'ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి' | andrapradesh inclusive growth through special status only says reddy shanthi | Sakshi
Sakshi News home page

'ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి'

Published Sat, Oct 3 2015 3:05 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

andrapradesh inclusive growth through special status only says reddy shanthi

  • వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతి

  • కొత్తూరు (శ్రీకాకుళం జిల్లా): ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరుగుతుందని శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు రెడ్డిశాంతి పేర్కొన్నారు. కొత్తూరు మండలం వైఆర్ పేటలో శనివారం ఆమె విలేకరులతో మాట్లడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంకోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 7వ తేదీ నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేయనున్నారని, అందుకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

    బీజేపీ-టీడీపీ కుమ్మక్కై ప్రత్యేక హోదా రాకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని, 13, 14 ఆర్థిక సంఘం నిధుల్లో గ్రామ పంచాయతీలకు సంబంధించిన నీటి పన్ను, విద్యుత్ చార్జీలను మినహాయించడం దారుణమన్నారు. అమలు కాని హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement