
సాక్షి, మహారాణిపేట (విశాఖ దక్షిణ): ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈనెల 9న విశాఖ రానున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి విమానంలో 9న ఉదయం 11.50 గంటలకు విశాఖ చేరుకుంటారు. మధ్యాహ్నం 12:05కు హెలికాప్టర్‌లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై..అక్కడ నుంచి మధ్యాహ్నం 2.50 గంటలకు విశాఖ చేరుకుంటారు. విశాఖ ఎయిర్‌పోర్టులో మధ్యాహ్నం 2.50 గంటలనుంచి 3.30 వరకు సీఎం ప్రోగ్రాం రిజర్వ్‌లో ఉంచారు. మధ్యాహ్నం 3.30 గంటలకు విమానంలో బయలుదేరి భువనేశ్వర్ వెళతారు.