Inclusive growth
-
G7 Summit 2024: టెక్నాలజీలో గుత్తాధిపత్యానికి తెరపడాలి
బరీ(ఇటలీ): సాంకేతికత అనేది కేవలం అతి కొద్ది సంస్థలు, దేశాల చేతుల్లో ఉండకూడదని, ఇలాంటి గుత్తాధిపత్యానికి తెరపడాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిలషించారు. ఇటలీలోని బోర్గో ఎగ్నాజియా రిసార్ట్‌లో జరుగుతున్న జీ7 దేశాల 50వ శిఖరాగ్ర సదస్సులో శుక్రవారం ప్రధాని మోదీ సాంకేతికత అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘ మనం వినూత్న టెక్నాలజీని సృష్టించాలేగానీ విధ్వంసకర సాంకేతికతను కాదు. సాంకేతికతో గుత్తాధిపత్యం పోవాలి. సాంకేతికతను ప్రజాస్వామ్యయుతంచేయాలి. అప్పుడే సమాజంలోని అన్ని వర్గాలకు దానిని చేరువ చేయగలం. సాంకేతికత ఫలాలు అందరికీ అందాలి. అప్పుడే సమ్మిళిత సమాజాభివృద్ధికి బాటలు వేసిన వారమవుతాం. మానవీయ విలువలున్న సాంకేతికత ద్వారా మెరుగైన భవిష్యత్తు కోసం భారత్ కలలు కంటోంది. కృత్రిమ మేథపై జాతీయ విధానాన్ని రూపొందించి అమలుచేస్తున్న అతి కొద్ది దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఈ వ్యూహంలో భాగంగానే ఈ ఏడాది భారత్‌లో ‘ఏఐ మిషన్’కు అంకురార్పణ చేశాం. అందరికీ ఏఐ అనేది దీని మంత్రం. ‘గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఏఐ’లో వ్యవస్థాపక సభ్యునిగా, ఈ కూటమి ప్రస్తుత సారథిగా అన్ని దేశాల మధ్య సహకారాన్ని ఆశిస్తున్నా’’ అని మోదీ అన్నారు. ఏఐపై అంతర్జాతీయ నియమావళి ఉండాల్సిందే‘‘విస్తృతమవుతున్న ఏఐ రంగంపై అంతర్జాతీయంగా ఏకరూప నియమావళి ఉండాల్సిందే. గత ఏడాది ఢిల్లీ వేదికగా జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులోనూ భారత్ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. భవిష్యత్తులోనూ పారదర్శక, స్వేచ్ఛా, సురక్షిత, సులభతర వినియోగ, భాధ్యతాయుత ఏఐ కోసం అన్ని దేశాలతో భారత్ కలిసి పనిచేస్తుంది. ఇంధనం పైనా భారత వైఖరి మారదు. ఇంధనం అందరికీ అందుబాటులో ఉండాలి. అందరూ వినియోగించుకోగలగాలి. అందరికీ ఆ స్తోమత ఉండాలి. ఇందుకు అందరి ఆమోదం కూడా ఉండాలి’’ అని అన్నారు.గ్లోబల్ సౌత్ దేశాలపై భారం‘‘అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిర, ఉద్రిక్త పరిస్థితుల దుష్ప్రభావాలు ఏ పాపం చేయని గ్లోబల్ సౌత్ దేశాలపై పడుతున్నాయి. అందుకే మా సమస్యలు, ప్రాధాన్యాలను ఇలాంటి ప్రపంచ వేదిక సాక్షిగా చాటేందుకు భారత్ తన వంతు బాధ్యతగా ముందుకొచ్చింది. అందులో భాగంగానే ఆఫ్రికాకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. గత ఏడాది జీ20 సారథిగా భారత్ ఆఫ్రికా యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం ఇప్పించినందుకు గర్వపడుతోంది. ఆఫ్రికా దేశాల ఆర్థిక, సామాజిక, భద్రత, సుస్థిరాభివృద్ధికి భారత్ తన వంతు సాయం అందిస్తోంది. ఇక మీదటా ఈ సాయం కొనసాగుతోంది’’ అని అన్నారు.‘లైఫ్’ను పట్టించుకోండి‘‘పర్యావరణహిత జీవితశైలి(ఎల్ఐ ఎఫ్ఈ– లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్)ని అలవర్చుకోండి. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారత్‌లో ప్రారంభించిన ‘మట్టి మాతృమూర్తికోసం మొక్క’ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటండి. అందరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా. ఈ ప్రజాఉద్యమాన్ని అంతర్జాతీయ బాధ్యతను భావించి ప్రపంచ దేశాలు మొక్కలు నాటే కార్య క్రమాన్ని విస్తృతం చేయాలి. మొక్కల పెంపకం భూమిపై పచ్చదనాన్ని పెంచుతుంది. నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం 2070 ఏడాదికల్లా కర్భన తటస్థత(కార్భన్ నెట్‌జీరో) సాధించేందుకు భారత్ శతథా కృషిచేస్తోంది. హరిత యుగం మళ్లీ సాకారమయ్యేలా మనందరి కలిసి కృషిచేద్దాం’’ అని మోదీ పిలుపునిచ్చారు. -
అందరి ఆర్థిక వృద్ధితోనే దేశ ప్రగతి..
న్యుఢిల్లీ: అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తేవడమనేది సమ్మిళిత వృద్ధి సాధన దిశగా కీలక అడుగని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సమాజంలోని అట్టడుగు వర్గాల ఆర్థిక అభివృద్ధికి ఇది దోహదపడగలదని పేర్కొన్నారు. ప్రజలందరి ఆర్థిక వృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమని ఆమె తెలిపారు. ప్రధాన మంత్రి జన ధన యోజన (పీఎంజేడీవై) ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా నిర్మల ఈ విషయాలు తెలిపారు. 2014 ఆగస్టు 28న ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటి వరకూ 46 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరవగా, ఆ అకౌంట్లలో రూ.1.74 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయని ఆమె వివరించారు. జేఏఎం (జన ధన – ఆధార్ – మొబైల్) ద్వారా బ్యాంకు ఖాతాలను ఆధార్, మొబైల్ నంబర్లతో అనుసంధానం చేయడం వల్ల వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సత్వరం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేయడం సాధ్యపడిందని పేర్కొన్నారు. -
అందరికీ వృద్ధి ఫలాలు అందడమే అసలైన అభివృద్ధి
న్యూఢిల్లీ: సమ్మిళిత వృద్ధి (అందరికీ వృద్ధి ఫలాలు చేరేలా) లేకుండా అసలైన వృద్ధి సాధ్యపడదని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు ఈ దిశగా తీసుకున్నట్టు చెప్పారు. తొలిసారిగా అరుణ్‌జైట్లీ స్మారక ఉపన్యాసం ఇచ్చారు. ప్రైవేటు రంగాన్ని వృద్ధిలో భాగస్వామిగా చూస్తున్నట్టు చెప్పారు. సమ్మిళిత వృద్ధి కోసం తీసుకున్న చర్యలను వివరిస్తూ.. ‘‘9 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశాం. 10 కోట్ల టాయిలెట్లను ప్రభుత్వం నిధులతో నిర్మించాం. 45 కోట్ల బ్యాంకు ఖాతాలను పేదల కోసం తెరిచాం. 2014కు ముందు పదేళ్లలో 50 వైద్య కళాశాలలు ఏర్పాటు కాగా, గత 7–8 ఏళ్లలో 209 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభమయ్యాయి’’అని చెప్పారు. భారత్ తప్పనిసరి అయి సంస్కరణలు చేపట్టడం లేదని స్పష్టం చేస్తూ.. తదుపరి 25 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని దృఢ విశ్వాసంతో అమలు చేస్తున్నట్టు తెలిపారు. సంస్కరణలు అందరికీ ఫలాలను ఇస్తాయన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, సీనియర్ బీజేపీ నేత అయిన అరుణ్‌జైట్లీకి ప్రధాని నివాళులు అర్పించారు. -
‘ఆఖరి మైలు’ జనహృదయానికి దగ్గరయితే...
ప్రభుత్వం చేయవలసింది, అభివృద్ధి – సంక్షేమం అని ఒక స్థూల నిర్వచనం ఇవ్వడం వల్ల, ఈ రెండింటి మధ్య ఉండే మరికొన్ని అంశాలు ఎప్పటికీ ‘అనిర్వచ నీయం’గా మిగిలి, వెలుగు చూడవు! అయితే, వాటిని కూడా కలుపుకొని చూడ్డం మొదలుపెడితే, ‘అభివృద్ధి’– ‘సంక్షేమం’ మాత్రమే కాకుండా, మరొక కొత్త అంశం ఉందనే స్పృహ మనకు కలుగుతుంది. ఒకప్పుడు– ‘అశోకుడు రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించెను...’ అనే చరిత్ర, ఇప్పుడు ఈ రెండింటిలో ఏ జాబితా కిందకు వస్తుంది అనే ప్రశ్న అటువంటిదే. ‘రాజ్యం’ పట్టించుకునే, ఇటువంటి మానవీయ పార్వ్వాలను ఈమధ్య– ‘ప్రపంచ బ్యాంక్’ భాషలో ‘ఇంక్లూజివ్ గ్రోత్’ అంటున్నారు. అంటే– అందరినీ కలుపుకొని ‘వృద్ధి’ చెందుదాం... అని. ప్రభుత్వాల పాలన తీరును బట్టి సామాన్య జనం ‘దేహభాష’ మారుతుంది. అప్పటివరకు ఉగ్గబట్టుకున్న ఒత్తిడిని వారు ‘వెంటిలేట్’ చేయడం మొదలు పెడతారు. పత్రికల భాషలో దాన్ని– ‘ఆందోళన’ అంటారు. అయితే, విధాన నిర్ణయాల వద్ద వాటి పరిష్కా రాలు, ప్రతిఫలనాలు ఎలా వున్నా, ఒక ఉమ్మడి సమస్య పరి ష్కారం కోసం పదిమంది బయటకు వచ్చి గొంతు ఎత్తడం అనేది, అప్పటికి అక్కడ అది వారి తొలి విజయం అవుతుంది! (చదవండి: ఆర్థికమే కాదు... సామాజికం కూడా!) ఈ అక్టోబర్ చివరివారంలో గడచిన ఏడున్నరేళ్ల విభజిత ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారి ‘హెల్ప్’, ‘విముక్తి’ అనే రెండు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి, ‘ట్రాఫికింగ్ నిరోధం, రక్షణ, పునరావాసం బిల్లు– 2021’ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని, గుంటూరు జిల్లా నరసరావుపేట అధికార పార్టీ ఎం.పి. లావు శ్రీకృష్ణ దేవరాయలకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశాయి. బాలికలు, స్త్రీల ఆక్రమణ రవాణా (‘ట్రాఫికింగ్’) తీవ్ర అమానవీయ సామాజిక సమస్యగా పరిణమించి, దేశ వ్యాప్తంగా అసాంఘిక శక్తులకు కొత్త ఆదాయ వనరుగా మారింది. పౌరసమాజం నుంచి వచ్చే ఇటువంటి స్వచ్ఛంద డిమాండు, నిజానికి రాజకీయాలకు అతీతంగా చర్చనీయాంశం కావాలి. కానీ ‘మీడియా’ ప్రభుత్వానికి పౌరసమాజానికి మధ్య నిత్యం దట్టమైన పొగమంచు తెరలు కడుతూ 24 బై 7 వార్తలు అందించడం మొదలయ్యాక, ఇది ప్రముఖంగా వార్త కాలేదు. (చదవండి: మహిళలు... కొంచెం ఎక్కువ సమానం) నవంబర్ 27న కర్నూలు నగరంలో జరిగింది కూడా ఇటు వంటిదే. రాష్ట్ర అబ్కారీ శాఖ ఉల్లాల్ రోడ్డులో కొత్తగా కట్టిన ఒక బిల్డింగ్ కాంప్లెక్స్‌లో వైన్‌షాపు ప్రారంభించాలని, ముందు రోజు అర్ధరాత్రి మద్యం కేసుల్ని అక్కడకు చేర్చింది. విషయం తెలిసిన పరిసరాల్లోని మహిళలు అక్కడికి పెద్ద ఎత్తున చేరి, ఆ శాఖ అధికారుల ప్రయత్నాన్ని భగ్నం చేశారు. మూడు పెద్ద పాఠ శాలలు వున్న కూడలిలో ప్రభుత్వం వైన్‌షాపు తెరిస్తే, విద్యా ర్థులతో అక్కడికి వచ్చే తల్లులకు అది ఇబ్బంది అనేది వారి అభ్యంతరం. ఆ షాపును కొద్ది రోజుల్లోనే వేరేచోటికి మారుస్తామని, ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న మహిళా అధికారి హామీ ఇచ్చినప్పటికీ, వారు అందుకు అంగీకరించ లేదు. మనం ఎన్నుకొన్నది ప్రజాహితం కోరే ప్రభుత్వం అనే నమ్మకం ‘ఆఖరి మైలు’ జనంలో కూడా కలిగినప్పుడు, ప్రజా స్పందన ఇలా బహిరంగ దృశ్యమవుతుంది. కొత్తగా తమదైన ‘జాగా’ను వారు ఇలా దొరకబుచ్చుకుంటారు. ఆంగ్లంలో దీన్ని ‘అడ్వాంటేజ్’ తీసుకోవడం అంటారు. ‘నీతో కాక, ఇంకెవరితో చెప్పుకుంటాం?’ అని– తమ హృదయాలకు దగ్గరైన నేతల ప్రభుత్వాల్లో జనం తమ ఆక్రోశాన్ని సైతం ఇలా ఆస్వాదిస్తారు. (Nandamuri Balakrishna: ఎప్పటికీ వెంటాడే వెన్నుపోటు!) ఇటువంటి వాటిని అభివృద్ధి–సంక్షేమం చట్రంలో పెట్టి చూడ్డం కష్టం. ఇటీవల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్టణం, అనంతపురం జిల్లాల గ్రామీణ జిల్లా పరిషత్ పాఠ శాలల విద్యార్థుల విషయంలో జరిగింది కూడా అటువంటిదే. గ్రామాల్లో జిల్లా పరిషత్ పాఠశాలల్లో చదివే పిల్లల దేహ ధారుడ్యానికి క్రీడల ప్రోత్సాహానికి మౌలిక సదుపాయాలు లేవన్నది జగమెరిగిన సత్యం. అటువంటిది, ఒక్కొక్క పాఠశాలకు పది లక్షలు మించకుండా ఖర్చు చేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో మిగిలిన ‘మెటీరియల్’ నిధులను ప్రభుత్వం ఇందుకు ఖర్చు చేస్తున్నది. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, రన్నింగ్ ట్రాక్స్ ఆయా స్కూల్స్‌కు అనుబంధంగా ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ క్రీడల అభివృద్ధి సంస్థ ‘శాప్’ను తగు చర్యలు కోసం కోరింది. ఎక్కడైనా ‘తేమ’ ఉన్నచోట రాళ్ళ మధ్య కూడా గరిక మొలుస్తుంది. ‘తోకలు కత్తిరిస్తా...’ అంటూ హెచ్చరించేవారికి ఇటువంటి ‘గ్రామర్’ అర్థం కావడం కష్టం. ‘ఆఖరి మైలు’ జనం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ ఎటువంటిదో, ‘సోషల్ మీడియా’ వల్ల ఈ రెండున్నర ఏళ్లలో రాష్ట్ర ప్రజలు దగ్గరగా గమనిస్తున్నారు. అదే వారిలో– ‘అకస్మాత్తుగా వచ్చిన ప్రకృతి విపత్తుకు ఆయన మాత్రం ఏమిచేస్తాడు?’ అనే తార్కిక దృష్టి కలిగించింది. విపత్తు తదనంతరం ప్రభుత్వ యంత్రాగం ద్వారా అందిన ఉపశమన చర్యల్లోని నిజాయితీ వారికి కనిపించింది. - జాన్సన్ చోరగుడి వ్యాసకర్త రచయిత, సామాజిక విశ్లేషకుడు -
ఆ విషయంలో పాక్, చైనాలే బెటర్
దావోస్ : సమ్మిళిత అభివృద్ధి విషయంలో ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 62వ స్ధానంతో సరిపెట్టుకుంది. చైనా 26వ స్ధానం, పాకిస్ధాన్ 47వ స్ధానంలో మనకంటే మెరుగైన ర్యాంక్‌లు సాధించాయి. ప్రపంచంలోనే మెరుగైన సమ్మిళిత ఆర్థిక వ్యవస్థగా నార్వే అగ్రభాగాన నిలిచింది. ఇక ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో లిథునియా టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకుంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం భేటీకి ముందు వార్షిక సమ్మిళిత వృద్థి సూచిక జాబితాను విడుదల చేసింది. ఆయా దేశాల్లో ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణం, రుణాల ఊబి నుంచి భవిష్యత్ తరాలను కాపాడటం వంటి ప్రామాణికాలను పరిగణనలోకి తీసుకుంటూ ఈ సూచీ రూపొందించినట్టు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వెల్లడించింది. నూతన సమ్మిళిత వృద్ధి, అభివృద్ధి పద్ధతులను అనుసరించాలని ప్రపంచ నేతలను కోరింది. జీడీపీ గణాంకాలనే ఆర్థిక వృద్ధికి కొలమానాలుగా చూడటం అసమానతలకు దారితీస్తుందని హెచ్చరించింది. -
అవకాశమిస్తే సమగ్రాభివృద్ధి
* వరంగల్ ఎన్నికలతో మార్పు రావాలి * 2019లో స్వతంత్రంగా పోటీ... మీట్ ది ప్రెస్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే వరంగల్ సమగ్రాభివృద్ధికి కేంద్రం నుంచి అత్యధిక నిధులు మంజూరు చేయించుకునే అవకాశం ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో రూ.43 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధికి కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్ ది ప్రెస్‌లో కిషన్‌రెడ్డి మాట్లాడారు. టీఆర్ఎస్ నేతలకు ఎన్నికలప్పుడే పూనకమొస్తుందని, ఏవో హమీలు గుప్పిస్తూ ఎన్నికలయ్యాక మరిచిపోతారని చెప్పారు. 2019 ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి రూ.1,200 కోట్లతో ఎయిమ్స్ ఆస్పత్రి, హార్టికల్చర్ వర్సిటీ, గిరిజన వర్సిటీ, ఫార్మాసూటికల్ రిసెన్స్ సెంటర్, ఈఎస్ఐ మెడికల్ కళాశాలను తీసుకువచ్చామన్నారు. పత్తి పరిశోధనా కేంద్రం ఏర్పాటు, విమానాశ్రయ పున రుద్ధరణకు చర్యలు చేపట్టామన్నారు. హైదరాబాద్‌లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, వరంగల్‌లో టెక్స్టైల్ పార్కుకు కేంద్రం అంగీకారం తెలిపిందని వివరించారు. అమృత్ పథకం కింద వరంగల్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. వరంగల్‌ను స్మార్ట్ సిటీగా రెండో జాబితాలో ప్రకటిస్తామన్నారు. -
'ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి'
