చంద్రబాబువి అడ్డగోలు హామీలు | chandra babu cross guarantees | Sakshi
Sakshi News home page

చంద్రబాబువి అడ్డగోలు హామీలు

Published Mon, Mar 31 2014 2:17 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM

చంద్రబాబువి అడ్డగోలు హామీలు - Sakshi

చంద్రబాబువి అడ్డగోలు హామీలు

శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: అధికారంలో ఉన్న రోజుల్లో ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేసిన టీడీపీ నాయకుడు చంద్రబాబు మరోసారి అధికారం కోసం అడ్డగోలు హామీలు గుప్పిస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం లోక్‌సభ, శాసనసభ సమన్వయకర్తలు రెడ్డి శాంతి, ధర్మాన ప్రసాధరావులు ధ్వజమెత్తారు.
 
శ్రీకాకుళంలోని 14వ వార్డు పరిధి చిత్తరంజన్‌వీధి, పెట్రోమాక్స్‌వీధి, బలిజేపల్లివారివీధి, అనంతపల్లివారివీధి, గాజులవీధి, చేపలవీధి, చిన్నబజారు తదితర ప్రాంతాల్లో ఆదివారం ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు.  వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజలకు వివరించి ఫ్యాన్ గుర్తుపైనే ఓటువేసి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయాలని విజ్ఞప్తి చేశారు.
 
ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ప్రజలు నమ్మకంతో ఎన్టీఆర్‌కు అధికారం అప్పగిస్తే చంద్రబాబు వెన్నుపోటు పొడిచి ఆ అధికారాన్ని లాక్కున్నారని ఆరోపించారు. ప్రజలపై వివిధ రకాల పన్నుల భారం మోపి ఇబ్బందులకు గురిచేశారన్నారు. రైతాంగాన్ని పూర్తిగా విస్మరించి వారు కష్టాలపాలయ్యేలా చేశారన్నారు. తొమ్మిదేళ్లపాటు ప్రజలంతా నరకయాతన అనుభవించేలా పాలన చేశారన్నారు. ఇపుడు అధికార దాహంతో  సాధ్యంకాని హామీలను చెబుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు మరోసారి ప్రయత్నిస్తున్నారన్నారు.
 
బాబు మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. రెడ్డి శాంతి మాట్లాడుతూ వైఎస్ అధికారం చేపట్టిన వెంటనే రైతుల కోసం ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేసి వారి కళ్లలో ఆనందం చూశారన్నారు. ప్రజల అభివృద్ధే ధ్యేయంగా అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టి ప్రజలకు స్వర్ణయుగంలాంటి పాలన అందించారన్నారు.
 
ప్రచార కార్యక్రమంలో పార్టీ నేతలు ఎం.వి.పద్మావతి,అంధవరపువరహా నరసింహం,  చల్లా అలివేలు మంగ, అంధవరపు సూరిబాబు, కోణార్క్ శ్రీను, మండవిల్లి రవి,  జె.ఎం.శ్రీనివాస్, అబ్దుల్ రెహమాన్, టి.కామేశ్వరి,  కె.ఎల్. ప్రసాద్, శిమ్మ వెంకట్రావు,  పైడి నిర్మల్‌కుమార్, శిమ్మ రాజశేఖర్, గుడ్ల మల్లేశ్వరరావు, సీపాన భాస్కరరావు, గుంట జ్యోతి,  చల్లా మంజుల, టి.మోహిని, డి.విజయలక్ష్మి, మహమ్మద్ సిరాజుద్దీన్, రావాడ జోగినాయుడు, ట్రేడ్‌యూనియన్ భాస్కరరావు,  కూన వాసుదేవరావు,  స్థానికులు రుంకాన డాక్టర్, జామి దాము, రెడ్డి జగన్నాథం  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement