రెడ్డి శాంతి
శ్రీకాకుళం, కొత్తూరు: నిరుద్యోగ భృతి కోసం సొంత మండలాల్లోనే బయోమెట్రిక్ వేయాలన్న నిబంధనలు విధించడం తగదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగ భృతి లబ్ధిదారులను తగ్గించుకునే యత్నాల్లో భాగంగానే ఇటువంటి నిబంధనలు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగాల కోసం ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగులు తాజా నిబంధనతో నిరుద్యోగ భృతిని పొందలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మొదటి నుంచీ నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తునే ఉందని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పథకాలను కాపీ కొడుతున్న సీఎం చంద్రబాబునాయుడుకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. డ్వాక్రా రుణమాఫీ పేరుతో మహిళలను మోసం చేశారని, తాజాగా పసుపు కుంకుమ పేరుతో మరోసారి మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment