Darmana Prasadarao
-
అభివృద్ధా? అబద్ధాలా?
సాక్షి, శ్రీకాకుళం: అభివృద్ధి ఎలా చేస్తామో విస్పష్టంగా చెప్పే నిబద్ధత కలిగిన నాయకులు కావాలో... లేదంటే నిత్యం అబద్ధాలతో, మోసాలతో కప్పిపుచ్చిన టీడీపీ ప్రభుత్వం కావాలో పౌరులే ఆలోచించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు అభిప్రాయం! ఐదేళ్ల పాలనలో జిల్లాకు ఏమీ చేయలేక చేతులెత్తేసిన టీడీపీ ప్రజాప్రతినిధులకు ఇప్పుడు మరోసారి పౌరుల వద్దకు వెళ్లి ఓటు అడిగే హక్కు లేదంటారు ఆయన! ఈ ఎన్నికలలో తనకు ప్రజలు అవకాశం ఇస్తే శ్రీకాకుళంలో మళ్లీ అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు! సోమవారం ‘సాక్షి ప్రతినిధి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు ఆయన మాటల్లోనే... ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కూడా శ్రీకాకుళం జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పేర్కొన్నారు. రానున్న కాలంలో వచ్చే ప్రభుత్వాలు ఎక్కువగా నిధులు ఇవ్వాలని, అభివృద్ధికి సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని దాని ఉద్దేశం. తాజా గణాంకాల ప్రకారం అత్యంత తక్కువ తక్కువ తలసరి ఆదాయం కలిగిన జిల్లా కూడా శ్రీకాకుళమే. జీడీపీలో భాగస్వామ్యం తక్కువే. శ్రీకృష్ణ కమిషన్ కూడా అదే చెప్పింది. రాజధాని ఎక్కడ ఉండాలని నిర్ణయించేందుకు శివరామకృష్ణన్ కమిటీ చేసిన అధ్యయనంలో అదే తేలింది. శ్రీకాకుళం వెనుకబడిన జిల్లా అనడానికి ఇన్ని రుజువులున్నా ఈ ప్రాంతం అభివృద్ధికి ముఖ్య మంత్రిగా చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి ఏమీ లేవు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 12 జాతీయ స్థాయి సంస్థలు, అదనంగా మరో 14 సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఈ ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చింది. 13 జిల్లాలున్న ఈ రాష్ట్రంలో వాటా ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు కనీసం రెండు సంస్థలు రావాల్సి ఉంది. రెండు కాదు ఒకటి కాదు వచ్చింది జీరో! ఏ ఒక్క సంస్థనూ ఈ జిల్లాలో ఏర్పాటు చేయలేదు. ఇది చంద్రబాబు సర్కారు పక్షపాత వైఖరి, నిర్లక్ష్యం మాత్రమే కాదు స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధుల ఘోర వైఫల్యం కూడా. చంద్రబాబుకు ఓటు అడిగే హక్కులేదు... ఎన్నికల ప్రచారం కోసం చంద్రబాబు ఈ జిల్లాకు వచ్చినప్పుడల్లా తనకే ఓటు అడిగే హక్కు ఉందని చెబుతున్నారు. రాష్ట్రానికి రూ.2.25 కోట్ల లక్షల అప్పు చేసిన టీడీపీ ప్రభుత్వం ఈ జిల్లాలో ఆస్తుల నిర్మాణానికి పెట్టుబడి పెట్టనేలేదు. ఈ ఐదేళ్లూ జిల్లా ప్రజలు చెల్లించిన పన్నుల్లో వాటా కానీ, కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చిన నిధుల్లో వాటా కానీ అడగట్లేదు నేను. రాష్ట్రం చేసిన అప్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు న్యాయంగా దక్కాల్సిన వాటా కూడా దక్కలేదనే ఆవేదన ఉంది. రాష్ట్ర విభజన సమయంలో ఒకసారి, టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరోసారి జిల్లాకు తీవ్ర నష్టం జరిగిన విషయాన్ని జిల్లా పౌరులు గమనించాలి. దాదాపు 70 ఏళ్ల పాటు వివిధ జాతీయ స్థాయి సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుతో, ప్రజల పెట్టుబడులతో అభివృద్ధి చేసిన హైదరాబాద్‌ను విభజనతో తెలంగాణకు వదిలేయాల్సి వచ్చింది. ఆ నష్ట నివారణలో భాగంగా కేంద్రం మంజూరుచేసిన జాతీయ స్థాయి సంస్థల్లో ఏ ఒక్కటీ జిల్లాలో ఏర్పాటు చేయలేదు. అవన్నీ ఒక్కసారి మాత్రమే వస్తాయి. చంద్రబాబు సర్కారు వల్ల జిల్లాకు పూడ్చలేనంత నష్టం వాటిల్లింది. వాటిలో ఏ ఒక్కటైనా ఇక్కడ ఏర్పాటు చేసేలా అతనికి నచ్చజెప్పలేని అసమర్థులుగా ఇక్కడి ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులు మిగిలిపోయారు. అందుకే చంద్రబాబుకు కానీ, టీడీపీ నాయకులకు కానీ జిల్లా ప్రజలను ఓటు అడిగే హక్కులేదు. ఏ గట్టున ఉంటారో ఆలోచించాలి జిల్లాకు నిధుల్లో న్యాయమైన వాటా ఇవ్వకుండా ఐదేళ్లూ అన్యాయం చేసిన మోసకారి టీడీపీ ప్రభుత్వం, నాయకత్వం ఒకవైపున, మరోవైపు జిల్లా అభివృద్ధికి అనేక విధాలుగా చర్యలు తీసుకున్న వైఎస్సార్ కుమారుడిగా ఆ పంథానే తాను కూడా కొనసాగిస్తానని చెబుతున్న జగన్మోహన్రెడ్డి ఉన్నారు. ఏ గట్టున ఉండాలో జిల్లా పౌరులు ఆలోచించాలి. యువతకు ఉపాధి అవకాశాలొస్తాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా’ అనే వాదనకు కట్టుబడి ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ద్వారానే దేశంలోని మిగతా ప్రాంతాల నుంచి పెట్టుబడులు వస్తాయి. ఇలా శ్రీకాకుళం జిల్లాకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది కూడా. పరిశ్రమలు వస్తాయి. వాటిలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతా యి. అందుకే రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పిం చడానికి ముందుకొచ్చే జాతీయ పార్టీ ఏదైనా సరే కేంద్రంలో వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తుందని మా పార్టీ అధ్యక్షుడు జగన్ విస్పష్టంగా చెప్పారు. వైఎస్సార్ హయాంలో పెద్దపీట వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చెం దిన జిల్లాల సరసన నిలపడానికి ముఖ్యమంత్రిగా దివంగత నేత వైఎస్సార్ పెద్దపీట వేసేవారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లోనున్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వంశధార రెండో దశ, తోటపల్లి, మహేంద్రతనయ నదిపై ఆఫ్‌షోర్ ప్రాజెక్టు, మడ్డువలస విస్తరణ తదితర పనులన్నీ మంజూరు చేశారు. శ్రీకాకుళంలో మెడికల్ కాలేజీ (రిమ్స్), యూనివర్సిటీ వంటి విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. మంత్రిగా నాకు అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ శ్రీకాకుళం జిల్లాకు నిధుల్లో మెరుగైన వాటా తీసుకురావడానికి కృషి చేశాను. అనేక రోడ్లు విస్తరణ పనులు పూర్తి చేయించాను. శ్రీకాకుళం నగరానికి రెండు భారీ వంతెనలతో పాటు జిల్లాలో తొమ్మిది బ్రిడ్జిలు, ఆర్వోబీలు అందుబాటులోకి తెచ్చాను. శ్రీ కాకుళంలో కలెక్టరేట్ కొత్త భవన సముదాయం నిర్మాణానికి మంజూరు చేయించాను. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో ఆ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఏసీ ఆడిటోరియం, టీటీడీ కల్యాణ మండపం నా హయాంలో మంజూరు చేయించినా టీడీపీ ప్రభుత్వం పక్కనబెట్టింది. రింగ్‌రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అని చంద్రబాబు జిల్లాకు వచ్చినప్పుడల్లా హామీలిస్తూనే వచ్చారు తప్ప ఆచరణలోకి తేలేదు. ఆయన మూడేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన కేఆర్ స్టేడియం నిర్మాణం ఇంకా పునాది దశలోనే ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వంశధార పూర్తి... అనేక సంక్షేమ పథకాలకు, సాగునీటి ప్రాజెక్టులకు నాంది పలికి రైతు బాంధవుడైన డాక్టరు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వంశధార ప్రాజెక్టు పూర్తిగా ప్రథమ ప్రాధాన్యం ఇస్తాం. తద్వారా మండువేసవి మే 15వ తేదీన చూసినా జిల్లాలోని గ్రామాల్లో చల్లని వంశధార నీరు గలగలా పారే అవకాశం ఉంటుంది. ఆ సుందర దృశ్యం చూడాలనేదే నా జీవిత ఆశయం, లక్ష్యం కూడా. అందుకే ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా శ్రీకాకుళంలో బహిరంగ సభ జరిగినప్పుడు జగన్మోహన్రెడ్డి కూడా అదే హామీ ఇచ్చారు. మత్స్యకారులకు తీరని అన్యాయం జిల్లాలో మత్స్యకారులకు టీడీపీ ప్రభుత్వంతో తీరని అన్యాయం జరిగింది. వారిలో చాలామంది ఆర్నెల్ల కాలానికి ఇక్కడి నుంచి గుజరాత్, కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాలకు వలస వెళ్లిపోతుంటారు. తమ కుటుంబాలకు దూరంగా, చావుబతుకుల మధ్య తమ వృత్తిని కొనసాగిస్తున్నవారు కొన్ని వేల మంది ఉన్నారు. కనీసం వారి కోసం జిల్లా తీరంలో ఫిషింగ్ జెట్టీలు, కోల్డ్ స్టోరేజీలు నిర్మించాలి. రాయితీలపై బోట్లు, వలలు ఇచ్చి సంప్రదాయ మత్స్యకారులను ప్రోత్సహించాలి. కానీ టీడీపీ ప్రభుత్వం అలాంటి సంక్షేమ చర్యలను విస్మరించింది. మత్స్యకారులకు మేలు చేయడానికి వైఎస్సార్సీపీ సంకల్పించింది. జిల్లా అభివృద్ధికి ఓ విజన్ ఉంది... శ్రీకాకుళం జిల్లాను ఎప్పటికైనా రాష్ట్రంలో అభివృద్ధి చెందిన జిల్లాల సరసన నిలపకపోతే అన్నివిధాలా నష్టపోయే, ఇతరుల దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉంది. ఈ జిల్లా అభివృద్ధికి ఏం చేయాలో, అందుకు ప్రభుత్వాలకు, సంస్థలకు ఏం చెప్పాలో నాకో విజన్ ఉంది. జిల్లాలో ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో శాంతిపూర్వక చర్చల ద్వారా సమస్యను పరిస్కరించుకొని నేరడి బ్యారేజీ నిర్మాణానికి, తద్వారా వంశధార రెండో దశ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవకాశం ఉంది. రిజర్వాయర్, వంశధార కుడి, ఎడమ కాలువల లైనింగ్ పూర్తి చేస్తే జిల్లాలో రెండో పంటకే కాదు 2.55 లక్షల ఎకరాల్లో వాణిజ్య పంటలకు అవసరమైన సాగునీరు అందుతుంది. తద్వారా జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు ఇప్పుడున్న దానికన్నా నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉంది. -
లాక్కున్న భూములు ‘ప్రైవేటు’కా?: ధర్మాన
సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణం పేరుతో రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేయాలని టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రజలను వంచించడమేనని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల తో మాట్లాడారు. రాజధాని భూములను ప్రైవేటు కంపెనీలకు దోచి పెట్టేందుకే జీవో నెంబర్ 110ని మున్సిపల్ శాఖ జారీ చేసిందని అన్నారు. ప్రైవేటు కంపెనీలకు 99 ఏళ్ల లీజుకు ఇచ్చే సదుపాయం ఈ జీవోలో కల్పించడం దారుణమన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండే టీడీపీ ప్రభుత్వం ఏకంగా 99 ఏళ్ల పాటు భూములను లీజుకివ్వడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ జీవోను గోప్యంగా ఎందుకు జారీ చేసిందని ఆయన ప్రశ్నించారు. ఈ విషయమై ఏ ఒక్క రాజకీయ పార్టీతోనూ సంప్రదించక పోవడం అప్రజాస్వామికమన్నారు. ఏపీ జెన్కోలో భారీ బొగ్గు కుంభకోణం జరుగబోతోందని దీనిని త్వరలో తాము బయట పెడతామని ధర్మాన హెచ్చరించారు. కాగా కన్నెధార కొండల్లో గ్రానైట్ మైనింగ్ లీజు వ్యవహారంలో తనపై టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగుతోందని ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షానికి అధికార ప్రతినిధిగా ఉన్న తనపై ఇలాంటి దుష్ర్పచారానికి పూనుకుని అణచి వేయాలని చూస్తోందన్నారు. -
కేడర్‌లో ఉత్సాహం
♦ చిరుజల్లులుకురుస్తున్నా.. కదలని జనం ♦ ఎన్నికష్టాలెదురైనా వైఎస్సార్సీపీ వెంటే ఉంటామని ప్రతిన ♦ గిరిజనులకు పార్టీ అండగా ఉంటుందని నేతల ఉద్ఘాటన ♦ తొలి అవగాహన సదస్సు విజయవంతం సాక్షి, విశాఖపట్నం : సంస్థాగతంగా వైఎస్సార్సీపీ బలోపేతానికి పాడేరులో సోమవారం నిర్వహించి తొలి నియోజకవర్గ స్థాయి సదస్సు గిరిజన శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, విజయసాయిరెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ ఎమ్మెల్యేలు పాడేరు అసెంబ్లీ సెగ్మెంటులోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ముఖ్యకార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపారు. తమ గుండెల్లో కొలువైన వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టే వరకు నిద్రపోమని కార్యకర్తలు ప్రతినబూనారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా తామంతా వైఎస్సార్ కాంగ్రెస్ వెంటే నడుస్తామని తేల్చి చెప్పారు. మరొక పక్క పార్టీ అగ్రనేతలు కూడా అదే రీతిలో స్పందిస్తూ గిరిజన హక్కులపరిరక్షణ కోసం పార్టీ అండగా నిలుస్తుందనిచెప్పడంతో వారిలో కొండంత భరోసా ఏర్పడింది.ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో టీడీపీ సర్కార్ వైఫల్యంపై పోరుబాట పట్టేందుకు కార్యకర్తలకు అవగాహన కల్పించడంతో పాటు పార్టీని బూత్ స్థాయి వరకు బలోపేతానికి రాష్ర్ట వ్యాప్తంగా తలపెట్టిన నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల తొలి అవగాహన సదస్సుకు ఏజెన్సీలోని పాడేరు వేదికైంది. ఈ సమావేశానికి పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయ సాయి రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జి, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకష్ణరంగారావులతో పాటు ఉత్తరాంధ్ర పరిధిలోని ఎస్టీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పలువురు పార్టీ ముఖ్యనేతలు తరలి రావడంతో వారి మాటలు వినేందుకు గిరిజనం తండోపతండాలుగా తరలి వచ్చింది. పాడేరులో ఎటు చూసినా జనమే. సభావేదికైన పాత సినిమా హాలు ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది.తొలుత అగ్రనేతలు పాడేరు ముఖధ్వారంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా తరలి వచ్చారు.పార్టీ కార్యకర్తలు, గిరిజనులు కురిపించిన పూల వర్షంలోవారు తడిసి ముద్దయ్యారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర భారీ బైకు ర్యాలీతో నేతలకు ఘన స్వాగతం పలికారు. ఉదయం పది గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ సమావేశం మధ్యాహ్నం 12గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ఏకబిగిన సాగినప్పటికీ సభాప్రాంగణంలో ఏ ఒక్కరూ కదలకుండా నాయకుల ప్రసంగాలను ఎంతో శ్రద్ధతో విన్నారు. వైఎస్సార్..వైఎస్ జగన్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబు నాయుడ్ని విమర్శించినప్పుడల్లా అదే రీతిలో స్పందించారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఎన్నికైన తర్వాత తొలి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం కావడంతో ఆమె కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేశారు. ఒక్క పాడేరే కాదు..పాడేరుకు దారి తీసే రహదారులన్నీ నాయకుల ఫ్లెక్సీ, వైఎస్సార్సీపీ తోరణాలతో నిండిపోయాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడిన తీరును సభలో పాల్గొన్న అగ్రనేతలంతా ప్రస్తావిస్తూ ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. అరకు పార్లమెంటరీనియోజకవర్గంలోని ఏడు అసెంబీ సెగ్మెంట్లలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను 25వేల నుంచి 35వేలపైచిలుకు మెజార్టీతో గెలిపించిన మీకు పార్టీ రుణపడి ఉంటుంద న్నారు. గిరిజనులకు పార్టీ వెన్నుదన్నుగా నిలుస్తుందని..వారి హక్కుల పరిరక్షణ కోసం పార్టీ రాష్ర్ట నాయకత్వమంతా రోడ్డెక్కి పోరుబాటపడుతుందని.. అవసరమైతే కేంద్రంపై కూడా ఒత్తిడి తీసుకొస్తామని చెప్పడంతో గిరిజనుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. గిరిజనుల మనోభిష్టానికి వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలు సాగిస్తే ఊరుకో బోమని హామీ ఇచ్చింది. గడిచిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ఘన విజయం చేకూర్చిన గిరిజనం భవిష్యత్‌లో కూడా పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తామని స్థానిక నాయ కులంతా తేల్చిచెప్పారు. జగన న్నను సీఎం చేసుకునేంత వరకు ఏ ఒక్కరూ విశ్రమించవద్దని పార్టీ నేతలు పిలుపు నివ్వగానే..తప్పకుండా 2019లో జగన్మోహన్రెడ్డిని సీఎం చేసే వరకు ఇదే స్ఫూర్తిగా పనిచేస్తామని గిరిజన నేతలు హామీ ఇచ్చారు. మరొక పక్క అప్పటి వరకు ఉక్కపోతగా ఎండ ఠారెత్తించినప్పటికీ సభ ప్రారంభమైన కొద్దిసేపటికే ఆకాశమంతా మేఘావ్రతం కాగా..చిరుజల్లులతో సభాప్రాంగణం తడిసిముద్దయింది. మొత్మమ్మీద వైఎస్సార్ సీపీ తొలి విస్తత స్థాయి సమావేశం విజయవంతం కావడంతో జిల్లాలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం ఉరకలెత్తింది. ఇదే రీతిలో మిగిలిన నియోజక వర్గాల్లో కూడా ఈసదస్సులు నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. మీ ఎమ్మెల్యేకు నేను అభిమానిని గిడ్డి ఈశ్వరికి ఉమ్మారెడ్డి ప్రశంస పాడేరు: మీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి నేను అభిమానినని వైఎస్సార్సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సదస్సులో పేర్కొన్నారు. అసెంబ్లీలో ఈశ్వరి గిరిజన సమస్యలపై స్పందిస్తున్న తీరు, గిరిజన వాణిని వినిపిస్తున్న విధానం తనను అమితంగా ఆకట్టుకున్నాయన్నారు. పాలకులు విలాసవంతమైన భవనాల్లో మినరల్ వాటర్ తాగుతుంటే మా మన్యంలో గిరిజనులు గుక్కెడు నీటికోసం కొండ కోనల్లో కాలినడకన యాతన పడుతున్నారని ఆమె అసెంబ్లీలో అడిగిన తీరు ప్రశంసనీయమని కొనియాడారు. మంచి నాయకురాలిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు విజయసాయి రెడ్డి, ధర్మాన ప్రసాదరావులు కూడా సదస్సులో ఎమ్మెల్యే ఈశ్వరిని ప్రశంసలతో ముంచెత్తారు. పార్టీ తరపున దీటైన నాయకురాలిగా ఆమె ప్రజలకు అండగా నిలిచి ప్రజా సంక్షేమానికి పాటుపడాలని వారు ఆకాంక్షించారు. -
వైఎస్సార్ సీపీలో టీడీపీ, కాంగ్రెస్ నాయకుల చేరిక
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లాకు చెందిన పలువురు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరారు. జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నివాసానికి వచ్చినప్పుడు ఆయన్ని పలువురు నాయకులు కలిసి పార్టీలో చేరనున్నట్లు తమ అభిప్రాయాన్ని తెలిపారు. వీరందరికీ జగన్మోహన్రెడ్డి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో పాతపట్నం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కొవగాపు సుధాకర్, టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర సభ్యుడు సిర్ల రామారావు, మాజీ కౌన్సిలర్లు పేర్ల ప్రకాష్, బరాటం కూర్మారావు, పిల్లల నీలాంద్రితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లు రెడ్డి మోహనరావు, ఎంఏ రఫీ, గన్ని రాజు, కెల్ల కొండలరావు, టెలికాం ఎడ్వయిజరీ కమిటీ సభ్యుడు డబ్బీరు వాసుదేవరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కిల్లాన భోజ్‌కుమార్, పైడి మురళీ, పి. సాయి, దూసి నాగేశ్వరరావు, బి.జ్యోతి, సౌజన్య, రాధారాణి, శిమ్మ రాజశేఖర్‌లు ఉన్నారు. వీరితో పాటు శ్రీకాకుళం రూరల్ మండలం, గార మండలాలకు చెందిన పలువురు దేశం, కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. -
చంద్రబాబువి అడ్డగోలు హామీలు
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: అధికారంలో ఉన్న రోజుల్లో ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేసిన టీడీపీ నాయకుడు చంద్రబాబు మరోసారి అధికారం కోసం అడ్డగోలు హామీలు గుప్పిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం లోక్‌సభ, శాసనసభ సమన్వయకర్తలు రెడ్డి శాంతి, ధర్మాన ప్రసాధరావులు ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని 14వ వార్డు పరిధి చిత్తరంజన్‌వీధి, పెట్రోమాక్స్‌వీధి, బలిజేపల్లివారివీధి, అనంతపల్లివారివీధి, గాజులవీధి, చేపలవీధి, చిన్నబజారు తదితర ప్రాంతాల్లో ఆదివారం ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజలకు వివరించి ఫ్యాన్ గుర్తుపైనే ఓటువేసి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని సీఎం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ప్రజలు నమ్మకంతో ఎన్టీఆర్‌కు అధికారం అప్పగిస్తే చంద్రబాబు వెన్నుపోటు పొడిచి ఆ అధికారాన్ని లాక్కున్నారని ఆరోపించారు. ప్రజలపై వివిధ రకాల పన్నుల భారం మోపి ఇబ్బందులకు గురిచేశారన్నారు. రైతాంగాన్ని పూర్తిగా విస్మరించి వారు కష్టాలపాలయ్యేలా చేశారన్నారు. తొమ్మిదేళ్లపాటు ప్రజలంతా నరకయాతన అనుభవించేలా పాలన చేశారన్నారు. ఇపుడు అధికార దాహంతో సాధ్యంకాని హామీలను చెబుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు మరోసారి ప్రయత్నిస్తున్నారన్నారు. బాబు మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. రెడ్డి శాంతి మాట్లాడుతూ వైఎస్ అధికారం చేపట్టిన వెంటనే రైతుల కోసం ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేసి వారి కళ్లలో ఆనందం చూశారన్నారు. ప్రజల అభివృద్ధే ధ్యేయంగా అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టి ప్రజలకు స్వర్ణయుగంలాంటి పాలన అందించారన్నారు. ప్రచార కార్యక్రమంలో పార్టీ నేతలు ఎం.వి.పద్మావతి,అంధవరపువరహా నరసింహం, చల్లా అలివేలు మంగ, అంధవరపు సూరిబాబు, కోణార్క్ శ్రీను, మండవిల్లి రవి, జె.ఎం.శ్రీనివాస్, అబ్దుల్ రెహమాన్, టి.కామేశ్వరి, కె.ఎల్. ప్రసాద్, శిమ్మ వెంకట్రావు, పైడి నిర్మల్‌కుమార్, శిమ్మ రాజశేఖర్, గుడ్ల మల్లేశ్వరరావు, సీపాన భాస్కరరావు, గుంట జ్యోతి, చల్లా మంజుల, టి.మోహిని, డి.విజయలక్ష్మి, మహమ్మద్ సిరాజుద్దీన్, రావాడ జోగినాయుడు, ట్రేడ్‌యూనియన్ భాస్కరరావు, కూన వాసుదేవరావు, స్థానికులు రుంకాన డాక్టర్, జామి దాము, రెడ్డి జగన్నాథం పాల్గొన్నారు. -
ఆదరించండి.. ఓటేయండి...
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: సంక్షేమానికి చిరునామాగా నిలిచిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు వచ్చిన జగన్మోహన్రెడ్డిని ఆదరించాలని, ప్రస్తుత ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ శ్రీకాకుళం లోక్‌సభ, శాసనసభ సమన్వయకర్తలు రెడ్డి శాంతి, ధర్మాన ప్రసాదరావు కోరారు. శ్రీకాకుళంలోని ఎనిమిదో వార్డులోని భద్రమ్మగుడి, ఇల్లీసుపురం కూడలి, పాత ఎంప్లాయిమెంట్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో శుక్రవారం వారు ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరిగి వైఎస్సార్సీపీ ఆశయాలు, సిద్ధాంతాలు వివరించి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్రెడ్డిని సీఎంను చేయాలని కోరారు. ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తారని చెప్పారు. ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలుచేసిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఎందరో పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివారన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్న అమ్మ ఒడి పథకం ద్వారా వేలాది మంది పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల పిల్లలు ఉన్నత విద్యనభ్యసిం చేందుకు అవకాశం కలుగుతుందన్నారు. పిల్లల తల్లులకు కూడా లబ్ధి కలుగుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎంవీ పద్మావతి, చల్లా అలివేలు మంగ, అంధవరపు సూరి బాబు, జేఎం శ్రీనివాస్, అబ్దుల్ రెహ్మాన్, టి.కామేశ్వరి, మండవిల్లి రవి, కె.ఎల్.ప్రసాద్, శిమ్మ వెంకట్రావు, పైడి నిర్మల్‌కుమార్, గుడ్ల మల్లేశ్వరరావు, చల్లా మంజుల, టి.మోహిని, మహమ్మద్ సిరాజుద్దీన్, రావాడ జోగినాయుడు, శ్రీనివాస్ పట్నాయక్, కూన వాసుదేవరావు, స్థానికులు బాలు, హారికాప్రసాద్, గజ్జల లీలావతి, బొడ్డేపల్లి భాస్కరరావు, వై.మురళీమోహన్ పాల్గొన్నారు. -
జగన్‌తోనే సంక్షేమం సాధ్యం
శ్రీకాకుళం రూరల్, న్యూస్‌లైన్ : జగన్మోహన్రెడ్డితోనే సంక్షేమ పథకాల అమలు సాధ్యమని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు రెడ్డి శాంతి, ధర్మాన ప్రసాదరావు అన్నారు. బుధవారం సాయంత్రం పొన్నాంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ, పిల్లల ఉన్నత చదువులు, అర్హులకు పింఛన్లు అందాలంటే వైఎస్సార్సీపీకి ఓటేయాలన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మండలం నుంచి పోటీ చేస్తున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు చిట్టి జనార్థనరావు, నీలంశెట్టి సౌమ్యను గెలిపించాలని కోరారు. బాబు సంక్షేమమేమిటంటే... ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కడమే చంద్రబాబు మార్కు సంక్షేమమని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ధర్మాన ప్రసాదరావు ఎద్దేవా చేశారు. ప్రజాదరణతో గద్దెనెక్కిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి గద్దె దించిన ఘనత బాబుదన్నారు. రెండు రూపాయల కిలో బియ్యాన్ని రూ.5.25కు పెంచడం, మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచి గ్రామగ్రామాన బెల్టు షాపుల ఏర్పాటు చంద్రబాబు పాలనలో సంక్షేమ పథకాలన్నారు. ప్రస్తుతం ఇస్తున్న హామీలను తొమ్మిదేళ్ల పాలనలో ఎందుకు అమలుచేయలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు చిట్టి జనార్ధనరావు, నీలంశెట్టి సౌమ్య, గ్రామ సర్పంచ్ బైరి రాజేశ్వరీరామారావు, డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, మాజీ జెడ్పీ చైర్మన్ వైవీ సూర్యనారాయణ, మాజీ ఎంపీపీ అంబటి శ్రీనివాసరావు, కొర్ను గోవిందరావు, నీలంశేట్టి రామకృష్ణ, మొదలవలస శ్రీనివాసరావు, సనపల శ్రీనివాసరావు, రావాడ ధరణీ మోహన్ తదితరులు పాల్గొన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పే నేతలను తరిమికొట్టాలి ఆమదాలవలస : కల్లబొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్, టీడీపీ నేతలను తరిమికొట్టాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి అన్నారు. ఆమదాలవలస శాసనసభ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాంతో కలిసి మున్సిపాలిటీపరిధిలోని 22వ వార్డు లక్ష్ముడిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డిని సీఎంను చేస్తే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తారన్నారు. ఫ్యాను గుర్తుపై ఓటేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ చైర్పర్సన్ అభ్యర్థి బి.అజంతాకుమరి, కౌన్సిలర్ అభ్యర్థి దుంపల చిరంజీవి, పార్టీనాయకులు అందవరపు సూరిబాబు, రవికుమార్, కూన ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సరోజనమ్మకు ఓటేయండి మండలంలోని నెల్లిపర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రెడ్డి శాంతి మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి బొడ్డేపల్లి సరోజనమ్మకు ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఎస్.అనిల్‌కుమార్, పార్టీ నాయకులు ఎస్.సీతారాం, కేవీ రమణ, జి.గిరి, తదితరులు పాల్గొన్నారు. -
జగన్ చేతిలోనే రాష్ట్ర ప్రగతి
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించగల శక్తిసామర్థ్యాలు గల సాహసోపేత నాయకుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఒక్కరేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్త ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. అలాంటి నిబద్ధత కలిగిన జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు తోడ్పాటునందించాలని కోరారు. శ్రీకాకుళంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లోక్‌సభ సమన్వయకర్త రెడ్డి శాంతితో కలిసి ఆయన మాట్లాడారు. అధికార కాంక్షతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్ల పాలనలో అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు ఇంకా మరచిపోలేదన్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నిరంకుశ విధానాలతో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ధర్మాన గుర్తు చేశారు. రాష్ట్ర విభజన విషయంలో నోరు మెదపని చంద్రబాబు కొత్త రాష్ట్రాన్ని ఏవిధంగా పునర్నిర్మిస్తారని ప్రశ్నించారు. పార్టీ లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి మాట్లాడుతూ వైఎస్జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడం ద్వారానే రాష్ట్రంలో మళ్లీ 2004-09నాటి అభివృద్ధి విప్లవం సాధ్యమన్నారు. జిల్లాతోపాటు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న వెనుకబడిన మత్యకార సామాజికవర్గాన్ని ఎస్టీలలో చేర్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఒడిశా, తమిళనాడులలో మత్స్యాకారులను ఎస్టీలుగా గుర్తించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ల నిర్మాణం, భావనపాడు షిప్పింగ్‌హార్బర్ అభివృద్ధికి తోడ్పడతానన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ పార్టీ అధినేత జగన్ ప్రకటించిన సంక్షేమ పథకాలు అమలుకావాలంటే ప్రజలంతా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్సార్ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న దుష్ర్పచారాన్ని తిప్పికొట్టేలా ఎంపీ, ఎమ్మెల్యే రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి జిల్లాలో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు కొయ్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ జగన్‌ని ఎదుర్కొనే సత్తాలేక టీడీపీ, బీజేపీ, లోక్‌సత్తా, జనసేన పార్టీలన్నీ చీకటి ఒప్పందం చేసుకున్నాయని విమర్శించారు. ఈ కుట్రను ప్రజలు తిప్పికొడతారని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను వైఎస్ఆర్ సీపీ గెలుచుకుంటుందన్నారు. సమావేశంలో పార్టీ నేతలు ఎం.వి.పద్మావతి, అంధవరపు వరహానరసింహం, మార్పు ధర్మారావు, పేడాడ తిలక్, అంధవరపు సూరిబాబు, గొండు కృష్ణమూర్తి, చల్లా అలివేలు మంగ, జేఎం శ్రీనివాస్, ఎన్ని ధనుంజయ్, మండవిల్లి రవి, మహమ్మద్ సిరాజుద్దీన్ పాల్గొన్నారు. -
ఆ పిటిషన్‌పై విచారణ వాయిదా వేయండి: సీబీఐ
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో వాన్‌పిక్ పెట్టుబడులకు సంబంధించిన కేసులో నిందితునిగా ఉన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై అవినీతి నిరోధక చట్టం(పీసీయాక్టు) కింద మోపిన అభియోగాలను విచారణకు స్వీకరించాలని కోరుతూ తాము దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను వాయిదా వేయాలని సీబీఐ సోమవారం ప్రత్యేక కోర్టుకు నివేదించింది. ధర్మానపై పీసీ యాక్టు అభియోగాలను నమోదు చేయడాన్ని తప్పుబడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, అక్టోబరు మొదటి వారంలో విచారణకు వచ్చే అవకాశం ఉందని సీబీఐ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేంద్ర విజ్ఞప్తి చేశారు. తమ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే వరకూ... ఇక్కడ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ప్రక్రియను ఆపాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి దుర్గాప్రసాద్‌రావు విచారణను అక్టోబరు 21కి వాయిదా వేశారు. -
సీబీఐ ఎదుట ముగిసిన ధర్మాన విచారణ
హైదరాబాద్ : మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు సీబీఐ విచారణ బుధవారం ముగిసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసులో ఆయన్ని సీబీఐ విచారించింది. దిల్కుషా అతిథిగృహంలో ధర్మాన ప్రసాదరావును సీబీఐ అధికారులు సుమారు అయిదు గంటల పాటు విచారణ జరిపారు. సీబీఐ విచారణ అనంతరం ధర్మాన మీడియాతో మాట్లాడారు. లేఫాక్షి భూముల కేటాయింపులపై సీబీఐ విచారించినట్లు తెలిపారు. భూముల కేటాయింపుల విషయంలో తనకు తెలిసిన సమాచారాన్ని సీబీఐ అధికారులు తెలిపినట్లు చెప్పారు. మళ్లీ విచారణకు రమ్మని సీబీఐ నన్ను పిలవలేదన్నారు. తనతో పాటు అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా సీబీఐ విచారించినట్లు తెలిపారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో విచారణకు హాజరు కావాలంటూ ధర్మానకు సీఆర్పీపీ సెక్షన్ 160 కింద సీబీఐ నిన్న సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లాలో ఇందూ కంపెనీకి సంబంధించి లేపాక్షి నాలెడ్జి ప్రాజెక్టుకు భూకేటాయింపుల వ్యవహారంలో ఆయనను సీబీఐ విచారించింది. కాగా ఇప్పటికే ధర్మానపై సీబీఐ ఒక ఛార్జిషీట్ దాఖలు చేసింది. మూడోసారి ధర్మాన ప్రసాదరావు సీబీఐ ఎదుట హాజరయ్యారు.