లో ప్రజలు అల్లాడి పోతుంటే సీఎం మాత్రం దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ గొప్పలకు పోతున్నారని విమర్శించారు. ఒడిశాలో టీడీపీ పోటీ చేస్తుందని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు. రాష్ట్రంలో సంపాదించిన అవినీతి సొమ్ముతో వందల కోట్ల రూపాయలు తెలంగాణా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఆరోపించారు. టీడీపీ అవినీతిని చూసి తెలంగాణ ప్రజలకు విరక్తిపుట్టి, ప్రజాకూటమికి వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. చంద్రబాబు ప్రచారంతో కాంగ్రెస్‌పార్టీ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. తానే హైటెక్ సిటీని నిర్మించినట్లు చెప్పిన పరిసర ప్రాంతాలైన శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, కూకట్‌పల్లిలో కూటమి అభ్యర్థులు 40 వేల ఓట్లకు పైగా వ్యత్యాసంతో ఓడిపోవడం చూస్తే ప్రజల్లో టీడీపీపై ఉన్న వ్యతిరేకత ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చునని స్పష్టంచేశారు. విలువల్లేని టీడీపీకి ఏపీలోనూ పరాభవం తప్పదని ఆమె ధీమా వ్యక్తంచేశారు. -
రుణమాఫీ పేరుతో మోసం
శ్రీకాకుళం ,కొత్తూరు: డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు బూటకపు హామీలిచ్చి మహిళలను మోసం చేశారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి దుయ్యబట్టారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రుణాలు మాఫీ చేస్తామని, బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దని చెప్పడంతో నిజమేననుకుని మహిళలు నమ్మేశారని, తర్వాత అప్పుల్లో కూరుకుపోయారని పేర్కొన్నారు. తిత్లీ తుఫాన్ నేపథ్యంలో రుణాలు సకాలంలో చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బూటకపు హామీతో మోసగించిన చంద్రబాబునాయుడుకు వచ్చే ఎన్నికల్లో మహిళలు తగిన గుణపాఠం చెబుతారని ఆమె పేర్కొన్నారు. -
టీడీపీ నేతలకే పరిహారమా?
శ్రీకాకుళం / ఎల్.ఎన్.పేట: గత నెల పదో తేదీన విరుచుకుపడిన తిత్లీ తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, ఎక్కువ శాతం తెలుగుదేశం నేతలకే పరిహారం అందుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. లక్షలాది మంది రైతులు పంటలు, పండ్ల తోటలు నష్టపోయి నిరాశ్రయులుగా మిగిలారని చెప్పారు. ఇళ్లు, పశువుల పాకలు ఎగిరిపోయి ఇప్పటికీ గూడు లేక అనాథలకు చెందాల్సిన పరిహారాన్ని టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యుల పేర్లతో స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాలను కూడా ప్రచారంగా మార్చుకునే ముఖ్యమంత్రి భారతదేశంలో చంద్రబాబు ఒక్కరే అని విమర్శించారు. ప్రచారం కోసం ఖర్చు పెట్టిన రూ.కోట్లు బాధితులకు ఇస్తే సంతోషించేవారని ఆమె పేర్కొన్నారు. -
శ్రీకాకుళంలో తుపాను బాధితుల ధర్నా
శ్రీకాకుళం: నరసన్నపేట, పాతపట్నం ఎమ్మార్వో ఆఫీసుల ఎదుట తుపాను బాధితులతో కలిసి వైఎస్సార్సీపీ నేతలు ధర్మాన కృష్ణదాస్, రెడ్డి శాంతి, తదితరులు ధర్నా నిర్వహించారు. పంట, ఆస్తినష్టం అంచనా వేసి వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో దయనీయ పరిస్థితులు ఉన్నాయని, 9 రోజులైనా ప్రభుత్వం నుంచి సరైన సాయం అందలేదని తుపాను బాధితులు అన్నారు. కనీస సౌకర్యాలైన తాగునీరు, ఆహారం కూడా ప్రభుత్వం కల్పించలేదని ఆందోళన చేశారు. తుపాను నష్టం అంచనా వేయడానికి అధికార బృందాలు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టం జరిగి 9 రోజులైనా విద్యుత్ పునరుద్ధరించలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. పాతపట్నం మండలం కొరసవాడ, బురగాం వద్ద బాధితులు రాస్తారోకోకు దిగారు. దీంతో ఒడిశా, ఆంధ్రా మధ్య రాకపోకలకు అంతరాయమేర్పడింది. -
నిర్వాసితులను ఆదుకోని ప్రభుత్వం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వంశధార ప్రాజెక్టు పనులు పూర్తి చేసేస్తామంటూ నిర్వాసిత గ్రామాలను బలవంతంగా ఖాళీ చేయించి, వారిని నిరాశ్రయులను చేసి రోడ్డున పడేశారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి విమర్శించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తిత్లీ తుఫాన్ దెబ్బకు రేకుల షెడ్లు, పూరి గుడిసెలు ఎగిరిపోయి కట్టుబట్ట, తాగునీరు లేకుండా ఎక్కడ తలదాచుకోవాలో తెలియక, దిక్కులేని వారిగా ఉన్న నిర్వాసితులను పట్టించుకున్నవారే కరువయ్యారన్నారు. హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, ఆమదాలవలస, సరుబుజ్జిలి మండలాల్లో దాదాపుగా వెయ్యి కుటుంబాలకు పైగా తలదాచుకునే పరిస్థితి లేకుండా నానాపాట్లు పడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం సభలు, సమావేశాల్లో నిర్వాసితులకు అన్ని చేసేశామంటూ ఊకదంపుడు ప్రచారాలు చేస్తున్నారు మినహా, ఇప్పటికీ మౌలిక వసతులు కల్పించలేదని వ్యాఖ్యానించారు. వంశధార నదీ పరివాహక ప్రాంతంలోని గ్రామాల్లోకి ఎప్పుడు వరదనీరు వస్తుందోనని భయాందోళన చెందుతున్నారని, తంపర భూములు నీటమునిగి నష్టాల పాలయ్యారని గుర్తుచేశారు. ప్రభుత్వం ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు హడావిడి చేయడం తప్పితే, ముందస్తుగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే ఆలోచన లేకపోవడం కారణంగానే విపత్తుల సమయంలో తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి నష్టాలబారిన పడిన నిర్వాసితులను ఆదుకుని, తక్షణమే అన్ని సౌకర్యాలతో కూడిన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రకృతి విపత్తుల పేరుతో విరాళాలు సేకరించి టీడీపీ పెద్దలు తమ జేబులు నింపుకుంటున్నారు తప్పితే, నష్టపోయిన వారికి అందడం లేదన్నారు. పరిహారాలు అందించడంలో చవకబారు రాజకీయాలు విరమించి, అర్హులైన లబ్ధిదారులకు పరిహారం అందించాలని ఆమె డిమాండ్ చేశారు. -
వైఎస్సార్ సీపీతోనే ప్రజా సంక్షేమం
శ్రీకాకుళం, మెళియాపుట్టి: రాష్ట్రంలో ప్రజా సంక్షేమం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి అన్నారు. ఆదివారం గొప్పిలిలో రావాలి జగన్..కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి నవరత్నాల పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. మూడు రోడ్ల జంక్షన్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామస్తులనుద్దేశించి రెడ్డి శాంతి మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతి కోసం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పేదలకు వరమని చెప్పారు. 45 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.2వేలు, దివ్యాంగులకు నెలకు రూ.3వేలు పింఛన్ అందిస్తామని తెలిపారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేపడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే మూడు వేల కిలోమీటర్ల మేర యాత్ర పూర్తి చేశారని తెలిపారు. ప్రజలు మరింతగా ఆదరించి వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు. రాజన్న రాజ్యం వస్తే ప్రజా సమస్యలన్నీ పరిష్కారమవుతాయని భరోసా ఇచ్చాన్నారు. హామీలతో మోసగించిన టీడీపీకి, ఫిరాయింపు నాయకులకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఇళ్లు, ఫించన్లు మంజూరు కావడం లేదని, తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు గ్రామస్తులు రెడ్డి శాంతి దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పాడి అప్పారావు, బూత్ కమిటీ నియోజకవర్గ మేనేజర్ జిల్లా ప్రధాన కార్యదర్శి అలికాన మాధవరావు, జెడ్పీటీసీ ప్రతినిధి బమ్మిడి ఖగేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు బైపోతు భాస్కరరావు, నాయకులు సీహెచ్ శ్రీకర్ణ, పోలాకి జయమోహనరావు, పెద్దింటి చిన్నారావు, పల్లి యోగి, బైపోతు ఉదయ్‌కుమార్, నక్క బాబూరావు, రంగారావు, నారాయణ, మార్కండేయులు, తేజారావు, రుషి, శంకరరావు, ముఖలింగం, దువ్వాడ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో తమ్మినేని ఆమదాలవలస: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో పార్టీ శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఆదివారం విజయనగరం జిల్లా గుర్ల మండలంలో జరి గిన పాదయాత్రలో అధినేతతో కలిసి అడుగులు వేశారు. ప్రజా సమస్యలు, ఓటర్లు గల్లంతు తదితర అంశాలపై చర్చించారు. జననేతను కలిసిన దువ్వాడ టెక్కలి: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ఆదివారం కలిశారు. యువనేత చేపడుతున్న ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా విజయనగరం జిల్లా గుర్ల మండలం కెల్ల గ్రామం సమీపంలో అధినేతను కలిసి జిల్లాలో పార్టీ పరిస్థితులను వివరించారు. జగన్మోహన్రెడ్డితో కలిసి కొంతదూరం పాదయాత్ర చేశారు. -
అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపండి
శ్రీకాకుళం, కొత్తూరు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాతపట్నం నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి శాంతి శుక్రవారం కొత్తూరు మండల కేంద్రంలో పాదయాత్ర నిర్వహించారు. కొత్తూరు నుంచి నీలకంఠాపురం వరకు 7 కిలోమీటర్ల మేర నడిచి వంశధార ప్రాజెక్టు నిర్వాసితులు, విద్యార్థులు, మహిళలు, రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి కాగానే అందరి సమస్యలను పరి ష్కరిస్తారని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మండలంలోని మెట్టూ రుకు చెందిన పలువురు నేతలు వైఎస్సార్ సీపీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సారిపల్లి ప్రసాదరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి అప్పన్న, యువజన నేత పడాల లక్షణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కన్నయ్యస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సంకల్ప యాత్రలో రెడ్డి శాంతి
పాతపట్నం: ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాతపట్నం నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి శాంతి పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో శనివారం పాదయాత్ర చేస్తున్న జగన్మోహన్రెడ్డిని కలిసి సిక్కోలు రాజకీయ పరిస్థితులను వివరించారు. -
మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందజేయాలి
కొత్తూరు : రిమ్స్ ఆస్పత్రిలో రోగులకు వేసిన ఇంజెక్షన్ వికటించి మృతి చెందిన ముగ్గురువి ప్రభుత్వ హత్యలేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి అన్నారు. కొత్తూరులో ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడారు. పేదలకు కార్పోరేట్ వైద్యం అందుబాటులో అందించేందుకు దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి జిల్లా కేంద్రంలో రిమ్స్‌ను ఏర్పాటు చేశారన్నారు. అయితే దివంగత నేత ఏ లక్ష్యంతో రిమ్స్ ఏర్పాటు చేశారో ఆందుకు భిన్నంగా నేటి ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పారు. వైద్యాన్ని ప్రభుత్వం కేవలం వ్యాపారంగా మార్చిందని రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కరువు మందుల కంపెనీలతో పాలక పక్షం నేతలు కుమ్ముక్కైనందున వలనే కల్తీ మందులు, నాసిరకం మందులు ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా అవుతున్నాయన్నారు. రిమ్స్‌లో సరైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించడం లేదని చెప్పారు. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేక పోవడం వలనే ప్రజలు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయన్నారు. నాణ్యతలేని మందులు సరఫరా వలనే ప్రాణాలు పోవడంతో ప్రభుత్వ ఆస్పత్రిలు అంటే ప్రజల్లో భయపడే విధంగా ప్రభుత్వం తయారు చేసిందన్నారు. ఇంజెక్షన్ వికంటించి మృతి చెందిన వారిలో పాతపట్నం నియోజవర్గం పరిధి కొత్తూరు మండలం కాశీపురానికి చెందిన ఇస్సై శైలు మృతి చెందినట్టు చెప్పారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే రూ.20 లక్షలు ఎక్స్ గ్రేషియో చెల్లించాలని రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. అదే విధంగా అస్వస్థతకు గురైన వారికి లక్ష రూపాయలు చెల్లించాలన్నారు. కల్తీ మందులు వలనే ముగ్గురు మృతి చెందా రన్నారు. ప్రభుత్వం బాధ్యత వహించి మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని రెడ్డి శాంతి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. వైద్యాన్ని ప్రభుత్వం పూర్తిగా ప్రైవేట్‌పరం చేసి సర్కార్ వైద్యాన్ని పట్టించుకోకపోవడం వల్లే పేదలు ప్రాణాలు పిట్టలు రాలిపోతున్నా, పాలకులకు పట్టడం లేదని రెడ్డి శాంతి అన్నారు. మృతి చెందిన మూడు రోజులు గడుస్తున్నా మృత దేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. మూడు రోజులుగా మృత దేహాల కోసం ఆస్పత్రి చుట్టూ కుటుంబ సభ్యులు తిరుతున్నా అప్పగించక పోవడం దారుణమన్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. -
వరద బాధితులను ఆదుకోండి
శ్రీకాకుళం, కొత్తూరు: వంశధార, నాగావళి నదులు ఉప్పొంగడంతో జిల్లాలోని నదీతీర ప్రాంతాల్లో వరి, కూరగాయలతో పాటు పలు రకాల పంటలకు నష్టం వాటిల్లిందని, బాధిత రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. ఎకరాకు రూ.30 వేలు చొప్పున పరిహారం అందజేయాలని కోరారు. ఆదివారం కొత్తూరు మండలం కుంటిభద్రతో పాటు పరిసర గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏటా వరదల కారణంగా నదీ తీర ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతున్నా బాధిత రైతులకు న్యాయం చేయాలన్న ఆలోచన ఫిరాయింపు ఎమ్మెల్యేకు లేకపోవడం దారుణమన్నారు. గత ఏడాది సంభవించిన వరద నష్టానికి ఇప్పటికీ పరిహారం అందించకపోవడం శోచనీయమన్నారు. ఇసుక ర్యాంపులు, నీరు–చెట్టు పనులు, మందుగుండ సామాన్ల నిల్వల అనుమతులు కోసం చూపించిన శ్రద్ధ వరద బాధిత రైతులపై లేకపోవడం సిగ్గుచేటన్నారు. టీడీపీ నేతలకు స్వప్రయోజనాలు తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదని దుయ్యబట్టారు. తాజా వరదలో నీటమునిగిన పంటపొలాలపై సర్వే చేసి బాధిత రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఏటా పంట నీటమునగడంతో తీవ్రంగా నష్టపోతూ అప్పుల్లో కూరుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వరద గట్లు నిర్మించకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురిస్తోందని వాపోయారు. కార్యక్రమంలో పార్టీ నేతలు అగతమూడి నాగేశ్వరరావు, పంకజదాస్, మాజీ ఉప సర్పంచ్ ఎద్దు హరిదాసు, ఆఫీసు, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్డీయే పై అవిశ్వాసం టీడీపీ-బీజేపీ డ్రామా
-
పాఠ్య పుస్తకాలు ఎప్పుడిస్తారు?
పాతపట్నం: విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పాఠశాలలు ప్రారంభించి పది రోజులు గడుస్తున్నా ఇంత వరకు విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు సరఫరా చేయకపోవడమే ఇందుకు నిదర్శమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యాదర్శి, పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి అన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వేసవి సెలవుల్లోనే పాఠ్యపుస్తకాలను అందజేయాల్సి ఉన్నా పాలకులు నిర్లక్ష్యం వహించారని దుయ్యబట్టారు. పుస్తకాలు అందజేయకపోతే పాఠాలు బోధిస్తారని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎప్పటికప్పుడు టెలి కాన్ఫరెన్స్‌లు, సమావేశాలు ఏర్పాటు చేసి సమయాన్ని వృథా చేయడమే తప్ప ఇంత వరకు పుస్తకాలు, యూనిఫాం అందజేయలేదన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమవుతాయని స్పష్టం చేశారు. -
ప్రతి పథకం టీడీపీ నేతల మేతకే
పాతపట్నం: గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఎలాంటి పథకాలు అమలు చేసినా ఆ పథకాలన్నీ తెలుగుదేశం పార్టీ నేతల మేతకే ఉపయోగపడ్డాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి ఆరోపించారు. పాతపట్నంలోని ఆ పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మం జూరు చేసే ప్రతి పథకాన్ని టీడీపీ నాయకులు స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. జన్మభూమి కమిటీలు, జిల్లా ఇన్చార్జి మంత్రి సిఫార్స్‌లు అని రకరకాల వంకలు చూపించి అధికార పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పథకాలు అందేలా చూస్తున్నారని మండిపడ్డారు. పింఛన్, రేషన్ కార్డు, కాలనీ ఇళ్లు, రాయితీ రుణాలు, వంశధార నిర్వాసితులకు ఇచ్చే పలు రకాల ప్యాకేజీలు ఇలా అన్ని అధికార పార్టీ నాయకులే స్వాహా చేస్తున్నారని వివరించారు. ఇటీవల ప్రభుత్వం రైతు రథాలు పేరుతో రాయితీపై మంజూరు చేసిన ట్రాక్టర్లు జన్మభూమి కమిటీ సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికార పార్టీ కీలక నేతలు, పార్టీ ప్రధాన కార్యకర్తలు దక్కించుకున్నారని అన్నారు. మెళి యాపుట్టి మండలంలో పలువురు దళితుల పేరుతో మంజూరు చేసిన రైతు రథాలు (ట్రాక్టర్లు) అక్కడి అధికార పార్టీ నేతలే స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. దళితులకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను పక్కదారి పట్టించి ఇతర కులాలకు చెందిన భూస్వాములు, పెద్దలు అధికార పార్టీ అండతో స్వాహా చేసుకుంటున్నారని అన్నారు. రైతులు రథాల కోసం స్థానిక ఎమ్మెల్యే కోటా నుంచి రూ.1.50 లక్షలు రాయితీ ఇస్తుండగా ఇందుకు ప్రభుత్వం మరో రూ.లక్ష రాయితీ చెల్లిస్తుందని అన్నారు. దళితుల పేరున వచ్చే రైతు రథాలకు మొత్తం రూ.2.50లక్షలు రాయితీ ఉంటుందని చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో రైతుల కోసం రాయితీ ఇచ్చే పథకాలు మరేవీ లేవన్నారు. అందుకే ఈ పథకాలపై అధికార పార్టీ పెద్దలు కన్నేసి దారి తప్పిస్తున్నారని ఆరోపించా రు. ఆమెతో పాటు పాతపట్నం, కొత్తూరు వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు రేగేటి సన్ముఖరావు, సారిపల్లి ప్రసాదరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి ఖగేశ్వరరావు, గిరిజన నాయకుడు సవర సుభాష్, రాష్ట్ర పంచాయతీ రాజ్ కార్యదర్శి కొండాల అర్జునుడు, పార్టీ నాయకులు కె.జానకమ్మ, శ్రీకర్ణ, పడాల గోపి, జి.లుట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. -
సౌకర్యాల కల్పనలో సర్కారు విఫలం
శ్రీకాకుళం, పాతపట్నం: సీతంపేట ఐటీడీఏ పరిధిలో అనేక గిరిజన గ్రామాలకు కనీ స సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి దుయ్యబట్టారు. ఈ మేరకు బుధవా రం ఒక ప్రకటన విడుదల చేశారు. సీతంపే ట, కొత్తూరు, భామిని, మెళియాపుట్టి, ఎల్. ఎన్.పేట, పాతపట్నం తదితర మండలాల్లోని చాలా గ్రామాలకు ఇప్పటికీ రహదారి సౌకర్యం లేదన్నారు. అత్యవసర సర్వీసులందించే 108 వాహనాలు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. ముఖ్యంగా తాగునీటి కి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వివరిం చారు. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోర్ల నుంచి చుక్కనీరు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన మండ ళ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ముఖ్య మంత్రి చంద్రబాబు ఆ విషయాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. గత ఎన్నికల్లో గిరిజన ప్రాంతాల్లోని అన్నిచోట్లా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకండా ఓట్లు రావడంతో గిరిజన గ్రామాల అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని, రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నాయకులనే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. -
టీడీపీ డ్రామాలు ప్రజలు నమ్మరు
శ్రీకాకుళం అర్బన్: ఆంధ్ర ప్రజల హక్కు అయిన ప్రత్యేకహోదా ఉద్యమసెగ పార్లమెంట్‌ను తాకిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి అన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విభజనతో కలిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి హోదా తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. సీఎం చంద్రబాబు స్వలాభం కోసం ప్రత్యేక ప్యాకేజీ కోసం కేంద్రం వద్ద మోకరిల్లారని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్లలో ఒక్కసారి కూడా ప్రత్యేకహోదా కోసం టీడీపీ మాట్లాడలేదని, హోదా ఉద్యమం తీవ్రరూపం దాల్చి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఇపుడు ప్రత్యేకహోదా అంటూ కొత్తపల్లవి అందుకుందన్నారు. టీడీపీ డ్రామాలు ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమించిన ప్రతిసారీ పోలీసు యంత్రాంగంతో అణచివేసేందుకు కుట్రలు పన్నిందన్నారు. ప్రత్యేకహోదా విషయంలో ఇప్పటికైనా టీడీపీ తన స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలన్నారు. ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మద్దతు ప్రకటించాలన్నారు. లేదంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. -
హోదాపై ఎంతకాలం మభ్యపెడతారు?
శ్రీకాకుళం అర్బన్: ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజలను ఎంతకాలం మభ్యపెడతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేకహోదాపై ఇప్పటికీ చంద్రబాబు, టీడీపీ ఎంపీలు స్పష్టంగా వారి విధానాన్ని ప్రకటించకపోవడం శోఛనీయమన్నారు. ప్రత్యేకహోదా కావాలని ఒకసారి, హోదా బదులు ప్యాకేజీతోనే మేలు జరుగుతుందని మరొకసారి చంద్రబాబు, ఆ పార్టీ నేతలు పేర్కొనడం వారి అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. టీడీపీ అదికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తవుతున్నా ఒక్కసారి కూడా ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై చంద్రబాబు గానీ, ఆ పార్టీ నేతలు గానీ డిమాండ్ చేయలేదన్నారు. హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు చంద్రబాబు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఒక్కసారి కూడా ఢిల్లీకి తీసుకువెళ్లలేదన్నారు. ఇప్పటికైనా హోదాపై టీడీపీ స్పష్టమైన విధానాన్ని ప్రకటించకుండా అన్ని పార్టీలతో కలసి పోరాడతామని ఆ పార్టీ ఎంపీలు ప్రకటించడం రాష్ట్ర ప్రజలను మోసగించేందుకేనని దుయ్యబట్టారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు.. ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి డిమాండ్ చేస్తే ఎక్కడ ఆ కేసును తిరగదోడతారోననే భయంతోనే రాష్ట్ర ప్రజల హక్కు అయి న ప్రత్యేకహోదాను పక్కన పెట్టారని రెడ్డి శాంతి విమర్శించారు. ప్రత్యేక ప్యాకేజీ అయితే చంద్రబాబు, ఆయన బినామీలు జేబులు నింపుకొనే అవకాశం ఉంటుందని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం మొదటి నుంచి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పోరా టాలు, ధర్నాలు, దీక్షలు చేశారన్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టంచేశారు. హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్మోహన్రెడ్డి ప్రకటించారని గుర్తుచేశారు. ఇందులో భాగంగానే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ల వద్ద హోదా కోరుతూ మహాధర్నా నిర్వహించామన్నారు. రెండవ దశ కార్యక్రమంలో భాగంగా ఈనెల 5వ తేదీ న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ధర్నా నిర్వహిస్తున్నారని రెడ్డి శాంతి అన్నారు. హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, ప్రజల తిరుగుబాటు, ఆగ్రహాన్ని గుర్తించిన టీడీపీ, ఆ పార్టీ నేతలు ఇపుడు ప్రత్యేకహోదా పల్లవిని అందుకున్నారన్నారు. ఇదంతా కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు ఆడుతున్న కపట నాటకమని దుయ్యబట్టారు. విశాఖ రైల్వేజోన్ కోసం కృషిచేస్తున్నానంటూ మీడియాముందు, సమావేశాల్లో జిల్లా ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు చెప్పడమే తప్ప ఢిల్లీలో ఒక్కసారి కూడా మాట్లాడిన సందర్భం లేదని ధ్వజమెత్తారు. -
రాష్ట్రాన్నితాకట్టుపెట్టిన చంద్రబాబు
శ్రీకాకుళం అర్బన్: విభజన అనంతరం ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆర్థికపరంగా ముందుకు వెళ్లాలంటే ప్రత్యేకహోదాతోనే సాధ్యమని, ఇది తెలిసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మొదటినుంచి ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నారన్నారు. హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, పరిశ్రమలు వస్తాయన్నారు. తద్వారా ఉపాధి అవకాశాలతో యువత, విద్యార్థుల భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందన్నారు. ఇదే లక్ష్యంతో ప్రతిపక్షనేతగా జగన్మోహన్రెడ్డి గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పోరాటాలు, దీక్షలు చేశారన్నారు. ప్రత్యేకహోదా ఆవశ్యకతను, హోదా లభిస్తే కలిగే ప్రయోజనాలను యువతకు వివరించేందుకు అన్ని జిల్లాల్లో ‘యువ భేరి’లు కూడా నిర్వహించారన్నారు. 2014 ఎన్నికల సమయంలో తిరుపతి వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి హోదా తెస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి ఐదుకోట్ల ప్రజలను నమ్మించి వారితో ఓట్లు వేయించుకున్నారన్నారు. అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలకు తిలోదకాలిచ్చారని దుయ్యబట్టారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు సమాధి కడుతూ హోదా కంటే ప్యాకేజీకే మొగ్గుచూపారన్నారు. 2014 ఎన్నికల సమయంలో బాబుకు ఓటెయ్యాలని, రాష్ట్రాభివృద్ధి బాబుతోనే సాధ్యమని అందుకు తనది హామీ అంటూ ప్రజలను నమ్మబలికిన పవన్‌కల్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబును ఈ నాలుగేళ్లలో ఒక్కసారైనా నిలదీశారా? అని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా కోసం జగన్ చేస్తున్న పోరాటానికి ఈ నాలుగేళ్లలో ఒక్కసారి కూడా మద్దతు ఇవ్వని చంద్రబాబును పవన్‌కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రజాస్వామ్య విరుద్ధంగా, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి టీడీపీలో చేర్పించుకున్నారన్నారు. దీనిపై పవన్‌కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఈ నాలుగేళ్లలో ఒక్కసారి కూడా కేంద్రంపై నోరుమెదపని చంద్రబాబు హఠాత్తుగా మాట మార్చి కేంద్రం ఏమీ చేయలేదని చెప్పడం ఎన్నికల డ్రామాగా అభివర్ణించారు. బాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. టీడీపీ పాలనలో ప్రజలెవ్వరికీ న్యాయం జరగలేదని, కేవలం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూర్చారన్నారు. టీడీపీ ప్రలోభాలకు లొంగి ఆ పార్టీలో చేరినట్లు కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ ఇటీవల స్వయంగా మీడియా సమావేశంలో వెల్లడించారని గుర్తు చేశారు. ఆయనలాగే జిల్లాలో కలమట వెంకటరమణతో సహా ఫిరాయింపు ఎమ్మెల్యేలందరూ కేవలం నజరానాలకు ఆశపడే పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజలంతా ఈ విషయాన్ని గ్రహించారని వారికి తగిన బుద్ధి చెబుతారన్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్న జగన్మోహన్రెడ్డికి చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు మద్దతివ్వాలన్నారు. -
‘జన్మభూమి’తో సాధించిందేమిటి?
ఎల్.ఎన్.పేట: జన్మభూమి పేరుతో ఏడాదికోసారి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమంగా మార్చుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి దుయ్యబట్టారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు 5 విడతల్లో జన్మభూమి మాఊరు కార్యక్రమాన్ని నిర్వహించి ఏం సాధించారో ముఖ్య మంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు ఒక్కటీ పరిష్కరించలేని దుస్థితిలో పరిపాలన సాగుతోందని దుయ్యబట్టారు. సభల నిర్వహణ పేరుతో ప్రభుత్వం రూ.99 లక్షలు ఖర్చు చేసిందన్నారు. గ్రామ సభలకు వెళ్లిన అధికారులను, తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రజలే నిలదీశారని గుర్తు చేశారు. నాలుగేళ్ల పాలనలో ఒక్క హామీ నెరవేర్చలేని ముఖ్యమంత్రిగా చంద్రబాబు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. -
చంద్రబాబు బుద్ధి మారలే
శ్రీకాకుళం అర్బన్: అలవిగాని ఆరొందల హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత ఏ ఒక్కటీ నెరవేర్చని విషయాన్ని ప్రజలు గ్రహించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. అధికారం కోసం నాడు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కే కాదు ప్రజలకూ వెన్నుపోటు పొడిచిన ఘన చరిత్ర ప్రపంచంలో చంద్రబాబు ఒక్కడికే సొంతమని విమర్శించారు. వయస్సు పెరిగిన కొద్దీ మార్పు వస్తుందని ప్రజలు భ్రమ పడవద్దని, ఆయన బుద్ధి ఎప్పుడూ మారని రీతి అని వ్యంగ్యంగా అన్నారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం విలేకరులతో ఆమె మాట్లాడారు. చంద్రబాబు చెప్పేదొకటి, చేసేది మరొకటి అన్నారు. తొలినుంచీ ఆయన అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారని విమర్శించారు. రైతుల రుణమాఫీ రూ.84 వేల కోట్లు కాగా వడ్డీతో కలిపి రూ.లక్ష కోట్లు దాటిందన్నారు. కేవలం రూ.25 వేల కోట్లు ఇచ్చి మొత్తం అయిపోయిందన్నట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రత్యేక విభజన చట్టం ద్వారా హక్కుగా వచ్చిన ప్రత్యేక హోదాను పోలవరం ప్రాజెక్టులో కమీషన్లు కోసం తాకట్టుపెట్టిన చరిత్ర చంద్రబాబుదేనని ఆరోపించారు. పోలవరమే కాదు వంశధార నిర్వాసితులకూ తగిన న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మూడున్నరేళ్ల అవినీతి పాలనతో చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిని అధఃపాతాళానికి నెట్టేశారని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలూ ఆయన్ను కలిసి తమ సమస్యలు మొరపెట్టుకుంటున్నారని చెప్పారు. ప్రజల సమస్యలను తీర్చడానికి అన్నివిధాలా ఆలోచించి ప్రకటించిన నవరత్నాల్లాంటి హామీలు అమలైతే ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. అందుకు జగన్ నాయకత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. చంద్రబాబు పాలన అధ్వానం: కృష్ణదాస్ ♦ వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు పాలన అధ్వానంగా ఉందన్నారు. ఆయన అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. చంద్రబాబు మాత్రం తాను నీతి, నిప్పు అని చెప్పుకుంటున్నారని, అది నేతిబీరకాయలో నెయ్యి మాదిరేనని వ్యాఖ్యానించారు. ఆయన అవినీతిపాలనకు కాలం దగ్గర పడిందని, ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. హామీలకే పరిమితం:రెడ్డి శాంతి ♦ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాతపట్నం ఇన్చార్జ్ రెడ్డి శాంతి మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో గత మూడున్నరేళ్ల కాలంలో జిల్లాకు తొమ్మిదిసార్లు వచ్చినా హామీలు, శంకుస్థాపనలకే పరిమితమయ్యారని చెప్పారు. జిల్లాలో నాలుగు లక్షలకు పైగా జనాభా వలసబాట పడుతుంటే వారి సంక్షేమానికి తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. టీడీపీ నేతల మోసాలను ప్రజలు నిలదీయడానికి సిద్ధమయ్యారని చెప్పారు. స్నేహపూరిత వాతావరణంలో జరగాల్సిన ‘జన్మభూమి–మాఊరు’ గ్రామసభలను ప్రభుత్వం పోలీసు పహారా మధ్య నిర్వహించడమే దీనికి నిదర్శనమని అన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మామిడి శ్రీకాంత్, శ్రీకాకుళం నగర గౌరవాధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి టి.కామేశ్వరి, నేతలు మూకళ్ల తాతబాబు, కోరాడ రమేష్, తంగుడు నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
దోచుకోవడమే వారి పని
శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దోచుకొని..దాచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి అరోపించారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నవంబర్ 6వ తేదీ నుంచి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేపట్టారని, పార్టీ నాయకులందరికీ అన్ని నియోజకవర్గాల్లో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారన్నారు. ఈ ఆదేశాల మేరకు నవంబర్ 13వ తేదీ నుంచి రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. దీని ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, కష్టాలను తెలుసుకుంటున్నామన్నారు. టీడీపీ అధికారం చేపట్టి నాలుగేళ్లు అవుతోందని, ఈ కాలంలో ప్రజల కష్టాలు వర్ణనాతీతమన్నారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీ లు అమలు చేస్తామంటూ 600 హామీలను గుప్పించా రని, అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. పాలన పక్కనపెట్టి ఇసుక, మద్యం మాఫియా చేసేందుకే అధికార పార్టీ నాయకులు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న ఇసుక రీచ్లకంటే అదనంగా రీచ్‌లను మంజూరు చేయించుకుని ఇసుక మాఫియాకు తెరతీశారని ఆరోపించారు. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో వరి పంట తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు చాలా వరకూ నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కనీసం ఒక్క సమీక్షా సమావేశం కూడా నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. నేరడి వద్ద వంశధార ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా ట్రిబ్యునల్ తీర్పు వచ్చినప్పటికీ ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వానికి ఏ అంశంపై కూడా చిత్తశుద్ధి లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును తానే నిర్మాణం చేపడతానని బాబు చెప్పారని, పనులు కూడా ప్రారంభించారని, దీనిపై కేంద్రం లెక్కలు అడిగేసరికి ఇపుడు తప్పించుకునేందుకు యత్నిస్తున్నారన్నారు. ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీని నిర్వహించడం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ చట్టాలను పరిహసించడమేనన్నారు. ప్రతిపక్షం లేకుండా చేసేందుకు చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని, తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలు పడుతున్న బాధలు, సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తూ అన్ని వర్గాలకూ తానున్నానంటూ భరోసాను ఇస్తున్నారన్నారు. -
నిందితులను అరెస్టు చేయండి
శ్రీకాకుళం అర్బన్: పాతపట్నం మండలం, పెద్దలోగిడి గ్రామానికి చెందిన ఆదివాసీ బాలిక అగదల పార్వతిపై లైంగిక దాడిచేసి హత్య చేశారని, ఈ కేసులో నిందితులను తక్షణమే అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆ శాఖ అధ్యక్షుడు వి.యోగి ఆధ్వర్యంలో పలు సంఘాల ప్రతినిధులతో శ్రీకాకుళంలోని ఎన్జీవో కార్యాలయంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదివాసీ బాలిక పార్వతి టెక్కలి జూనియర్ కళాశాలలో చదువుతోందన్నారు. పార్వతి చనిపోవడానికి గల కారణాలను వెలికితీయాలన్నారు. ఈ కేసు విషయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీవో ఉదాసీన వైఖరి అవలంబించడం శోచనీయమన్నారు. స్థానిక ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఈ కేసులో జోక్యం చేసుకోకపోవడం దుర్మార్గమన్నారు. గిరిజన ప్రజలు పాతపట్నంలో శిబిరం వేసి నిరాహారదీక్షలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు వంకల మాధవరావు మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన బాలిక పార్వతిపై గంగువాడకు చెందిన గిరిజనేతరులు బాలి రాజారావు, ఆయన స్నేహితులు లైంగిక దాడిచేసి హత్య చేశారని, ఈ సంఘటన ఆగస్టు 22వ తేదీన జరిగినప్పటికీ ఇంతవరకూ పోలీసులు కేసులో ఎటువంటి పురోగతి చూపకపోవడం శోచనీయమన్నారు. ఈ కేసులో కేవలం ఒక నిందితుడిని అరెస్ట్ చూపించి కేసు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. మానవహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.వి.జగన్నాథరావు మాట్లాడుతూ ఈ కేసు పురోగతి కోసం సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు వాబ యోగి, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి టి.కామేశ్వరి, డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోత ధర్మారావు, , పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.వినోద్, ఇఫ్టూ జిల్లా కార్యదర్శి ఎన్.నీలంరాజు, కేఎన్పీఎస్ రాష్ట్ర సమాఖ్య కార్యదర్శి మిస్క కృష్ణయ్య, ఐఎఫ్టీయూ జిల్లా కన్వీనర్ జుత్తు వీరాస్వామి, ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి కానుకుర్తి శంకరమాదిగ, అరుణోదయ కార్యదర్శి కె.సోమేశ్వరరావు, పలు సంఘాల ప్రతినిధులు కె.భాస్కరరావు, కె.రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పార్వతి కేసును పరిష్కరించాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి పాతపట్నం : గిరిజన విద్యార్థిని పార్వతి కేసును పోలీసులు త్వరగా పరిష్కరించాలని, దోషులను శిక్షించి, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి అన్నారు. పార్వతి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజనులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షా శిబిరంలో ఆమె శనివారం పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసులు, అధికార పార్టీ నేతలతో చేతులు కలిపి కేసును నీరు కారుస్తున్నారని ఆరోపించారు. కేసు పరిష్కారంలో దోషులు తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటారన్నారు. ఆమెతో పాటు పార్టీ మండల అధ్యక్షుడు రెగేటి షణ్ముఖరావు, నాయకులు కొండాల అర్జునుడు, పి.వి.వి.కుమార్, రెడ్డి రాజు, మద్ది నారాయణరావు, యడ్ల గోవిందరావు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకుడు బైరి కూర్మారావు, టి.బాబురావుతో పాటు పలువురు దీక్షా శిబిరంలో పాల్గొని సంఘీభావం తెలిపారు. -
ప్లీనరీలో సిక్కోలు గళం
టీడీపీ మూడేళ్ల పాలనలో శ్రీకాకుళం జిల్లాలో అన్ని వర్గాలవారు తీవ్ర అగచాట్లు పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట శనివారం ప్రారంభమైన వైఎస్సార్సీపీ రెండ్రోజుల జాతీయ ప్లీనరీలో ఆమె జిల్లా సమస్యలపై గళం వినిపించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలనుసారం జిల్లా సమస్యలపై ఆరు తీర్మానాలను ప్లీనరీలో ప్రవేశపెట్టారు. ముందుకు సాగని సాగునీటి ప్రాజెక్టుల పనులు, అప్పుల సహా రైతుల కష్టాలు, కిడ్నీ రోగుల ఆవేదన, మత్స్యకారుల సమస్యలు, గిరిజనులకు దూరమైన సంక్షేమం, చేనేతకారుల ఇబ్బందులను ఈ తీర్మానాల ద్వారా ప్రస్తావించారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం వాటన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ పాలకులను పారదోలి రాజన్న సంక్షేమ పథకాల కోసం జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సాక్షి ప్రతినిధి– శ్రీకాకుళం: వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు అనేక హామీలిచ్చారని రెడ్డి శాంతి ప్లీనరీలో ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ అక్రమ విధానాలు, దోపిడీ కార్యక్రమాలతో జిల్లాకు సంబంధించిన పలు సమస్యలపై నియోజకవర్గ, జిల్లా స్థాయి ప్లీనరీల్లో తీర్మానాలు ఆమోదించినట్లు చెప్పారు. వాటిలో అత్యంత ప్రధానమైన సమస్యలపై ఆరు తీర్మానాలను జాతీయ ప్లీనరీలో ఆమోదానికి ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. జిల్లాలో పది లక్షల మందికి వ్యవసాయం, వ్యవసాయానుబంధ రంగాలే ఆధారమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తలపెట్టిన వంశధార ఫేజ్–2 ప్రాజెక్టు, ఆఫ్‌షోర్ ప్రాజెక్టు పనులతో పాటు మడ్డువలస, నారాయణపురం ఆనకట్టల ఆధునికీకరణ పూర్తి చేయాలని టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. జిల్లాలో మూడు లక్షల మంది మత్స్యకారుల పరిస్థితి నడిసంద్రంలో నావలా మారిందన్నారు. వారికి మరపడవలు, వలలు ఇస్తామని, కోల్డ్ స్టోరేజ్‌లు, జెట్టీలు నిర్మిస్తామని, 50 సంవత్సరాలకే పింఛను ఇస్తామని చంద్రబాబు పలు హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. అంతేకాదు వారి సమస్యలపై చట్టసభలో వినిపించేందుకు వీలుగా ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని నమ్మించి మోసం చేశారని విమర్శించారు. ఉద్దానం ప్రాంతంలో 1.50 లక్షల మంది కారణం తెలియని కిడ్నీ రోగం బారిన పడ్డారని, వారిని ఆదుకునేందుకు శాశ్వత చర్యలు గాకుండా కంటితుడుపు చర్యలకే పరిమితమైందన్నారు. జిల్లాలో రెండు లక్షల మంది గిరిజనులకు సంక్షేమానికి వినియోగించాల్సిన సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పట్టాయని చెప్పారు. దాదాపు 300 గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యమే లేదన్నారు. రక్షిత తాగునీరు, సకాలంలో వైద్యం అందట్లేదన్నారు. ఇప్పటికీ చలమల్లో బురదనీరే గతి అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో మరో 50 వేల చేనేత కుటుంబాలు దీనావస్థలో ఉన్నాయని చెప్పారు. సిక్కోలు బ్రాండ్ పొందూరు ఖద్దరు ప్రపంచ ప్రసిద్ధి పొందినా ఆ పరిశ్రమపై ఆధారపడిన వారి సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్‌ను తామంతా భగవంతుడు పంపిన దూతగా భావిస్తున్నామని, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజశేఖరరెడ్డి మాదిరిగా జిల్లాను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తారని రెడ్డి శాంతి ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ పేరు ప్రతిపాదన... వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సమక్షంలో సీఈసీ సభ్యులు ప్రతిపాదించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పార్టీ సీఈసీ సభ్యుడు అందవరపు సూరిబాబు పాల్గొన్నారు. ప్లీనరీలో నాయకుల ప్రసంగాలతో శ్రేణులతో జోష్ కనిపించింది. జిల్లా నుంచి ప్రధాన నాయకులతో పాటు దాదాపు రెండు వేల మంది వివిధ క్యాడర్ నాయకులు ప్లీనరీలో పాల్గొన్నారు. -
జాతీయ ప్లీనరీకి తరలిరండి
► వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి పిలుపు శ్రీకాకుళం అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్వహించనున్న పార్టీ జాతీయస్థాయి ప్లీనరీని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇప్పటికే నియోజకవర్గ, జిల్లాస్థాయి ప్లీనరీలను విజయవంతంగా పూర్తి చేసుకున్నామని.. జాతీయ ప్లీనరీకి కూడా జిల్లాలోని పార్టీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ మేనిఫేస్టోలో 600కు పైగా హామీలను చంద్రబాబు గుప్పించారని, అధికారం చేపట్టాక ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. అలాగే నియోజకవర్గాల్లో చాలా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. ఉదాహరణకు పాతపట్నం నియోజకవర్గంలోని వంశధార ప్రాజెక్టు, ఇచ్ఛాపురం నియోజకవర్గంలో కిడ్నీవ్యాధి బాధితుల సమస్య, పలాసలో ఆఫ్‌షోర్, టెక్కలిలో భావనపాడు హార్బర్, ఇలా ఒక్కో నియోజకవర్గంలో నాలుగైదు సమస్యలు ఉన్నాయన్నారు. వీటన్నింటిపై జిల్లాస్థాయి ప్లీనరీలో చర్చించామన్నారు. జాతీయస్థాయి ప్లీనరీలో జిల్లా సమస్యలను పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తనున్నట్టు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో వై?ఎస్సార్ సీపీ విజయం సాధించి.. జిల్లా సమస్యలు పరిష్కారం చేసే విధంగా ప్లీనరీలో చర్చించనున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జగన్ అలుపెరుగని పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ప్రజల నమ్మకం, భరోసా, విశ్వాసం పొందిన నాయకునిగా ఆయన గుర్తింపు పొందారన్నారు. -
9వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి
-
9వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి
హీర: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా అందలేదని శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి మండిపడ్డారు. జూలై 18న ఎంపీ రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు వచ్చి నిర్వాసితులకు అండగా ఉంటామని, ప్యాకేజిలు ఇస్తామని ప్రకటించారని, అయితే ఇంతవరకు ఎవరికీ ఏమీ అందలేదని ఆమె తెలిపారు. ప్రతిపక్షనేత, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలిచేందుకు శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా హిర లో నిర్వహించిన సభలో రెడ్డి శాంతి మాట్లాడుతూ.. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీకాకుళం జిల్లా రైతుల కోసం వంశధార ప్రాజెక్టును తీసుకొచ్చారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ మరణం తరువాత 9 వేల కుటుంబాలకు చెందిన నిర్వాసితులు రోడ్డున పడ్డారన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిన కలమట వెంకటరమణ నమ్మకద్రోహం చేసి అన్నం పెట్టే చేతినే నరికేశారని విమర్శించారు. నిర్వాసితులకు న్యాయం చేస్తానని వెళ్లిన కలమట వెంకటరమణ ఇసుక దందా చేసి కోట్ల రూపాయలు కూడబెట్టారన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా వదలకుండా నీరు, చెట్టు, పుట్ట, గట్టు.. అన్నింట్లో తినేశారని విమర్శించారు. ఒక పార్టీ నుంచి గెలిచినవారిని కొనుక్కున్న పార్టీని భూస్థాపితం చేయాలి అని ఆమె పిలుపునిచ్చారు. -
ఘరానా మోసగాడు చంద్రబాబు
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి శ్రీకాకుళం అర్బన్ : అధికారమే పరమావధిగా ఎన్నికల సమయంలో అడ్డగోలుగా హామీలు గుప్పించి.. అధికారం చేపట్టిన తర్వాత ఒక్క హామీ కూడా అమలుచేయని ఘరానా మోసగాడు చంద్రబాబు అని జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి దుయ్యబట్టారు. ఎన్నికల్లో 600 హమీలు గుప్పించి.. అందులో ఒక్కటి కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. తాత్కాలిక సచివాలయం అంటూ అమరావతిలో రూ. కోట్లు దుర్వినియోగం చేశారన్నారు. రూ.5,574 కోట్లు దుర్వినియోగం అయినటు కాగ్ నివేదికలో పేర్కొందని గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడిపై 28 కేసులు ఉన్నా స్టేలు తెప్పించుకొని తప్పించుకు తిరుగుతున్నారన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో అతిపెద్ద ఆర్థిక నేరస్తుడు చంద్రబాబేనని ప్రజలు గ్రహించారన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక్క ఇల్లు కట్టలేని ఆయన.. తెలంగాణలో మాత్రం విలాసవంతమైన ఇల్లు కట్టుకున్నారన్నారు. ఇది ఆంధ్రులకు అన్యాయం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. ప్రజాక్షేత్రంలో తన కుమారుడు లోకేష్‌ను నిలబెడితే ఎక్కడ ఓడిపోతాడనే భయంతో.. దొడ్డిదారిలో ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కట్టబెట్టారని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు యువతకు ఇంటికో ఉద్యోగం అంటూ నమ్మించారని, అధికారం చేపట్టిన మూడేళ్ల తర్వాత.. తన కొడుకుకే ఉద్యోగం కల్పించుకున్నారు తప్ప యువతకు ఒక్క ఉద్యోగం కల్పించలేకపోయారని ఎద్దేవా చేశారు. -
సేవ్ డెమోక్రసీ ప్రదర్శనలు
► నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు ► పాల్గొన్న పార్టీశ్రేణులు, పౌరులు ► చంద్రబాబు పై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ద్వజం శ్రీకాకుళం అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం ఉదయం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ‘సేవ్ డెమోక్రసీ’ నినాదంతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బైక్ ర్యాలీలు, నిరసన ర్యాలీల సన్నద్ధతపై పార్టీ జిల్లా నాయకులతో రెడ్డి శాంతి శుక్రవారం ఉదయం శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. కార్యక్రమాలు విజయవంతం చేయడానికి సమాలోచనలు చేశారు. ప్రభుత్వ దుర్మార్గపు విధానాలను ప్రజలకు ఏవిధంగా వివరించాలి, చంద్రబాబు చేస్తున్న అనైతిక రాజకీయాలను ఏవిధంగా ఎండగట్టాలి... అనే విషయాలపై చర్చించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలతో టీడీపీలోకి చేర్పించుకున్నారని విమర్శించారు. వారిలో నలుగురికి మంత్రి పదవులూ నిస్సిగ్గుగా కట్టబెట్టారన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం పాలుచేసేలా వ్యవహరించిన చంద్రబాబును గవర్నరు సైతం మందలించకపోగా వత్తాసు పలకడం అన్యాయమన్నారు. చంద్రబాబు రాజ్యాంగ విరుద్ధ పనులను వ్యతిరేకించి టీడీపీ ప్రభుత్వ మెడలు వంచేందుకు శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బైక్‌ర్యాలీలు, ధర్నాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు అంధవరపు వరహానరసింహం, ఎంవీ పద్మావతి, కోణార్క్ శ్రీను, శిమ్మ రాజశేఖర్, ఎన్ని ధనుంజయ్, గుమ్మా నగేష్, సాధు వైకుంఠరావు, టి.కామేశ్వరి, మండవిల్లి రవి, పి.జీవరత్నం, మూకళ్ళ తాతబాబు, గొండు కృష్ణ, పీస శ్రీహరి, పొన్నాడ రుషి, పడపాన సుగుణారెడ్డి, పప్పు పొట్టెమ్మ, కె.చంద్రకళ, ఆదిత్య శ్రీను, దున్న దేవా తదితరులు పాల్గొన్నారు. బైక్ ర్యాలీ సాగేదిలా....: జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులన్నీ తొలుత బైక్ ర్యాలీ నిర్వహించాయి. అనంతరం స్థానిక ఆర్డీవో లేదా తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొంటాయి. శ్రీకాకుళంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం నుంచి ఉదయం 9.30 గంటలకు బైక్‌ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీ జీటీ రోడ్డు మీదుగా వైఎస్సార్ కూడలి వరకూ చేరుకొని, అక్కడి నుంచి పాలకొండ రోడ్డు మీదుగా డే అండ్ నైట్, అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడ ధర్నా నిర్వహించారు. -
ఇవేనా మీ ప్రజాస్వామ్య విలువలు ?
►ప్రలోభాలతో గెలుపు బలుపు కాదు! ►‘ఓటుకు కోట్లు’ అక్రమాల్లో ఆరితేరారు ►టీడీపీ నేతలను ప్రజలు తరిమికొడతారు ►ప్రత్యక్ష ఎన్నికలంటే చంద్రబాబుకు భయం ►వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: డబ్బును వెదజల్లి ప్రలోభాలతో ఎమ్మెల్సీ ఎన్నికలలో వచ్చిన గెలుపు టీడీపీకి బలుపు కాదని, అది వాపు మాత్రమేనని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి వ్యాఖ్యానించారు. సోమవారం సాయంత్రం కొత్తూరులో ఆమె విలేకరులతో మాట్లాడారు. ధనార్జనే ధ్యేయంగా ధనాన్ని వెదజల్లి గట్టెక్కడం విజయం కానేకాదని, అది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించారు. ఇవేనా చంద్రబాబు వల్లించే ప్రజాస్వామ్య విలువలు? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ‘ఓటుకు కోట్లు’ కేసులో అడ్డంగా దొరికిపోయినప్పుడే చంద్రబాబు చెప్పే నైతిక విలువలేమిటో తేటతెల్లమైందని గుర్తు చేశారు. అలా ఓట్ల కొనుగోళ్ల అక్రమాల్లో ఆరితేరిన టీడీపీ నాయకులు తమ అనుభవాన్ని ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ ఉపయోగించారని చెప్పారు. కాదు తాము ప్రజాస్వామ్యయుతంగా గెలిచామనే భావిస్తే 21 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రత్యక్ష ఎన్నికలకు రావాలని సవాలు విసిరారు. కానీ ప్రత్యక్ష ఎన్నికలంటే చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ సహా టీడీపీ నేతలందరికీ భయమేనని వ్యాఖ్యానించారు. అందుకే లోకేష్‌ను దొడ్డిదారిన ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా పంపించారని చెప్పారు. సాధారణ ఎన్నికలొస్తే ప్రజలు టీడీపీ నాయకులను తరిమికొట్టడం తథ్యమని జోస్యం చెప్పారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఫలితాలే వచ్చే సాధారణ ఎన్నికలలో పునరావృతమవుతుందని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడిచి చెడు సంప్రదాయానికి చంద్రబాబు తెరతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి రాజకీయాలు, అక్రమ విధానాలకు ఇప్పటికైనా స్వస్తి పలకాలని ఆమె హితవుపలికారు. -
గజరాజుల తరలింపులో విఫలం
హిరమండలం: గజరాజులు జనావాసాల్లోకి వచ్చి ఆస్తి, ప్రాణ నష్టం కలగజేస్తున్నా.. వాటి తరలింపునకు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి విమర్శించారు. ఈ మేరకు ఆమె మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఒడిశాలోని లఖేరి అడవుల నుంచి శ్రీకాకుళం జిల్లాలోకి ఏనుగులు ప్రవేశించి గిరిజనులను భయాందోళనలకు గురిచేస్తున్నాయన్నారు. సీతంపేట, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, కొత్తూరు, భామిని మండలాల్లో ఏనుగుల కదలికలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. గిరిజనుల పంటలు, తోటలను ధ్వంసం చేసి తీవ్ర నష్టాన్ని కల్గిస్తున్నాయని, ఇంత జరుగుతున్నా వాటిని తరలించే చర్యలను తీసుకోవడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. ఇప్పటి వరకు 14మందిని ఏనుగులు పొట్టన పెట్టుకున్నా.. ప్రభుత్వ సహాయం అంతంత మాత్రంగానే ఉందన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఎమ్మెల్యే కలమట వెంకరమణమూర్తి గాని, అధికారులుగానీ చర్యలు తీసుకోకపోవడం శోఛనీయమన్నారు. తక్షణమే ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. -
నిర్వాసితుల గోడు పట్టదా!
శ్రీకాకుళం అర్బన్: సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి నిర్వాసితుల పునరావాసంపై టీడీపీ ప్రభుత్వం ఏమాత్రం బాధ్యతగా వ్యవహరించడం లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి శనివారం ఒకప్రకటనలో తెలిపారు. తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల పోరాట ఫలితంగా పునరావాసంలో అనేక మార్పులు వచ్చినా వాటిని సక్రమంగా అమలు జరపడం లేదని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు, వికలాంగులు, భర్త విడిచిపెట్టినవారు, వితంతువులకు ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని జీవో 68లో సవరణ 2007లో వచ్చినా ఒక్క ప్రాజెక్టులోనూ అమలు జరపలేదని తెలిపారు. ఎఫ్ఆర్ఎల్ పాయింట్ నుంచి 100 మీటర్లు దూరం వరకు ఉన్న గ్రామాలూ ముంపు గ్రామాలుగానే సవరణలు వచ్చినా చాలా ప్రాజెక్టుల్లో అమలు చేయడం లేదని ఆవేదన చెందారు. ప్రభుత్వ లెక్క ప్రకారం యువతీ యువకులను మినహాయించి వంశధార నిర్వాసిత కుటుంబాలు ఏడు వేలు, యువతీ, యువకులకు కలుపుకుంటే 11 వేలు కుటుంబాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే వీరిలో ఇప్పటివరకు సుమారు 3 వేలు మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని తెలిపారు. వంశధార ప్రాజెక్టులో ఒక్క యువతీ యువకుడికీ ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. -
హామీలపై ప్రశ్నిస్తే.. బాబుకు కోపమెందుకో..
‘సాక్షి’ ప్రసారాలు నిలిపివేస్తే నిజాలు దాగవు నీరు-చెట్టులో రూ.కోట్ల అవినీతి కలమటవి స్వార్థ రాజకీయాలు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఎల్.ఎన్.పేట: ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చమని ప్రశ్నిస్తే సీఎం చంద్రబాబు కు కోపమెందుకొస్తుందో తెలియడం లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి అన్నారు. ఎల్.ఎన్.పేట మండల కేంద్రంలో విలేకరులతో ఆమె శనివారం మాట్లాడారు. హామీలను అమలుచేయకపోవడం వల్లే ప్రజలు నిలదీస్తున్నారన్నారు. సాక్షి ప్రసారాలను ఆపేసినంత మాత్రాన నిజాలు దాగిపోవన్నారు. 2014 జూన్ 8న రైతు రుణమాఫీ ఫైల్‌పై సంతకం చేశారని, ఒక్క రైతుకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని విమర్శించారు. డ్వాక్రా మహిళలను పూర్తిగా మోసం చేశారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ భృతి ఊసేలేదని, మా ఇంటి మహాలక్ష్మి పథకం మూలకు చేర్చారని, అర్హులకు పథకాలు అందడం లేదని ఆరోపించారు. నీరు-చెట్టు పథకంతో కూలీల పొట్టకొట్టి తెలుగుతమ్ముళ్లకు కాసులు కురిపిస్తున్నారని విమర్శించారు. ముద్రగడ దీక్షపై మంత్రులు బాధ్యతా రాహిత్యంగా మాట్లాడడం విచారకరమన్నారు. పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటర రమణవి స్వార్థరాజకీయాలని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆశయాలు నెరవేరుస్తారని, జగన్మోహన్రెడ్డి పక్షాన నిలుస్తారని భావించి ప్రజలు ఓట్లేస్తే ప్యాకేజీలకు, అమరావతి భూములకు ఎమ్మెల్యే పదవిని అమ్ముకున్నారని విమర్శించారు. 2014 ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీచేసినప్పుడు పాతపట్నం నియోజక వర్గానికి చెందిన 60 వేల మంది ఓట్లు వేశారని, ఇక్కడి వారిని ఎప్పటికీ మరచిపోనన్నారు. వైఎస్సార్ సీపీ పాతపట్నం నియోజక వర్గం ఇన్చార్జిగా అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని, నాయకులు, కార్యకర్తలతో కలిసికట్టుగా ముందుకు సాగుతానన్నారు. ఆమె వెంట పార్టీ నాయకులు కొల్ల కృష్ణ, లోచర్ల మల్లేశ్వరరావు, ఎర్ర జనార్దన, కిలారి త్రినాథరావు, లావేటి కామేశ్వరరావు, రామకృష్ణ పట్నాయక్, అప్పన్నలు ఉన్నారు. -
జూలై 8 నుంచి గడప గడపకూ వైఎస్సార్ సీపీ
శ్రీకాకుళం అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్వహించనున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి తెలిపారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. విజయవాడలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై మా ట్లాడామని తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా వైఎస్సార్సీపీ ఉద్యమాలు, పోరాటాలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే జూలై 8వ తేదీ నుంచి గడప గడపకూ వైఎస్సార్సీపీ పేరుతో పార్టీ ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేయనున్నామని తెలి పారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అన్యాయాలు ప్రజలకు వివరిస్తామన్నారు. ముద్రగడ కుటుంబంపై ప్రభుత్వం, పోలీసులు దారుణంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ దమననీతిని సాక్షి కళ్లకు కట్టినట్లు చూపిస్తుందనే భయంతో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేశారని విమర్శించారు. మీడియా స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదన్నారు. సీఎంగా ఉన్న చంద్రబాబు ఇలాంటి నీచరాజకీయాలకు పాల్పడడం శోచనీయమని, బాబుకు రాజకీయ సమాధి తప్పదని చెప్పారు. జిల్లా అధ్యక్షురాలిగా పనిచేస్తున్న తనకు పాతపట్నం ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించారని, ఇందుకు జగన్మోహనరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. పాతపట్నంలో పార్టీ బలోపేతానికి తన వంతుగా పూర్తిగా కృషిచేస్తానన్నారు. -
'బాబు తీరుతో ప్రజలు తిట్టుకుంటున్నారు'
నీలాపుట్టుగ: ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ సీపీ రాజీ లేని పోరాటం చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి అన్నారు. ఆమె శుక్రవారం కేశుపురం పంచాయతీ నీలాపుట్టుగలో గ్రామస్తులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మాయలో పడిన ప్రజలు ఓట్లేసి గెలిపించారని, ఇప్పుడాయన తీరు చూసి తిట్టుకుంటున్నారని అన్నారు. డ్వాక్రా మహిళలకు పూర్తిగా రుణ మాఫీ చేస్తామని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామనీ, రైతులకు రుణమాఫీ చేస్తానంటూ నమ్మబలికిన చంద్రబాబు గెలిచిన తర్వాత విదేశీయుల మాయలో పడి రాష్ట్రాన్ని నడి రోడ్డున వదిలేశారని రెడ్డి శాంతి ఆరోపించారు. జిల్లా ప్రజలు కరువుతో అల్లాడుతుంటే నాయకులు మాత్రం ఆదుకోవడం పక్కన బెట్టి మహానాడు, నవనిర్మాణ దీక్ష అంటూ వేలాది రూపాయలు ఖర్చు పెట్టడం సబబు కాదన్నారు. పరిపాలన చూడాల్సిన అధికారులను నవ నిర్మాణ దీక్షలో భాగంగా సెమినార్లను నిర్వహించండంటూ ఆదేశాలు జారీ చేయడం అనాగరిక చర్యని అన్నారు. సమావేశంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు, సర్పంచ్ నీలాపు చంద్రయ్య, ఉప సర్పంచ్ నీలాపు మోహనరావు, జిల్లా పార్టి కార్యదర్శి పీఎం తిలక్, కవిటి మండల కన్వీనర్ కడియాల ప్రకాష్, మండల ఎస్సీ సెల్ కన్వీనర్ బాగ మోహనరావు, గ్రామ పెద్దలు నీలాపు కృష్ణారెడ్డి, దక్కత సింహాద్రి రెడ్డి, కర్రి పొట్టెయ్య, పి.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
ఓటుకు కోట్లు కేసుకు భయపడే...
శ్రీకాకుళం అర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి చం ద్రబాబు నాయుడు తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి విమర్శించారు. ఆమె బుధవారం శ్రీకాకుళంలోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు కట్టడానికి ప్రయత్నాలు జరుగుతుంటే సీఎం మిన్నకుండిపోవడం బాధాకరమన్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఆ కేసు ఎక్కడ తిరగదోడతారనే భయంతోనే నోరు మెదపడం లేదని ఆరోపించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రతిపక్ష నేతగా ప్రజల తరఫున వై.ఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలు జిల్లాలో మూడు రోజుల జలదీక్ష చేశారని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో ప్రధాని మోదీ వద్దకు వెళ్లినా లాభం లేకపోవడం శోచనీయమని అన్నారు. ప్రత్యేక హోదాతో లాభమేంటని సాక్షాత్తు సీఎం చెప్పడం సరికాదని అ న్నారు. జగన్మోహన్రెడ్డి చేపట్టిన జలదీక్షకు సంఘీభావంగా జిల్లాలోని మండలాల్లో పార్టీ శ్రేణులన్నీ దీక్షలు చేపట్టడం అభినందనీయమన్నారు. సమావేశంలో పార్టీ కేంద్ర కార్యనిర్వాహకమండలి సభ్యుడు అంధవరపు సూరిబాబు, పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అద్యక్షుడు పి.జీవరత్నం, పార్టీ యువజన విభాగం నగర అధ్యక్షుడు కోరాడ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
జనం కరువుతో అల్లాడుతుంటే.. సీఎం విదేశీ యాత్రలా?
(ఇచ్ఛాపురం రూరల్): రాష్ర్టం కరువు కోరల్లో ఉంటే సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలు చేయడమేం టని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ప్రశ్నించారు. ఆమె గురువారం లొద్దపుట్టిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా కరువు పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహాయక చర్యలపై ప్రధానమంత్రిని కలుస్తూ ఆర్థిక సాయా న్ని అభ్యర్థిస్తుంటే మన ముఖ్యమంత్రి మా త్రం విహార యాత్రలు చేస్తూ రాష్ట్ర ప్రజలను ఇంకా కష్టాల సుడిగుండంలో నె డుతున్నారని విమర్శించారు. జిల్లాలోని 28 లక్షల మంది జనాభాలో ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది వరకు వలస కూలీలుగా ఇతర ప్రాంతాల్లో ఇతరత్రా పనులు చేసుకుంటుంటే కనీసం అధికారులైనా, ప్రజా ప్రతినిధులైనా స్పందించకపోవడం విచారకరమనీ, వలసలు నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. మత్స్యకారులకు వేట నిషేధం కాలంలో సాయం అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త నర్తు రామారావు, వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ కార్యవర్శి సల్ల దేవరాజు, మాజీ ఎంపీపీలు పీఎం తిలక్, మంగి గణపతి, ట్రేడ్ యూనియన్ కార్యదర్శి చత్రపతి, నాయకులు చిట్టిబాబు, ప్రకాష్ పట్నాయిక్, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
తాగునీరు సరఫరాలో ప్రభుత్వం విఫలం
శ్రీకాకుళం: ప్రజలకు తాగునీరు సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. కవిటిలోని పార్టీ కార్యాలయంలో కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం రూరల్ మండలాల ప్రతినిధులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పల్లెప్రజలకు గుక్కెడు నీటిని అందించకుండా పాలకులు కాలక్షేపం చేస్తున్నారన్నారు. పార్టీ అధిష్టానం పిలుపుమేరకు అన్ని మండల కేంద్రాల్లో ఖాళీ బిందెలతో సోమవారం ధర్నా చేయాలని పిలుపునిచ్చారు. తాగునీరు అందించని ప్రభుత్వం రూ.3కోట్లతో మజ్జిగ ప్యాకెట్లను సరఫరా చేస్తోందంటూ గ్లోబల్ ప్రచారానికి తెరతీసిందన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఖర్చులో తప్పుడు లెక్కలు చూపిస్తూ అధికార పార్టీ నేతలు కాజేస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు, సత్యనారాయణపాఢి, పి.ఎం.తిలక్, కంచిలి ఎంపీపీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు, మండల కన్వీనర్లు కడియాల ప్రకాష్, పి.ఆనంద్‌కుమార్, ఆర్.చిట్టిబాబు, సీతారాం, పి.శ్రీరాములు, మద్దిలి ఈశ్వరరావు, దుర్గాశి ధర్మారావు, వెంకటరావు, నీలాచలం, లచ్చయ్య పాల్గొన్నారు. -
ప్రభుత్వానికి పట్టని కరువు
శ్రీకాకుళం అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా కరువు తాండవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మండిపడ్డారు. సర్కార్ తీరును నిరసిస్తూ ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాడేందుకు జిల్లాలోని 38 మండలాల తహసీల్దార్ కార్యాలయాల వద్ద సోమవారం ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శన నిర్వహిం చనున్నట్లు ఆమె వెల్లడించారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరువు తాండవిస్తోందని, తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు కరువుపై జిల్లా యంత్రాంగంతో ఒక్కసారైనా సమీక్షించారా అని ప్రశ్నించారు. తాగునీటి సమస్యను అధిగమించేందుకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు కళ్లబొల్లి హామీలు గుప్పించడమే తప్ప వారు కష్టాల్లో ఉన్నపుడు టీడీపీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలన్నారు. చాలా మండలాల్లో తాగునీటి సమస్య ఉందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, రాజధాని నిర్మాణం కోసం భూముల సేకరణ తప్ప ప్రజల సమస్యలు పట్టవన్నారు. జిల్లాలో కరువు తాండవిస్తోందని, పల్లెలు వలస బాట పడుతున్నాయన్నారు. పశుగ్రాసం కూడా లభించడం లేదన్నారు. కరువును ఎలా ఎదుర్కొంటారో ప్రభుత్వం ఇప్పటికీ ఒక ప్రణాళిక రూపొందించుకోకపోవడం శోచనీయమన్నారు. కరువు, కాటకాలు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వద్ద ఎటువంటి ప్రణాళికా లేదన్నారు. దీనిపై కనీసం అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. నవ్యాంధ్రకు ప్రత్యేకహోదా రాదని, ఏపీ అభివృద్ధికి రూ.90 వేల కోట్లు ఇచ్చామని కేంద్రమంత్రి చెప్పార ని, ఈ రూ.90 వేల కోట్లు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలన్నారు. వీటిన్నింటికీ నిరసనగానే ప్రజల తరఫున ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు వివరించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, పార్టీ శ్రేణులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ కేంద్ర కార్యనిర్వాహకమండలి సభ్యుడు అంధవరపు సూరిబాబు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాశరావు, పార్టీ పట్టణ ప్రధానకార్యదర్శి మండవిల్లి రవి, నాయకులు తంగుడు నాగేశ్వరరావు, దుంగ శిమ్మన్న పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యం అపహాస్యం
శ్రీకాకుళం అర్బన్: తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రం లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. టీడీపీ అధికారం చేపట్టిన రెండేళ్లలో ఒక్కహామీని కూడా పూర్తిగా నెరవేర్చలేదన్నారు. అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను రాష్ట్రంలో వివిధ పథకాల పేరుతో కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ‘నీరు-చెట్టు’ పేరుతో సొమ్మంతా లూటీ చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రతిపక్షమనేదే లేకుండా చేసేందుకే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ తతంగాన్నంతా ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ ఈనెల 23న సాయంత్రం 4 గంటలకు శ్రీకాకుళంలోని సూర్యమహల్ కూడలి నుంచి వైఎస్సార్ కూడలి వరకూ భారీఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం చేస్తున్న దురాగతాలను ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు. మజ్జిగ వద్దు.. మంచినీళ్లు చాలు... సీఎం చంద్రబాబునాయుడు ప్రతి జిల్లాకు రూ.3 కోట్లు చొప్పున కేటాయించి చలివేంద్రాల్లో మజ్జిగ పంపిణీ చేస్తామని చంద్రబాబు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మంచినీరు దొరకక ప్రజలు అల్లాడుతున్నారని, వీరికి నీరు అందించకుండా మజ్జిగ పంపిణీ చేస్తామని ప్రకటించడం వెనుక నిధుల దోపిడీ కుట్ర దాగిఉందన్నారు. బాబు సొంత సంస్థ హెరిటేజ్‌కు లాభం చేకూర్చేందుకే మజ్జిగ పంపిణీ కార్యక్రమమన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే రూ.3 కోట్ల వ్యయంతో తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు ట్యాంకర్లతో నీరు సరఫరా చేయాలని కోరారు. మజ్జిగ పంపిణీ దోపిడీని నిరసిస్తూ మే నెల 2వ తేదీన జిల్లాలోని 38 మండలాల్లో ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహిస్తామన్నారు. సమావేశంలో పార్టీ కేంద్ర కార్యనిర్వాహకమండలి సభ్యుడు అంధవరపు సూరిబాబు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎన్ని ధనుంజయ్, పార్టీ నేతలు మండవిల్లి రవి, మామిడి శ్రీకాంత్, టి.కామేశ్వరి, కోరాడ రమేష్, కె.ఎల్.ప్రసాద్, గుడ్ల దామోదరరావు, ఆర్.ఆర్.మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా అభివృద్ధిపై మంత్రికి శ్రద్ధలేదు
శ్రీకాకుళం అర్బన్: ప్రజా సమస్యలు పరిష్కారంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని జూట్‌మిల్లులు, ఆయిల్ మిల్లులు, రైస్ మిల్లులు, పైపుల ఫ్యాక్టరీలు, సింథటిక్ ప్యాక్టరీలు మూతపడటంతో కార్మికులు రోడ్డున పడుతున్నప్పటికీ కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకి చీమకుట్టనట్టు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధిపై మంత్రి దృష్టి సారించకుండా, జగన్మోహన్రెడ్డిని విమర్శించడానికే ప్రాధాన్యం ఇవ్వడం శోచనీయమన్నారు. పక్కా గృహాలకు నోచుకోని మత్స్యకారులు జిల్లాలోని 194 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 11 మండలాలు, 104 గ్రామాలు విస్తరించి ఉన్నాయని, ఆయా గ్రామాల్లో 40 వేల మత్స్యకార కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయని చెప్పారు. తీర గ్రామాల ప్రజలు తాగునీరు, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నా... ప్రభుత్వానికి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారులు పక్కా గృహాలకు నోచుకోకుండా నేటికీ పూరి గుడిసెల్లో దుర్భర జీవితం గడుపుతున్నారని అన్నారు. జిల్లాలో హుద్‌హుద్ తుపాను వల్ల 6,474 ఇళ్లు నేల మట్టం కాగా, ప్రభుత్వం 1500 ఇళ్లు మంజూరు చేసి, చేతులు దులుపుకుందని ధ్వజమెత్తారు. ఇందులో 300 గృహాలే నిర్మాణం పూర్తయ్యాయని చెప్పారు. నెలకు రూ.50 లక్షల విద్యుత్ భారం ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడం వల్ల జిల్లాలో 6.50 లక్షలు గృహ కనెక్షలపై నెలకు సుమారు రూ.50 లక్షల అదనపు భారం పడనుందన్నారు. రుణమాఫీ వర్తించక జిల్లాలో 10 వేలకు పైగా డ్వాక్రా సంఘాలు రద్దయ్యే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వి.పద్మావతి, జిల్లా అధికార ప్రతినిధి శిమ్మ రాజశేఖర్, పార్టీ నేతలు మండవిల్లి రవి, చల్లా అలివేలు మంగ, టి.కామేశ్వరి, కోరాడ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇది నయవంచన
శ్రీకాకుళం అర్బన్ : పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పార్టీ ఫిరాయింపు ధోరణి శోచనీయమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఒక ప్రకటనలో ఖండించారు. నియోజకవర్గ ప్రజలు నమ్మకంతో ..ప్రజాస్వామ్య విలువలు కాపాడతారని గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయడం దారుణమన్నారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని శాసనసభకు పంపితే కలమట ప్రజలను నయవంచన చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వారెవరూ ప్రజల మన్ననలు పొందలేరన్నారు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా ప్రజలకు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని ప్రశ్నించారు. హామీలలో ఒక్కటైనా అమలు చేయలేకపోయిందన్నారు. ప్రభుత్వం ఏం సాధించిందని పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారో చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా అడగకుండా ప్రత్యేక ప్యాకేజీని కోరడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. పచ్చ చొక్కాలకు ఆ నిధులను కట్టబెట్టేందుకేనన్నారు. వంశధార నిర్వాసితుల సమస్యలను పరిష్కరించకుండా ప్రాజెక్టు నీరు విడుదల చేస్తామని పనులు ప్రారంభించి, అడ్డుకుంటే లాఠీ చార్జి చేయడంలో ఎవరి ప్రమేయం ఎంతుందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. అభివృద్ధి ముసుగులో పార్టీ ఫిరాయించడం ఎంత వరకు సమంజసమన్నారు. అన్ని స్థాయిల వారూ మూల్యం చెల్లించక తప్పదని గుర్తించాలన్నారు. -
నిర్వాసితులకు అన్యాయం జరిగితే ఊరుకోం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి శ్రీకాకుళం అర్బన్: వంశధార నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సాగునీటి ప్రాజెక్టుల్లోని నిర్వాసితుల పునరావాసం పట్ల టీడీపీ ప్రభుత్వం ఏమాత్రం బాధ్యతగా వ్యవహరించడం లేదన్నారు. దారుణ నిర్లక్ష్యంతో నిర్వాసితులను సర్వనాశనం చేస్తుందన్నారు. తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల పోరాట ఫలితంగా పునరావాసంలో అనేక మార్పులు వచ్చినా వాటిని సక్రమంగా అమలు జరపడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ లెక్క ప్రకారం యువతను మినహాయించి వంశధార నిర్వాసిత కుటుంబాలు 7,104 ఉండగా ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది మూడు వేలమందికేనని చెప్పారు. రిజర్వాయర్ పనులు ప్రారంభించి పదేళ్లు పూర్తయినప్పటికీ ఇప్పటికీ ఒక కొలిక్కి రాకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం ఈ ఏడాది ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని ప్రకటిస్తోందని, ఆరునెలల్లో ప్రాజెక్టు పూర్తిచేస్తే నిర్వాసితుల పరిస్థితి ఏమిటన్నారు. ఇంతవరకూ ఇళ్ల స్థలాలే ఇవ్వలేదని, కొంతమందికి 5 సెంట్లు, మరికొంతమందికి 2 సెంట్ల స్థలాన్ని కేటాయించారన్నారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా నీటిని విడుదల చేస్తే ఆ నీటిలో వారిని ముంచేందుకా అని ప్రశ్నించారు. 2005లో అప్పటి ధరల్లో నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి రూ. 53 వేలు నిర్ణయించగా ఇప్పుడు కూడా అంతే మొత్తం ఇస్తామనడం భావ్యం కాదన్నారు. అప్పటికీ ఇప్పటికీ 10 రెట్లు ధరలు పెరిగాయని గుర్తుచేశారు. ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ చూస్తూ ఊరుకోదని, అన్యాయానికి గురవుతున్న నిర్వాసితుల పక్షాన పోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు. -
సంక్రాంతి శుభాకాంక్షలు
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం జిల్లా ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభిమానులకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి బుధవారం ఒక ప్రకటనలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికి భోగ భాగ్యాలు కలగాలని సరదాలు ఇచ్చే సంక్రాంతి, కొత్త సంవత్సరంలో సరికొత్తగా అందరికి ఆనందాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. -
టీడీపీది నిరంకుశ పాలన
వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి బాతుపురం(వజ్రపుకొత్తూరు): రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్నది నిరంకుశ, నియంతృత్వ పాలన అని వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఒక మోసం చేసి దానిని కప్పిపుచ్చుకునేందుకు మరో మోసాన్ని ప్రజలకు అంటగడుతున్నారని విమర్శించారు. వజ్రపుకొత్తూరు మండలంలో శుక్రవారం ఆమె విస్తృతంగా పర్యటించారు. బాతుపురం, డోకులపాడు గ్రామాల్లో ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. బాతుపురం గ్రామంలో సంప్రదాయ బద్దంగా నందెమ్మ ఉత్సవాలు నిర్వహించుకుంటున్న సర్పంచ్ టి.సరస్వతిని బెదిరించి, అంతు చూస్తామనడం పలాస ఎమ్మెల్యేకే చెల్లిందన్నారు. దీనిని పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలను, నాయకులను టీడీపీ నేతలు బెదిరించే కార్యక్రమాలకు దిగితే క్షమించేది లేదని, తాము దీటుగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని జనాభా అంతటికి అందించాల్సిన ఆదాయాన్ని కేవలం టీడీ పీ కార్యకర్తలకే ప్రభుత్వం, ముఖ్యమంత్రి దోచి పెడుతున్నారని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ టీడీపీకి కలెక్టరా... ప్రజలకు కలెక్టరా అని ప్రశ్నించారు. ముందుగా డోకులపాడు గ్రామానికి చెందిన పుక్కళ్ల ఆనందరావు పాతపట్నం జైలులో ఇటీవల మృతి చెండంతో ఆయన కుటుంబాన్ని రెడ్డి శాంతితో పాటు నాయకులు పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలిన శ్రీనివాసరావు, పార్టీ మండల అధ్యక్షుడు మరడ భాస్కరరెడ్డి, పలాస మాజీ ఎంపీపీ బి.హేమేశ్వరరావు, స్థానిక సర్పంచ్ టి.సరస్వతి, పార్టీ నేతలు బి.లక్ష్మినారాయణ, బి.పార్వతీశం, రామలింగం, ఎం.వరప్రసాద్, బి.ఎర్రయ్య, ఢిల్లేశ్వరరావు, డోకులపాడు ఎంపీటీసీ మాజీ సభ్యుడు కె.దానేసు, టి. సూర్యనారాయణ, బి.లక్ష్మీనపతి, దివాకర్, రామచంద్రుడు పాల్గొన్నారు. -
'ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి'
వైఎస్సార్సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతి కొత్తూరు (శ్రీకాకుళం జిల్లా): ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరుగుతుందని శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు రెడ్డిశాంతి పేర్కొన్నారు. కొత్తూరు మండలం వైఆర్ పేటలో శనివారం ఆమె విలేకరులతో మాట్లడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంకోసం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి 7వ తేదీ నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేయనున్నారని, అందుకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. బీజేపీ-టీడీపీ కుమ్మక్కై ప్రత్యేక హోదా రాకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని, 13, 14 ఆర్థిక సంఘం నిధుల్లో గ్రామ పంచాయతీలకు సంబంధించిన నీటి పన్ను, విద్యుత్ చార్జీలను మినహాయించడం దారుణమన్నారు. అమలు కాని హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని చెప్పారు. -
మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి
రిమ్స్‌క్యాంపస్ :మహిళలు అన్నిరంగాల్లో రాణిం చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఆకాంక్షించారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్భయ మహిళా వేదిక ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని డాక్టరు శ్రీధర్ ఆస్పత్రిలో మహిళలకు ఉచిత వైద్య శిబిరాన్ని శని వారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మహిళల్లో చైతన్యం పెరగాలన్నారు. ప్రస్తుతం మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల కోసం ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ వేధింపులు మాత్రం ఆగకపోవటం విచారకరమన్నారు. నిర్భయ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆడవారు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన కుటుం బం సాధ్యమన్నారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎం.వి.పద్మావతి మాట్లాడుతూ మహిళలు మంచి ఆహారాన్ని తీసుకోవాలన్నారు. నిర్భయ మహిళా వేదిక అధ్యక్షురాలు గీతా శ్రీకాంత్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించకూడదన్నారు. డాక్టరు ధానేటి శ్రీధర్ మహిళలకు వైద్య పరీక్షలను నిర్వహించారు. అనంతరం రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో బంగారు పతకం సాధించిన రోజా, ఐసీడీఎస్‌లో ప్రాజెక్టు లీడర్‌గా పనిచేస్తూ..సమాజ సేవలో పాలుపంచుకుంటున్న రాజేశ్వరిలను సన్మానించారు. ఈ సందర్భంగా రక్తహీనతపై మహిళల్లో అవగాహన పెంచుతూ కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్భయ మహిళా వేదిక సహాయ కార్యదర్శి స్వాతి, పీఆర్వో పద్మ పాల్గొన్నారు. -
ఆరు నెలల్లో అన్నీ వైఫల్యాలే
ఎచ్చెర్ల : చంద్రబాబునాయుడు నేతృత్వంలో రాష్ట్రప్రభుత్వం ఏర్పడి ఈ నెల 9వ తేదీకి ఆరు నెలలవుతోందని, ఈ ఆర్నెల్లలో అన్నీ వైఫల్యాలనే మూటగట్టుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రణస్థలంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రైతులకు చెల్లని బాండ్లు ఇచ్చి మరో మోసం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ, ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా రైతుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నంలో నిర్వహించే ధర్నాలో పాల్గొంటారన్నారు. ప్రజల పక్షాన నిరంతరం తమ పార్టీ పోరాడుతుందన్నారు. తమ పార్టీ చేపడుతున్న ఈ ఆందోళనలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ రైతురుణమాఫీలో జాప్యం కారణంగానే పంటలబీమా, రుణాల రీషెడ్యూల్ వంటి అవకాశాలను రైతులు కోల్పోయారన్నారు. డ్వాక్రా సంఘాల పొదుపు నుంచి బ్యాంకర్లు డబ్బులు తీసుకుంటున్నారని, మహిళలకు నోటీసులు ఇస్తూ హింసిస్తున్నారన్నారు. అందుకే ప్రజల పక్షాన తమ పార్టీ పోరాడుతోందన్నారు. పేదల కడుపు కొడితే సహించేది లేదన్నారు. ఇసుక రేట్లు పెంచి పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కలను దూరం చేశారన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ మాట్లాడుతూ కలెక్టరేట్ వద్ద పార్టీ నిర్వహిస్తున్న ధర్నాకు మద్దతుగా నియోజకవర్గం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. రణస్థలం, లావేరు, జి.సిగడాం, ఎచ్చెర్ల మండలాల నుంచి బైక్ ర్యాలీలు శ్రీకాకుళంలో సింహద్వారం వద్దకు చేరు కొని, అక్కడి నుంచి రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలతో కలెక్టరేట్‌కు చేరుకుంటాయన్నారు. రణస్థలం జెడ్పీటీసీ సభ్యుడు గొర్లె రాజ్‌గోపాల్ నాయుడు, ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, జి.సిగడాం మండలాల పార్టీ కన్వీనర్లు మూడుగుల ముర ళీధర్బాబా, దన్నాన రాజ న్నాయుడు, పైడి శ్రీనివాసరావు, అబోతుల జగన్నాథం, ఎచ్చెర్ల మాజీ జెడ్పీవిప్ సనపల నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు. బాబును నిలదీద్దాం రండి నరసన్నపేట రూరల్ : ఎన్నికల హామీలను అటకెక్కించి రైతులను, చేనేత కార్మికులను, డ్వాక్రా మహిళలను, ప్రజలను టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు, జిల్లా పార్టీ అధ్యక్షులు రెడ్డి శాంతి అన్నారు. నరసన్నపేటలో గురువారం సాయంత్రం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలను మోసగిస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు భారీ ఎత్తున తరలిరావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బాబు వాగ్దానాలతో దగాపడ్డ రైతులు, మహిళలు, చిరుద్యోగులు, నిరుద్యోగులు ఈ ధర్నాలో అధికంగా పాల్గొనాలని పిలుపు నిచ్చారు. పభుత్వం ప్రకటించిన నూతన ఇసుక విధానంతో నాటుబళ్లపై ఇసుకను తీసుకువచ్చే వారి కుటుంబాలు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయన్నారు. టీడీపీ పాలనకు వ్యతిరేకంగా శుక్రవారం జరుగుతున్న మహాధర్నాలో అందరూ పాల్గోవాలని పిలుపు నిచ్చారు. ప్రతీ గ్రామం నుంచి కనీసం 10 మంది కార్యకర్తలు మహాధర్నాకు తరలి రావాలన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు అంధవరపు సూరిబాబు, చింతు రామారావు, ఆరంగి మురళి, బగ్గు రామకృష్ణ, యాళ్ల కృష్ణంనాయుడు, రాజేశ్వరరావు, రాంబాబు, పాగోటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
సమరభేరి నేడే
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జిల్లా పార్టీ నేతలు శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వద్ద మహాధర్నాకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏ ప్రభుత్వంపైనైనా సాధారణంగా ఏడాదికో, రెండేళ్లు దాటిన తర్వాతో ప్రజల నుంచి నిరసనలు రావడం సహజం. అయితే ఏపీలో చంద్రబాబు బూటకపు ప్రకటనలపై ప్రభుత్వం ఏర్పడిన ఆర్నెళ్లకే విసుగెత్తిపోయారు. దీంతో తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ప్రజలను ఓదార్చేందుకు, భరోసా ఇచ్చేందుకు వైఎస్సార్ సీపీ నేడు సమరశంఖం పూరించనుంది. ప్రజలకు మద్దతుగా కలెక్టరేట్ వద్ద ఆందోళనకు సిద్ధమైంది. ఎన్నికల హామీని గాలికొదిలేసిన నేతల్ని నిలదీసేందుకు అంతా తరలిరావాలని జిల్లా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డే స్వయంగా విశాఖ ధర్నాలో పాల్గొనేందుకు వస్తుండడంతో ఈ ప్రాంతంలోనూ ఆయన స్ఫూర్తితో భారీగా నిరసన వ్యక్తం చేసేందుకు అంతా సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్త వైఎస్సార్సీపీ నేతలు పాల్గొంటారని, ప్రజల కోసం చేస్తున్న ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. ఇదీ ‘మహా ధర్నా’ షెడ్యూలు శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్దకు తరలివస్తారు. చంద్రబాబు మోసపూరిత హామీలు, ప్రస్తుత పరిస్థితిని ముఖ్య నాయకులు ప్రజలకు వివరిస్తారు. మహిళలు, రైతులు ఇలా అన్ని వర్గాలతో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక కార్యక్రమాలపై చర్చా కార్యక్రమం ఉం టుంది. రెండు వేల ప్లకార్డులతో ఆందోళన, కేజీ బియ్యం రూపారుు, కిలో ఇసుక మాత్రం రూ.2 అంటూ పెరిగిన ఇసుక ధరల్ని ప్రస్తావిస్తూ ప్రత్యేక ఇసుక దుకాణం ఏర్పాటు చేస్తారు. ఇటుక, టైర్లు, నాటు బళ్లతో మధ్యాహ్నం 1గంట వరకు వివిధ రకాలగా ఆందోళన కార్యక్రమాలుంటాయి. కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్‌కు ప్రజల మద్దతుతో.. వైఎస్సార్సీపీ తరఫున ఓ వినతిపత్రాన్ని సమర్పిస్తారు. హామీలు గాలికొదిలేశారు ఇంటికో ఉద్యోగం.. నిరుద్యోగ భృతి.. డ్వాక్రాసంఘాలకు సహా రైతులకు రుణమాఫీ, 24 గంటల విద్యుత్ సరఫరా, హెల్త్‌కార్డులు, ఎన్టీఆర్ సుజల స్రవంతి, పరిశ్రమల ఏర్పాటు, బెల్ట్దుకాణాల రద్దు.. అంటూ తెలుగుదేశం ప్రభుత్వం అబద్ధపు హామీలతో గద్దెనెక్కి అనంతరం ప్రజల బాధల్ని గాలికొదిలేసింది. ఆరునెలలవుతోంది. హామీల ఊసే వదిలేశారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. తనకన్నీ తెలుసని చెప్పిన బాబు ఇప్పుడు ప్లేటు మార్చేశారు. ఎన్నికల తర్వాత ఐదేళ్ల వరకూ ప్రజలతో పనిలేదనట్టు వ్యవహరిస్తున్నారు. దీనిని వైఎస్సార్ సీపీ ఖండిస్తోంది. ప్రజల మద్దతుతో శుక్రవారం కలెక్టరేట్ వద్ద బాబు ప్రభుత్వానికి బుద్ధొచ్చేలా, భారీ ఆందోళన చేపడుతున్నాం. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాలనుంచీ ఇప్పటికే మద్దతు లభిస్తోంది. -రెడ్డి శాంతి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ముందే విజయవంతం జగన్ ధర్నాకు పిలుపునివ్వడంతో ప్రభుత్వంలోనూ కదలిక వచ్చింది. ధర్నా భయంతోనే రుణమాఫీపై బాబు ఓ అరకొర ప్రకటనిచ్చేశారు. దీంతో ధర్నా, ఆందోళన కార్యాక్రమాలు ముందే విజయవంతమైనట్టయింది. వైఎస్సార్ సీపీ ధర్నాలపై ప్రజల్లోనూ చర్చ మొదలైంది. ఐదు సంతకాలంటూ ఊదరగొట్టిన చంద్రబాబు ఎన్నికల తర్వాత ప్రజల్ని మోసగించాలని ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం నాటి ఆందోళనకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. వ్యవసాయదారులు, ఇసుక కూలీలు, ఆదర్శరైతులు, తాపీమేస్త్రీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సగంలో ఇళ్లు ఆగిపోయిన లబ్ధిదారులు, తుపాను బాధితులు, మహిళలు, పింఛను బాధితులు తదితర అన్నివర్గాలవారూ మనం కూడా వెళ్దామంటూ వైఎస్సార్సీపీకి మద్దతిస్తున్నారు. అన్ని గ్రామాల రైతులు తామే ధర్నాకు తరలివస్తామంటున్నారు. ప్రజల కోసమే ఈ ధర్నా. - ధర్మాన ప్రసాదరావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
సీఎం ప్రజలను మోసగిస్తున్నారు
వంగర : రైతు, డ్వాక్రా రుణాల మాఫీ వంటి హామీలు నెరవేర్చకుండా సీఎం చంద్రబాబునాయుడు ప్రజలను మోసగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఆరోపించారు. సోమవారం ఆమె మండలంలోని సంగాం గ్రామంలోని పవిత్ర సంగమేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆమె తొలిసారిగా వంగర మండలానికి రావడం, ఈ మండలంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాల వలస రాజశేఖరానికి దశబ్దాల తరబడి ఇక్కడి ప్రజలతో సత్సం బంధాలుండడంతో ఆమెకు వంగర నాయకులు ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలందించి స్వాగతించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. రైతు, డ్వాక్రా రుణాల హామీతో ఎన్నికల్లో గెలిచిన బాబు, అనంతరం ఎటువంటి మాఫీ చేయకుండా ప్రజలకు అన్యాయం చేశారన్నారు. పింఛన్ల ఎంపికలో వైఎస్సార్ సీపీ అభిమానులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. పచ్చచొక్కాల వారికి లబ్ధి చేకూర్చే క్రమంలో జిల్లాలో 28 వేల పింఛన్లు తొలగించారని విమర్శించారు. పేదవాడు ఇల్లుకట్టుకోవడమే గగనంగా మారిందని, నిరుపేదలకు అందుబాటులో ఉండే ఇసుక ఇప్పుడు రూ.వేలల్లో పలుకుతోందని అన్నారు. నిర్మాణాలు లేక కూలీలకు పనులు దొరకడం లేదని అన్నారు. దీనితో వారు పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో నిత్యం ప్రజల పక్షాన పోరాడతామని అన్నారు. రానున్న కాలంలో తమ పార్టీకి మంచి భవిష్యత్ ఉందని, ప్రజల్లో టీడీపీపై ఇప్పటికే వ్యతిరేకత ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ పచ్చ చొక్కాలకే పరిమితం చేస్తుండడంతో అర్హులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పాలవలస ఇందుమతి, ధవళేశ్వరరావు, పార్టీ మండల నాయకులు ఉత్తరావెల్లి సురేష్ ముఖర్జీ, కరణం సుదర్శనరావు, మజ్జి వెంకటనాయుడు, కర్రి గోవిందరావు, ఉదయాన మురళీకృష్ణ, గేదెల రామకృష్ణ, కిమిడి సన్యాసినాయుడు, ఆవు చిన్నప్పలనాయుడు, గణేష్ బెనర్జీ, బెవర అప్పలనాయుడు, ఉగిరి ముత్యాలు, కళావతి, కిమిడి చిట్టిబాబు, పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, గ్రామస్థాయి, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. -
నెహ్రూ అడుగుజాడల్లో నడవాలి
శ్రీకాకుళం అర్బన్ : శాంతిదూతగా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని తత్వవేత్తగా ఖ్యాతినార్జించిన భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ అడుగుజాడల్లో బాలలు నడవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి కోరారు. బాలల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాంధీజీ సమకాలీకుడిగా, భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారన్నారు. ఎన్నో ప్రాజెక్టులు నిర్మించి దేశాన్ని సస్యశ్యామలం చేశారన్నారు. నెహ్రూకి గులాబీలన్నా, చిన్నారులన్నా ఎంతో ఇష్టమన్నారు. అందుకే నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. తొలుత నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. చిన్నారులకు స్వీట్లు, చాక్లెట్లు పంచిపెట్టారు. పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, పార్టీ నేతలు అంధవరపు సూరిబాబు, ఎం.వి.పద్మావతి, ఎన్ని ధనుంజయ్, టి.కామేశ్వరి, మండవిల్లి రవి, కె.ఎల్.ప్రసాద్, శిమ్మ రాజశేఖర్, గుడ్ల మల్లేశ్వరరావు, కోరాడ రమేష్, గుడ్ల దామోదరరావు, రమేష్, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి ప్రదాత నెహ్రూ దేశ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన మహోన్నత వ్యక్తి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అని మాజీ కేంద్రమంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి అన్నారు. చాచా నెహ్రూ జయంతి సందర్భంగా శ్రీకాకుళంలోని ఇందిరావిజ్ఞానభవన్లో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశం అగ్రగామిగా నిలబడేందుకు నెహ్రూ ఎంతగానో కృషిచేశారన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు డోల జగన్మోహనరావు, మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి, కోండ్రు మురళీమోహన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్నాల నరసింహమూర్తి, చౌదరి సతీష్, కిల్లి రామ్మోహనరావు, గంజి ఆర్.ఎజ్రా, తైక్వాండో శ్రీను, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. బాలల హక్కులు పరిరక్షించాలి బాలల హక్కులు పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి అన్నారు. నెహ్రూ జయంతి సందర్భంగా శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిరంలో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి బాలల హక్కుల వారోత్సవాల కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బంగారు భారతావనికి బాలలే పునాదులన్నారు. పిల్లలను స్వేచ్ఛగా చదువుకోనివ్వాలని తల్లిదండ్రులకు సూచించారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ బాల్యదశ ఒక స్వర్ణయుగమన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడం ఒక శుభపరిణామమన్నారు. 30 సంవత్సరాలుగా బాలల హక్కులపై పోరాడుతున్న కైలాస్ సత్యార్థికి నోబుల్ బహుమతి లభించడమే ఇందుకు నిదర్శనమన్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పిల్లల హక్కులను సంరక్షించి వారి అభివృద్ధికి తగిన స్వేచ్ఛను ఇస్తే జాతి రత్నాలుగా ఎదుగుతారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ పిల్లలు బాగా చదువుకోవాలని, ప్రభుత్వం కూడా విద్యార్థుల అభివృద్ధికి పలు పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులకు బాల బాలికలు రక్షాబంధన్ కట్టారు. అనంతరం చైల్డ్‌లైన్ సే దోస్త్ గోడపత్రికను అతిథులు ఆవిష్కరించారు. బడి మానివేసిన 23 మంది పిల్లలకు నెలకు రూ.500చొప్పున మూడు సంవత్సరాల పాటు స్కాలర్షిప్ అందేలా ప్రొసీడింగ్స్‌ను అతిథుల చేతులమీదుగా అందించారు. తొలుత నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ భార్గవ ప్రసాద్, ఐసీడీఎస్ పీడీ చక్రధరరావు, ఆర్వీఎం పీవో ఆర్.గణపతిరావు, అమ్మా ఫౌండేషన్ డెరైక్టర్ ఉత్తమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక ప్రజాక్షేత్రంలోకి..
శ్రీకాకుళం అర్బన్: ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఇటీవల జరిగిన పార్టీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సూచించిన మార్గంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లడంతోపాటు పార్టీని మరింత పటిష్టపరిచేందుకు కార్యాచరణకు సిద్ధమవుతోంది. దీనిపై చర్చించేందుకు వచ్చే నెల ఆరో తేదీన పార్టీ జిల్లాస్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి తెలిపారు. సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన అంతర్గత సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి అందరం సమష్టిగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశం మేరకు జరిగిన ఈ సమావేశంలో మొదట ఆమె పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహనరెడ్డి నిర్దేశించిన మార్గదర్శకా లు, గ్రామస్థాయి సంస్థాగత ఎన్నికలకు సం బంధించిన నివేదికను చదివి వినిపించారు. జిల్లా కమిటీల నిర్మాణం, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ ఎన్నిక, తదితర అంశాలపై చర్చించారు. అక్టోబర్ 2న గాంధీజయంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. అదే నెల ఆరో తేదీన శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఉదయం 10గంటలకు జిల్లాస్థాయి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఏడో తేదీ నుంచి జిల్లాలోని 38 మండలాలు, ఆరు మున్సిపాలిటీల్లో పర్యటించి మండల కమిటీలు వేసేందుకు ప్రణాళిక రూపొందించారు. పార్టీ నిర్ణయం మేరకు రైతు, డ్వాక్రా రుణమాఫీపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా అక్టోబర్ 16న అన్ని తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపడతామని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, కంబాల జోగులు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీలు దువ్వాడ శ్రీనివాస్, గొర్లె కిరణ్‌కుమార్, నర్తు రామారావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్, పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు అంధవరపు సూరిబాబు, పార్టీ నేతలు రొక్కం సూర్యప్రకాశ్, మామిడి శ్రీకాంత్, పేరాడ తిలక్, కెవీవీ సత్యనారాయణ, డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్, రాజగోపాల్, కోరాడ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ సీపీ బలోపేతమే లక్ష్యం
శ్రీకాకుళం అర్బన్:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి అన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్ర నాయకుడు కాదని, దేశ నాయకుడని వ్యాఖ్యానించారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా నియమితులైన తరువాత తొలిసారిగా సోమవారం ఆమె జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా బాపూజీ కళామందిరంలో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలతో మమేకమై కార్యకర్తలా శ్రమిస్తూ గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు కృషిచేస్తానన్నారు. జగన్మోహన్రెడ్డి తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానన్నారు. పార్టీ అధినేత నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడే వ్యక్తన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ముందు లేనిపోని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన తరువాత కమిటీలతో కాలయాపన చేస్తున్నార ని ధ్వజమెత్తారు. పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ఎంతోమంది శ్రమించి పార్టీ ఆవిర్భావం నుంచి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు. గడచిన ఎన్నికల్లో జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు మూడు చోట్ల విజయం సాధించామని, నాలుగు స్థానాల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయామన్నారు. అనంతరం రెడ్డి శాంతిచే పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయించారు. మాజీ మంత్రి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించడం ముళ్ల కిరీటం వంటిదన్నారు. రెడ్డి శాంతికి పార్టీ శ్రేణులను ముందుకు నడిపించే సత్తా ఉందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మూడు నెలలు గడచినా ఎటువంటి హామీలు అమలు చేయలేదన్నారు. జిల్లాలో మంత్రి, ఎమ్మెల్యేల నుంచి క్యాబినెట్లో మంత్రులు వరకూ ఫ్యాక్షనిస్టులేనని, టీడీపీ నాయకులకు దమ్ముంటే దీనిపై చర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. మంగళవారం దివంగత వైఎస్ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లాలో అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. మూడో తేదీ పార్టీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు జిల్లాకు వస్తున్నందున ఆయనకు పార్టీ శ్రేణులు స్వాగతం పలకాలన్నారు. పార్టీ నేత పాలవలస రాజశేఖరం మాట్లాడుతూ పార్టీకి క్యాడర్‌ను పెంచేందుకు గ్రామ, మండల, జిల్లాస్థాయి కమిటీలను వేయాలన్నారు. పార్టీ రాష్ట్ర బీసీసెల్ అధ్యక్షునిగా కృష్ణదాస్‌ను నియమించినందుకు గాను పార్టీ నేతలు ఆయనను అభినందిస్తూ సన్మానం చేశారు. అనంతరం శ్రీకాకుళంలోని న్యూకాలనీలో జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ కార్యాలయ ఆవరణలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పిరియా సాయిరాజ్, మీసాల నీలకంఠంనాయుడు, జుత్తు జగన్నాయకులు, పార్టీ నాయకులు దువ్వాడ శ్రీనివాస్, గొర్లె కిరణ్, మార్పు ధర్మారావు, వరుదు కల్యాణి, హనుమంతు కిరణ్‌కుమార్, గొండు కృష్ణమూర్తి, అంధవరపు వరహానరసింహం, ఎం.వి.పద్మావతి, సుప్రియ, జె.ఎం.శ్రీనివాస్, టి.కామేశ్వరి, బరాటం నాగేశ్వరరావు, పేరాడ తిలక్, దువ్వాడ శ్రీధర్, దువ్వాడ శ్రీకాంత్, దువ్వాడ వాణి, రొక్కం సూర్యప్రకాశరావు, ఎన్ని ధనుంజయ్, గేదెల రామారావు, సుంకరి కృష్ణ, సువ్వారి గాంధీ, కోణార్క్ శ్రీను, కిల్లి లక్ష్మణరావు, మామిడి శ్రీకాంత్, కెవివి సత్యన్నారాయణ, ధర్మాన రఘునాథమూర్తి, పీస శ్రీహరి, శిమ్మ వెంకట్రావు, పైడి నిర్మల్‌కుమార్, మండవిల్లి రవి, గుంట జ్యోతి పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలిగా రెడ్డి శాంతి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా రెడ్డి శాంతి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిర్ణయం మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం రాత్రి ఈ నియామకాన్ని ప్రకటించింది. అదే విధంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో ఎనిమిది మంది ప్రధాన కార్యదర్శులను నియమించగా జిల్లా నుంచి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు చోటు దక్కింది. పాలకొండకు చెందిన రెడ్డి శాంతిది రాజకీయ కుటుంబం. ఆమె తాత, నానమ్మలు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఆమె తండ్రి పాలవలస రాజశేఖరం కూడా ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో శాంతి శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేశారు. తన నియామకంపై ఆమె స్పందిస్తూ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తానని చెప్పారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి తానెప్పుడూ రుణపడి ఉంటానన్నారు. కాగా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ధర్మాన ప్రసాదరావు వైఎస్ హయాంలో రెవెన్యూ మంత్రిగా జిల్లా అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. -
ఇక సిక్కోలు సేవలోనే..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రజల మీద జగనన్నకు ఉన్న ఆపేక్ష.. జగనన్న మీద ప్రజల్లో నాటుకుపోయిన విశ్వాసమే తనను శ్రీకాకుళం ఎంపీగా గెలిపిస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి శాంతి ధీమాగా చెబుతున్నారు. తాను సిక్కోలు ఆడబిడ్డనేనని.. ఇక నుంచి సిక్కోలులోనే ఉంటూ సేవలందిస్తానని చెప్పారు. తనను ఎంపీగా గెలిపిస్తే జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడానికి ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నానన్నారు. ‘ఆరెంజ్-గ్రీన్ బేస్డ్ ఇండస్ట్రీ’ పాలసీతో జిల్లాను ప్రగతిబాట పట్టిస్తానని హామీ ఇచ్చారు. వెనుకబాటు తనానికి పర్యాయపదంగా నిలుస్తున్న శ్రీకాకుళం జిల్లాను ప్రగతికి చిహ్నంగా మారుస్తానని హామీ ఇస్తూ ప్రజల తీర్పును కోరుతున్న రెడ్డి శాంతి ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన కార్యాచరణను ఇలా ప్రకటించారు.. పదవీ కాంక్షతో రాలేదు పదవి, అధికారం పొందడానికిరాజకీయాల్లోకి రాలేదు. ఆ రెండూ మాకు కొత్త కాదు. మా నాన్నగారు పాలవలస రాజశేఖరం ఎంపీగా, ఎమ్మెల్యేగా, జెడ్పీ చైర్మన్‌గా పని చేశారు. అమ్మ ఇందుమతి కూడా ఎంపీపీగా, జెడ్పీటీసీ సభ్యురాలిగా పనిచేసింది. నా భర్త నాగభూషణరావు ఐఎఫ్ఎస్ అధికారికగా ఢిల్లీలో ఉన్నత హోదా లో ఉన్నారు. పదవులు, అధికార హోదాకు సన్నిహితంగానే ఉన్నాను. కానీ నేను పుట్టి పెరిగిన జిల్లాకు నావంతు ఏదైనా చేయాలన్న తపనతోనే రాజకీయాల్లోకి వచ్చాను. శ్రీకాకుళం అంటేనే వెనుకబడిన ప్రాంతమనే ముద్ర ఇప్పటికీ చెరిగిపోలేదు. ఇక్కడి నుంచి గెలిచిన టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర మంత్రులుగా చేశారు. కానీ, నియోజకవర్గంలో అందరికీ ఇప్పటికీ వ్యక్తిగత మరుగుదొడ్లు కూడా కల్పించలేకపోయారు. మహిళల గౌరవానికి సంబంధించిన కనీస అవసరం కూడా తీర్చలేదంటే బాధేస్తోంది. జిల్లా యువతకు ఉపాధి అవకాశాలే లేవు. ఏటా వేలమంది వలస వెళుతున్నారు. అపార సహజ వనరులు ఉండి కూడా నా సొంత జిల్లా ఇంతగా వెనుకబడి ఉందన్నదే నా బాధ. అందుకే నేను పుట్టిన గడ్డకు నా వంతు ఏదైనా చేద్దామన్న సంకల్పంతోనే శ్రీకాకుళం ఆడబిడ్డగా ప్రజల ముందుకు వచ్చాను. జగనన్న నాయకత్వమే రాష్ట్ర ప్రగతికి చుక్కాని విభజనతో రాష్ట్రం ఓ విపత్కర స్థితిలో చిక్కుకుంది. కాంగ్రెస్ తన రాజకీయ స్వార్థం కోసం అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించేసింది. రెండు నాల్కల విధానంతో టీడీపీ కాంగ్రెస్‌కు సహకరించింది. దాంతో రాజధాని ఏదో.. ఉపాధి అవకాశాలు ఎలాగో.. భవిత ఏమిటో తెలియని అయోమయస్థితిలో మనం పడిపోయాం. ఈ దుస్థితి నుంచి రాష్ట్ర ప్రజలను గట్టెక్కించాలంటే సాహసోపేత నాయకత్వం అవసరం. అభివృద్ధి, సంక్షేమం అజెండాగా పనిచేయగల సత్తా ఉన్న విశ్వసనీయ నాయకుడు కావాలి. జగనన్నే ఆ నాయకుడని రాష్ట్ర ప్రజలు ఇప్పటికే గుర్తిం చారు. పదవికి ఆశపడక, అధికారానికి బెదరక సాహసోపేతంగా ఓదార్పు యాత్ర చేశారు జగనన్న. విభజనను అడ్డుకోవడానికి జైలులో ఉన్నప్పుడు, బయటకు వచ్చిన తరువాతా చిత్తశుద్ధి తో పోరాడారు. ప్రస్తుతం అన్ని వర్గాల అభ్యున్నతిని కాంక్షిస్తూ సంక్షేమ మేనిఫెస్టోను ప్రజల ముందుంచారు. ఒక్క అమ్మ ఒడి పథకం చాలు జగనన్నకు ఈ రాష్ట్ర ప్రగతి పట్ల ఎంతటి దార్శనికత ఉందో తెలుసుకోవడానికి. విద్య ద్వారానే అటు ప్రజలు, ఇటు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యమన్నది గుర్తించే జగనన్న అమ్మ ఒడి పథకాన్ని రూపొందించారు. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలోని అన్ని పథకాలు కూడా ప్రజా సంక్షేమా న్ని కాంక్షించేవే. అందుకే జగనన్నను సీఎం చేయడం.. ఎక్కువమంది ఎంపీలను అందించి జగనన్నకు కేంద్రంలో పట్టు కల్పించడం ద్వారా మన రాష్ట్ర బంగారు భవితను మనమే లిఖించుకుందామనే లక్ష్యంతో ఎన్నికల బరిలో నిలిచాను. ఆరెంజ్-గ్రీన్ ఆధారిత పరిశ్రమలతో విప్లవం నన్ను ఆదరించి ఎంపీగా గెలిపిస్తే శ్రీకాకుళం నియోజకవర్గ దశ, దిశ మార్చేం దుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశాను. విభజనతో కేంద్రం ఉత్తరాంధ్రకు ప్రకటించిన 5 ఏళ్ల ప్రత్యేక ప్యాకేజీ ఏమాత్రం సరిపోదు. కనీసం 15 ఏళ్లు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. అలాగే 15ఏళ్లు ట్యాక్స్ హాలీడే ప్రకటిస్తేగానీ ఈ ప్రాంతంలో పరిశ్రమలు పూర్తిస్థాయిలో నెలకొల్పలేం. అందుకోసం జగనన్న సహకారంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధిస్తాను. జిల్లాలోఅపార సహజ వనరులను పూర్తిస్థాయిలో సద్వినియో గం చేసుకునేలా పర్యావరణ అనుకూల ఆరెంజ్-గ్రీన్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏర్పాటుకు చర్యలు తీసుకుం టాను. తీరప్రాంత ఆధారిత, వ్యవసాయాధార పరిశ్రమలు నెలకొల్ప డం ద్వారా ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి సాధించవచ్చు. గ్రీన్ అక్వా, పాడి పరిశ్రమలను ప్రోత్సహించి వాటి ఉత్పత్తులకు జాతీ య, అంతర్జాతీయ మార్కెట్ కల్పించేందుకు కృషి చేస్తాను. ఉదాహరణకు జిల్లాలో అవుపాలు లీటరు రూ.20 ఉంటే ఢిల్లీలో రూ.120 ఉంది. శ్రీకాకుళంతో పోలిస్తే ఢిల్లీలో ఆవు నెయ్యి ధర పదిరెట్లు ఎక్కువ. పాడి పరిశ్రమకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే మన రైతులకే గరిష్ట లబ్ధి చేకూరుతుంది. వీటన్నింటి ద్వారా శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉద్దానంలో మూత్రపిండాల వ్యాధుల సమస్య పరిష్కారంపై ఎవరూ చిత్తశుద్ధతో దృష్టి సారించలేదు. ఆ వ్యాధి ఈ ప్రాంతంలో మహమ్మారిలా ప్రబలడానికి మూల కారణాన్ని సోధించేందుకు విదేశీ సంస్థలు, ఎన్జీవోల సహకారం తీసుకోవాలి. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి నిపుణులైన సిబ్బందిని నియమించాల్సి ఉంది. జిల్లాలో వెనుకబడిన మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్పించాలని కోరిన వెంటనే జగనన్న హామీ ఇచ్చారు. సిక్కోలు బిడ్డగానే ఉంటా ప్రత్యర్థి పార్టీలు అసత్య ప్రచారాలను తెరపైకి తెస్తున్నాయి. నేను ఎన్నికైతే విజిటింగ్ ఎంపీగా ఉంటాననే అసత్య ప్రచారంతో ప్రజలను తప్పుదారి పట్టించాలని ప్రయత్నిస్తున్నాయి. విజిటింగ్ ఎంపీగా కాదు.. పూర్తిస్థాయి సేవకురాలిగా ప్రజలకు అందుబాటులో ఉంటాను. నేను ఈ జిల్లా ఆడపడుచుని. ఇక్కడే పుట్టాను.. ఇక్కడే చదివాను. మా అమ్మనాన్న ఇక్కడే ఉన్నారు. భర్త తరఫు వారంతా కూడా ఇక్కడివారే. నా భర్త నాగభూషణరావు ఐఎఫ్ఎస్ అధికారి అయినందున ఉద్యోగరీత్యా ఢిల్లీలో ఉన్నప్పటికీ నా మూలాలు శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాయి. నా మనస్సు ఈ జిల్లాతో ముడివేసుకునే ఉంది. ఎంపీగా గెలిచిన తరువాత పూర్తి సమయం జిల్లాలోనే ఉంటాను. శ్రీకాకుళంలోనే కుటుంబంతో సహా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాను. శ్రీకాకుళం ఆడబిడ్డగానే నన్ను ప్రజలు ఎంతగానో ఆదరి స్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి అజెండాను విశ్వసిస్తున్నారు. ఇవే నన్ను గెలిపిస్తాయన్న నమ్మకం ఉంది. -
చంద్రబాబువి అడ్డగోలు హామీలు
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: అధికారంలో ఉన్న రోజుల్లో ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేసిన టీడీపీ నాయకుడు చంద్రబాబు మరోసారి అధికారం కోసం అడ్డగోలు హామీలు గుప్పిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం లోక్‌సభ, శాసనసభ సమన్వయకర్తలు రెడ్డి శాంతి, ధర్మాన ప్రసాధరావులు ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని 14వ వార్డు పరిధి చిత్తరంజన్‌వీధి, పెట్రోమాక్స్‌వీధి, బలిజేపల్లివారివీధి, అనంతపల్లివారివీధి, గాజులవీధి, చేపలవీధి, చిన్నబజారు తదితర ప్రాంతాల్లో ఆదివారం ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజలకు వివరించి ఫ్యాన్ గుర్తుపైనే ఓటువేసి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని సీఎం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ప్రజలు నమ్మకంతో ఎన్టీఆర్‌కు అధికారం అప్పగిస్తే చంద్రబాబు వెన్నుపోటు పొడిచి ఆ అధికారాన్ని లాక్కున్నారని ఆరోపించారు. ప్రజలపై వివిధ రకాల పన్నుల భారం మోపి ఇబ్బందులకు గురిచేశారన్నారు. రైతాంగాన్ని పూర్తిగా విస్మరించి వారు కష్టాలపాలయ్యేలా చేశారన్నారు. తొమ్మిదేళ్లపాటు ప్రజలంతా నరకయాతన అనుభవించేలా పాలన చేశారన్నారు. ఇపుడు అధికార దాహంతో సాధ్యంకాని హామీలను చెబుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు మరోసారి ప్రయత్నిస్తున్నారన్నారు. బాబు మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. రెడ్డి శాంతి మాట్లాడుతూ వైఎస్ అధికారం చేపట్టిన వెంటనే రైతుల కోసం ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేసి వారి కళ్లలో ఆనందం చూశారన్నారు. ప్రజల అభివృద్ధే ధ్యేయంగా అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టి ప్రజలకు స్వర్ణయుగంలాంటి పాలన అందించారన్నారు. ప్రచార కార్యక్రమంలో పార్టీ నేతలు ఎం.వి.పద్మావతి,అంధవరపువరహా నరసింహం, చల్లా అలివేలు మంగ, అంధవరపు సూరిబాబు, కోణార్క్ శ్రీను, మండవిల్లి రవి, జె.ఎం.శ్రీనివాస్, అబ్దుల్ రెహమాన్, టి.కామేశ్వరి, కె.ఎల్. ప్రసాద్, శిమ్మ వెంకట్రావు, పైడి నిర్మల్‌కుమార్, శిమ్మ రాజశేఖర్, గుడ్ల మల్లేశ్వరరావు, సీపాన భాస్కరరావు, గుంట జ్యోతి, చల్లా మంజుల, టి.మోహిని, డి.విజయలక్ష్మి, మహమ్మద్ సిరాజుద్దీన్, రావాడ జోగినాయుడు, ట్రేడ్‌యూనియన్ భాస్కరరావు, కూన వాసుదేవరావు, స్థానికులు రుంకాన డాక్టర్, జామి దాము, రెడ్డి జగన్నాథం పాల్గొన్నారు. -
బలహీనవర్గాలకు అండ - వైఎస్ఆర్ సీపీ జెండా
నందిగాం, న్యూస్‌లైన్: బడుగు, బలహీన వర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా అండగా ఉంటుందని ఆ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి అన్నారు. ఆది వారం కొండల ప్రాంతంలోని సుడిగాలి పర్యటన చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏ గ్రామానికి వెళ్లినా ఆమె ప్రసంగానికి ప్రజలు నీరాజనం పట్టారు. ఓ వైపు ప్రచండమైన ఎండ, ఉక్కపోత, వేడిమిని సైతం తట్టుకొని ప్రజలు నీరాజనం పట్టారు. తొలుత రాంపురంలో అడుగుపెట్టిన శాంతి కొండల ప్రాంతానికి శివారున ఉన్న దిమ్మిడిజోల, దీనబందుపురం గ్రామాల వరకు నిరాటంకంగా పర్యటించింది. పెద్దతామరాపల్లి గ్రామంలో ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడుతూ రైతులు సుభిక్షంగా ఉండాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు, విద్యార్థులకు, అన్ని వర్గాల ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింది రాజశేఖర్‌రెడ్డి మాత్రమే అని, మళ్లీ అవి కొనసాగిస్తూ మరికొన్ని పథకాలు జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే ప్రవేశ పెడతారని భరోసా ఇచ్చారు. టీడీపీ అదినేత చంద్రబాబునాయుడు ఇస్తున్న నెరవేర్చలేని హామీలను ప్రజలు నమ్మవద్దని కోరారు. టెక్కలి సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీ తుడుచుకుపోతుందన్నారు. కర్లపూడి, నౌగాం, కల్లాడ, మదనాపురం, అన్నాపురం, దిమ్మిడిజోల, హర్షబాడ, దీనబందుపురం తదితర గ్రామాల్లో పర్యటించారు. కార్యక్రమంలో కింతల ధర్మారావు, చింతాడ మంజు, యర్రా చక్రవర్తి, పోలాకి మోహన్, తమిరె వివేకానంద, దేవేంద్ర, తమిరె బలరాం, పోలాకి సాంభమూర్తి, చిరంజీవులు, పుష్యా సత్యం, జీరు నానిరెడ్డి, నడుపూరి శ్రీరామ్మూర్తి, కొల్లి శ్రీరాములు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక రెడ్డి శాంతి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే బమ్మిడి నారాయణస్వామితోపాటు రాంపురం గ్రామస్తులు పలువురు పార్టీలో చేరారు. అలాగే గొల్లూరు మాజీ సర్పంచి జీరు నానిరెడ్డి, ప్రస్తుత ఉపసర్పంచ్ రట్టి ఈశ్వరరావుతోపాటు మరికొందు పార్టీలో చేరారు.