వైఎస్సార్సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతి కొత్తూరు (శ్రీకాకుళం జిల్లా): ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరుగుతుందని శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు రెడ్డిశాంతి పేర్కొన్నారు. కొత్తూరు మండలం వైఆర్ పేటలో శనివారం ఆమె విలేకరులతో మాట్లడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంకోసం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి 7వ తేదీ నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేయనున్నారని, అందుకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. బీజేపీ-టీడీపీ కుమ్మక్కై ప్రత్యేక హోదా రాకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని, 13, 14 ఆర్థిక సంఘం నిధుల్లో గ్రామ పంచాయతీలకు సంబంధించిన నీటి పన్ను, విద్యుత్ చార్జీలను మినహాయించడం దారుణమన్నారు. అమలు కాని హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని చెప్పారు. -
సమ్మిళిత వృద్ధిలో అట్టడుగున భారత్
డబ్ల్యూఈఎఫ్ నివేదిక జెనీవా: అభివృద్ధి, సమ్మిళిత వృద్ధి అంశాల్లో భారత్ దాదాపు అట్టడుగు స్థానంలో ఉందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఒక నివేదికలో పేర్కొంది. అయితే, వ్యాపారం.. రాజకీయాల్లో నైతికత విషయంలో మాత్రం అంతర్జాతీయంగా మెరుగైన స్థితిలోనే ఉన్నట్లు వివరించింది. 112 ఎకానమీలపై దాదాపు రెండేళ్ల పాటు అధ్యయనం అనంతరం విడుదల చేసిన సమ్మిళిత వృద్ధి మరియు అభివృద్ధి నివేదికలో డబ్ల్యూఈఎఫ్ ఈ అంశాలు పేర్కొంది. ఇందులో ర్యాంకింగ్స్ ప్రకారం .. మధ్యస్థాయి ఆదాయాల దేశాల జాబితాలోని 38 దేశాల్లో భారత్ దాదాపు చివరి స్థానాల్లో ఉంది. ఆర్థిక ప్రయోజనాల బదలాయింపు అంశంలో 37వ స్థానంలో ట్యాక్స్ కోడ్ అమల్లో 32వ స్థానంలో, సామాజిక భద్రత విషయంలో 36వ స్థానంలో ఉంది. ఇక చిన్న వ్యాపారాల యాజమాన్యం అంశంలో గ్రూప్‌లోని మిగతా అన్ని దేశాల కన్నా అట్టడుగున 38వ స్థానంలో నిల్చింది. అయితే, వ్యాపార, రాజకీయ నైతికత విషయంలో మెరుగ్గా 12వ స్థానంలోనూ, పెట్టుబడులు ఉత్పాదకతకు ఉపయోగపడుతున్నాయన్నది సూచిస్తూ ఆర్థిక మధ్యవర్తిత్వం అంశంలో 11వ స్థానంలో ఉంది. అసెట్ నిర్మాణం, ఔత్సాహిక వ్యాపారవేత్తలను తీర్చిదిద్దడంపై భారత్ దృష్టి సారించాల్సి ఉంటుందని డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. -
మానవాభివృద్ధి సూచీలో మొదటి స్థానం పొందిన దేశం?
Civils Prelims Paper - I ఎకానమీ సాంఘిక అభివృద్ధి, సమ్మిళిత వృద్ధి వస్తు, సేవల ఉత్పత్తిలోని పెరుగుదలను ఆర్థిక వృద్ధిగా పరిగణిస్తాం. ప్రతిపౌరుడు కనీస అవసరాలు పొందగలిగిన స్థితిని సాంఘిక అభివృద్ధిగా భావించవచ్చు. ఆర్థికవృద్ధిని ఆట్చౌఛ్ఛీట ్ఛఛ్ఛిలో చూసినప్పుడు సాంఘికాభివృద్ధి ఆర్థికాభివృద్ధిలో మిళితమై ఉంటుంది. ఈ స్థితిని సమ్మిళిత వృద్ధిగా భావిస్తాం. మరోవైపు సాంఘి క అభివృద్ధి, సమ్మిళిత వృద్ధి రెండూ వేర్వేరు అని కొంతమంది ఆర్థికవేత్తల అభిప్రాయం. సాంఘిక అభివృద్ధి, ఆర్థిక వృద్ధి ఒకే రూపంలో ఉండాల్సిన అవసరం లేదు. ఆదాయస్థాయి, మానవాభివృద్ధిలో దేశాలు ఒకే స్థానాన్ని పొందలేకపోవడాన్ని బట్టి సాంఘిక, ఆర్థిక అభివృద్ధిని వేర్వేరుగా భావించవచ్చు. భారత్‌లో ఐదు దశల ఆర్థిక వృద్ధి 1. మొదటి దశలో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంపై ఆర్థిక వ్యవస్థ దృష్టి కేంద్రీకరిస్తుంది. మూలధన కల్పనరేటు పెంచడం ద్వారా వస్తు, సేవల ఉత్పత్తిని అధికం చేసినప్పుడు ఆర్థికవృద్ధిని గమనించవచ్చు. ఈ వృద్ధి ద్వారా ప్రజలు మెరుగైన జీవన ప్రమాణాలు పొందగలరు. ఆర్థికవృద్ధిని వేగవంతం చేయడం ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమవుతుంది. 2. రెండో దశలో ఆర్థికవృద్ధి, ఆర్థికాభివృద్ధి మధ్య తేడా, ఆదాయ పంపిణీలాంటి అంశాలు చర్చనీయాంశంగా ఉంటాయి. సమానంగా, స్వతంత్ర లక్ష్యంగా ఆర్థిక వృద్ధి ఫలాల పంపిణీ రూపొందుతుంది. అతిపెద్ధ ఆర్థిక వ్యవస్థల్లో ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి ముఖ్యాంశంగా ఉంటుంది. 3. మూడో దశలో సమానత్వం అనే అంశం ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఆహా రం, విద్య, శుభ్రమైన తాగునీరు, ఆరోగ్య సేవలు లాంటి కనీస అవసరాలు ప్రజలందరికీ లభ్యమవుతున్నాయా? లేదా అనే అంశంపై దృష్టి ఎక్కువగా ఉంటుంది. 4. నాలుగో దశలో సుస్థిర వృద్ధి సాధన ఆర్థిక వృద్ధిలో భాగంగా ఉంటుంది. పర్యావరణ క్షీణతను అరికట్టి ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా సుస్థిర వృద్ధి ప్రధానమైంది. 5. ఐదో దశలో మానవాభివృద్ధి ప్రధాన మైంది. ప్రజల జీవన నాణ్యత మెరుగుపర్చడానికి చర్యలు అవసరం. మెరుగైన ఆరోగ్య సేవలు అందించడంతోపాటు ప్రజలు తమ సామర్థ్యాన్ని వినియోగించుకునే విధంగా శిక్షణను ఇచ్చి తగిన ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. విద్య, ఆరోగ్య రంగాలపై ప్రభుత్వ వ్యయం భారత్‌లో విద్య, ఆరోగ్య రంగాలపై తలసరి ప్రభుత్వ వ్యయంలో తేడా వల్ల మానవాభివృద్ధిలో రాష్ట్రాల మధ్య అసమానతలు పెరిగాయి. తమిళనాడు, హర్యానా, గోవా, ఉత్తరాఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో విద్యపై తలసరి ప్రభుత్వ వ్యయం ఎక్కువ కాగా, జమ్మూ కాశ్మీర్లో అతి తక్కువ (రూ.11)గా నమోదైంది. బీహార్, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో వరుస క్రమంలో విద్యపై తలసరి ప్రభుత్వ వ్యయం తక్కువగా ఉంది. ప్రణాళికా సంఘం ప్రకారం... ఆరోగ్యంపై తలసరి ప్రభుత్వ వ్యయం గోవా (రూ. 861)లో ఎక్కువ కాగా, తర్వాత స్థానాల్లో హిమాచల్ ప్రదేశ్ (రూ.630), ఢిల్లీ (రూ. 560), జమ్మూ కాశ్మీర్ (రూ.512) రాష్ట్రాలు నిలిచాయి. తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్ (రూ. 128), మధ్యప్రదేశ్ (రూ. 146), చత్తీస్‌గఢ్ (రూ. 146), అసోం (రూ. 162) రాష్ట్రాలు ఉన్నాయి. బీహార్‌లో తక్కువ (రూ. 93)గా తలసరి ప్రభుత్వ వ్యయం నమోదైంది. స్వాతంత్య్రానంతరం భారత్‌లో విద్య, ఆరోగ్య సౌకర్యాలు మెరుగుపడిన కారణంగా అక్షరాస్యత, ప్రజల ఆయుర్దాయంలో పెరుగుదల ఏర్పడింది. కానీ బంగ్లాదేశ్, బ్రెజిల్, మెక్సికోలాంటి దేశాలతో పోల్చినప్పుడు ప్రాథమిక విద్యలో డ్రాప్ అవుట్ల సంఖ్య, ఐదేళ్ల వయసులోపు వారితో పాటు శిశు, ప్రసూతి మరణాలు లాంటి సూచికల్లో భారత్ స్థితి ఆశాజనకంగా లేదు. అదేవిధంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మెరుగైన పారిశుధ్యం లభించే ప్రజల శాతం, 5 నుంచి 69 నెలల్లోపు రక్త హీనతతో బాధపడే పిల్లల సంఖ్య లాంటి సూచికల విషయంలోనూ భారత్ ఇలాంటి స్థితినే ఎదుర్కొంటోంది. వృద్ధి, మానవాభివృద్ధి మధ్య సంబంధం ప్రాథమిక స్థాయిలో ఆర్థికవృద్ధి, సాంఘిక అభివృద్ధి లేదా మానవాభివృద్ధి మధ్య ఏ విధమైన వివాదమూ లేదు. మానవుని భౌతిక శ్రేయస్సు పెంపులో విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం భాగంగా ఉంటాయి. సాంఘికాభివృద్ధి సాధనకు రెండు మార్గాలను ఎంచుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి సాధించిన క్రమంలో కలిగే లబ్ధ్ది అన్ని వర్గాల ప్రజలకు చేకూరడం ఒక మార్గం. ఈ వ్యూహాన్ని ట్రికిల్‌డౌన్ వ్యూహంగా వర్గీకరించవచ్చు. ట్రికిల్‌డౌన్ వ్యూహం అమలు కావాలంటే ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన వృద్ధిని సాధించాలి. స్వాతంత్య్రానంతరం మొదటి మూడు దశాబ్దాల్లో సాధించిన వృద్ధి ఫలాలు సమాజంలో అన్ని వర్గాలకు చేరలేదు. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ అభివృద్ధి వ్యూహంగా సాంఘిక అవస్థాపనలపై దృష్టి కేంద్రీకరించాలి. విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం, శుభ్రమైన తాగునీరు లాంటి సౌకర్యాలు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు లభ్యమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. భారత్‌తోపాటు ఇతర ఏ దేశం కూడా ఇలాంటి ప్రత్యేక దృక్పథాన్ని అవలంబించలేదు. ఆయా దేశాల్లో వివిధ కాలాల్లో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అమలు చేయడంతోపాటు ప్రాథమిక విద్య, ఆరోగ్యం లాంటి మౌలిక సౌకర్యాలపై దృష్టి కేంద్రీకరించాయి. మెరుగైన విద్య, ఆరోగ్య సౌకర్యాలు ఆర్థిక వృద్ధిని పెంపొందించగలవని కచ్చితంగా భావించలేం. జాతీయాదాయ వృద్ధిని వేగవంతం చేయడానికి ఈ సౌకర్యాలు ఉపకరిస్తాయి. మరోవైపు ఆర్థికవృద్ధి వేగవంతం కానిదే దీర్ఘ కాలంలో మానవాభివృద్ధిపై వివిధ దేశాలు పెట్టుబడిని నిరంతరం కొనసాగించలేవు. అనేక ప్రాంతాలు, దేశాల్లో మానవాభివృద్ధి సూచికల విషయంలో ఏర్పడిన ప్రగతి ఆర్థికాభివృద్ధికి దారితీయలేదని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మానవాభివృద్ధి సూచికలు, ఆర్థికాభివృద్ధి అంశాలను రెండుగా విభజించి తేడాను గమనించినప్పుడు ఆర్థిక వ్యవస్థలో సాంఘిక అలజడులు (Social Unrest) పెరుగుతాయి. ఉదాహరణకు విద్యారంగంలో ప్రగతి కారణంగా చదువుకున్న యువతకు ఉత్పాదకత తోకూడిన ఉపాధిని కల్పించగలగాలి. ఆర్థికవృద్ధి, సాంఘిక అభివృద్ధి ఒకేదశలో పయనించగలిగినప్పుడు రెండూ ప్రయోజనాన్ని పొందగలుగుతాయి. సమానత్వం, వృద్ధి రెండూ సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. అనేక దేశాల్లో ఆర్థిక వృద్ధి కారణంగా పేదరికంలో తగ్గుదల సంభవించినట్లు అనుభవ పూర్వక ఆధారా లున్నాయి. అందరికీ సమాన అవకాశాలు కల్పించగలిగినప్పుడే వృద్ధిరేటు పెరుగుతుంది. నిర్లక్ష్యానికి గురైన వివిధ వర్గాల ప్రజల అభ్యున్నతికి అవసరమైన కార్యక్రమాలు అవసరం. అయితే స్వల్ప కాలంలో ఆశించిన ప్రయోజనం కనిపించనప్పటికీ దీర్ఘకాలంలో సామర్థ్య పెంపు ద్వారా ఆర్థిక వృద్ధి సిద్ధిస్తుంది. పేద ప్రజలు తమ అవకాశాలను మెరుగుపర్చుకునే విధంగా ్కటౌఞౌౌట విధానాలు అవసరం. ఆయా విధానాలు పేద ప్రజల సామర్థ్యం పెంపునకు దారితీస్తాయి. Pro-poor విధానాల్లో భాగంగా ఆదాయ బదిలీలే కాకుండా పేద ప్రజలు ఆధారపడిన అనేక రంగాలపై పెట్టుబడి పెరిగే విధంగా చర్యలు అవసరం. గ్రామీణాభివృద్ధిలో భాగంగా వ్యవసాయ రంగ వృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విద్య, ఆరోగ్యం, ఇతర సాంఘిక సేవలు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలి. మానవాభివృద్ధి నివేదిక 1991 మానవ వ్యయ నిష్పత్తి (Human Expenditure)ని ప్రవేశపెట్టింది. ప్రాథమిక విద్య, పౌష్టికాహారం, వాటర్ సప్లయ్, పారిశుధ్యం లాంటి వాటిపై జాతీయాదాయంలో ఎంతశాతాన్ని వ్యయం చేశారో తెలుసుకోవడానికి ఈ నిష్పత్తి ఉపకరిస్తుంది. మానవాభివృద్ధిలో సంతృప్తికరమైన ఫలితాలు సాధించాలంటే మానవ వ్యయ నిష్పత్తి 5 శాతంగా ఉండాలని ఈ నివేదిక వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు సాంఘిక అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సమ్మిళిత వృద్ధి వ్యూహం -సమస్యలు అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాల్లో సమ్మిళిత వృద్ధి వ్యూహం సాధనలో భాగంగా కింద పేర్కొన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. 1. పేదరికం: ప్రపంచబ్యాంక్ ప్రకారం భారత్‌లో 456 మిలియన్ల ప్రజలు దారిద్య్రరేఖ దిగువన నివసిస్తున్నారు. మొత్తం దేశ జనాభాలో వీరి వాటా 42శాతం. 2. ఉపాధి: భారత్‌లో మొత్తం ఉపాధిలో అసంఘటిత రంగం వాటా 85 శాతం. 3. వ్యవసాయ రంగం: ప్రకృతి వైపరీత్యాలు, తక్కువ వర్షపాతం, భూ కేటాయింపుల్లో ఎదురవుతున్న సమస్యలు 4. సాంఘికాభివృద్ధి: విద్య, ఆరోగ్య ప్రమాణాలు సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో లేకపోవడం, మానవాభివృద్ధి సూచీలో ఉన్న మొత్తం 187 దేశాల్లో భారత్ 135వ స్థానాన్ని పొందడం. 5. ప్రాంతీయ అసమానతలు: తలసరి ఆదాయంలో రాష్ట్రాల మధ్య అసమానతలు ఎక్కువ. బాలికల్లో శిశు మరణాల రేటు కేరళలో తక్కువగా ఉంటే, మధ్యప్రదేశ్‌లో అధికంగా ఉంది. కేరళలో మహిళా అక్షరాస్యతా రేటు ఎక్కువ కాగా, బీహార్‌లో తక్కువ. పేద రాష్ట్రాలతో పోల్చినప్పుడు ధనిక రాష్ట్రాల్లో వృద్ధిరేటు అధికంగా ఉంటోంది. 11వ ప్రణాళిక - సమ్మిళిత వృద్ధికి చర్యలు 1. ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ప్రత్యేక ఆర్థిక ప్రాంతాలకు ప్రోత్సాహం 2. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధునికీకరించడం 3. రాష్ర్ట ప్రభుత్వాలు పారిశ్రామిక స్నేహపూర్వక వాతావరణం కల్పించేదిశగా చర్యలు తీసుకోవడం 4. తయారీ రంగంలో ఉపాధిని పెంచేలా శ్రమసాంద్రత పరిజ్ఞానాన్ని వినియోగించడం 5. పన్నులు, డ్యూటీలకు సంబంధించి ప్రోత్సాహకాలు 6. ప్రతేక, చిన్నతరహా సంస్థల అభివృద్ధికి తోడ్పాటును అందించడం 7. మైనింగ్ విధానాన్ని సమీక్షించడం ద్వారా మైనింగ్ కార్యకలాపాల్లో పెట్టుబడి పెంచే విధంగా అవరోధాలను తొలగించడం 8. విద్యారంగంలో ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం ముఖ్యమైన ప్రశ్నలు 1. ఆర్థికవృద్ధి సరిపోయినంతగా లేకుండా సాంఘిక ప్రగతి సాధ్యమవుతుందని మీరు భావిస్తున్నారా? చర్చించండి? 2. సాంఘికాభివృద్ధి, సమ్మిళిత వృద్ధి మధ్య (ynergies) తేడాను వివరించండి? 3. సాంఘిక రంగాలపై వ్యయం సాంఘిక ప్రగతికి దారితీస్తుందని మీరు భావిస్తున్నారా? 4. సాంఘిక రంగాలపై వ్యయం ద్వారా మంచి ప్రతిఫలం పొందడానికి అవసరమైన సంస్థాపరమైన (Organisati-onal), ప్రోత్సహించే (Motivational) కారకాలను పేర్కొనండి? 5. సాంఘిక అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి ప్రభుత్వం, ప్రైవేట్ రంగ పాత్ర వివరించండి? మాదిరి ప్రశ్నలు 1. మానవ వ్యయ నిష్పత్తి (Human Expd, Index)ని ఏ నివేదిక ప్రవేశపెట్టింది? 1) మానవాభివృద్ధి నివేదిక 1991 2) మానవాభివృద్ధి నివేదిక 1992 3) మానవాభివృద్ధి నివేదిక 1994 4) మానవాభివృద్ధి నివేదిక 1996 2. మానవాభివృద్ధి నివేదిక 2014 ప్రకారం మానవాభివృద్ధిలో భారత్ స్థానం? 1)133 2) 122 3)136 4) 135 3. విద్యారంగంలో తలసరి ప్రభుత్వ వ్యయం తక్కువగా ఉన్న రాష్ర్టం? 1) జమ్మూ కాశ్మీర్ 2) మధ్యప్రదేశ్ 3) రాజస్థాన్ 4) కేరళ 4. అత్యంత ఎక్కువ మానవాభివృద్ధి చెంది నవిగా 2014 మానవాభివృద్ధి నివేదిక ఎన్ని దేశాలను పేర్కొంది? 1) 49 2) 50 3) 48 4) 54 5. మానవాభివృద్ధి సంతృప్తికరమైన ఫలితాలు సాధించాలంటే మానవ వ్యయ నిష్పత్తి ఎంతగా ఉండాలని మానవాభివృద్ధి నివేదిక అభిప్రాయపడింది? 1) 10 శాతం 2) 9 శాతం 3) 3 శాతం 4) 5 శాతం 6. 2014 మానవాభివృద్ధి నివేదిక ప్రకారం మానవాభివృద్ధి సూచీలో మొదటిస్థానం పొందిన దేశం? 1) నార్వే 2) అమెరికా 3) స్వీడన్ 4) నైజర్ 7. 2014 ఏఈఖ ప్రకారం మానవాభివృద్ధి సూచీలో 187వ స్థానం పొందిన దేశం? 1) స్వీడన్ 2) నైజర్ 3) అమెరికా 4) బ్రెజిల్ 8. ఆరోగ్యంపై తలసరి ప్రభుత్వ వ్యయం ఏ రాష్ర్టంలో తక్కువ? 1) రాజస్థాన్ 2) జమ్మూ కాశీర్ 3) మధ్యప్రదేశ్ 4)గోవా సమాధానాలు 1) 1; 2) 4; 3) 1; 4) 1; 5) 4; 6) 1; 7) 2; 8) 4.