
పాతపట్నం: ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాతపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి రెడ్డి శాంతి పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో శనివారం పాదయాత్ర చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి సిక్కోలు రాజకీయ పరిస్థితులను వివరించారు.