
గొప్పిలి గ్రామస్తులతో రెడ్డి శాంతి
శ్రీకాకుళం, మెళియాపుట్టి: రాష్ట్రంలో ప్రజా సంక్షేమం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి అన్నారు. ఆదివారం గొప్పిలిలో రావాలి జగన్..కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి నవరత్నాల పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. మూడు రోడ్ల జంక్షన్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామస్తులనుద్దేశించి రెడ్డి శాంతి మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతి కోసం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పేదలకు వరమని చెప్పారు. 45 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.2వేలు, దివ్యాంగులకు నెలకు రూ.3వేలు పింఛన్ అందిస్తామని తెలిపారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేపడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే మూడు వేల కిలోమీటర్ల మేర యాత్ర పూర్తి చేశారని తెలిపారు.
ప్రజలు మరింతగా ఆదరించి వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు. రాజన్న రాజ్యం వస్తే ప్రజా సమస్యలన్నీ పరిష్కారమవుతాయని భరోసా ఇచ్చాన్నారు. హామీలతో మోసగించిన టీడీపీకి, ఫిరాయింపు నాయకులకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఇళ్లు, ఫించన్లు మంజూరు కావడం లేదని, తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు గ్రామస్తులు రెడ్డి శాంతి దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పాడి అప్పారావు, బూత్ కమిటీ నియోజకవర్గ మేనేజర్ జిల్లా ప్రధాన కార్యదర్శి అలికాన మాధవరావు, జెడ్‌పీటీసీ ప్రతినిధి బమ్మిడి ఖగేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు బైపోతు భాస్కరరావు, నాయకులు సీహెచ్ శ్రీకర్ణ, పోలాకి జయమోహనరావు, పెద్దింటి చిన్నారావు, పల్లి యోగి, బైపోతు ఉదయ్‌కుమార్, నక్క బాబూరావు, రంగారావు, నారాయణ, మార్కండేయులు, తేజారావు, రుషి, శంకరరావు, ముఖలింగం, దువ్వాడ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాసంకల్ప యాత్రలో తమ్మినేని
ఆమదాలవలస: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో పార్టీ శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఆదివారం విజయనగరం జిల్లా గుర్ల మండలంలో జరి గిన పాదయాత్రలో అధినేతతో కలిసి అడుగులు వేశారు. ప్రజా సమస్యలు, ఓటర్లు గల్లంతు తదితర అంశాలపై చర్చించారు.
జననేతను కలిసిన దువ్వాడ
టెక్కలి: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ఆదివారం కలిశారు. యువనేత చేపడుతున్న ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా విజయనగరం జిల్లా గుర్ల మండలం కెల్ల గ్రామం సమీపంలో అధినేతను కలిసి జిల్లాలో పార్టీ పరిస్థితులను వివరించారు. జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి కొంతదూరం పాదయాత్ర చేశారు.