
రెడ్డి శాంతి
శ్రీకాకుళం ,కొత్తూరు: డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు బూటకపు హామీలిచ్చి మహిళలను మోసం చేశారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి దుయ్యబట్టారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రుణాలు మాఫీ చేస్తామని, బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దని చెప్పడంతో నిజమేననుకుని మహిళలు నమ్మేశారని, తర్వాత అప్పుల్లో కూరుకుపోయారని పేర్కొన్నారు. తిత్లీ తుఫాన్ నేపథ్యంలో రుణాలు సకాలంలో చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బూటకపు హామీతో మోసగించిన చంద్రబాబునాయుడుకు వచ్చే ఎన్నికల్లో మహిళలు తగిన గుణపాఠం చెబుతారని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment