శ్రీకాకుళం, పాతపట్నం: సీతంపేట ఐటీడీఏ పరిధిలో అనేక గిరిజన గ్రామాలకు కనీ స సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి దుయ్యబట్టారు. ఈ మేరకు బుధవా రం ఒక ప్రకటన విడుదల చేశారు. సీతంపే ట, కొత్తూరు, భామిని, మెళియాపుట్టి, ఎల్. ఎన్.పేట, పాతపట్నం తదితర మండలాల్లోని చాలా గ్రామాలకు ఇప్పటికీ రహదారి సౌకర్యం లేదన్నారు. అత్యవసర సర్వీసులందించే 108 వాహనాలు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొందని పేర్కొన్నారు.
ముఖ్యంగా తాగునీటి కి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వివరిం చారు. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోర్ల నుంచి చుక్కనీరు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన మండ ళ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ముఖ్య మంత్రి చంద్రబాబు ఆ విషయాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. గత ఎన్నికల్లో గిరిజన ప్రాంతాల్లోని అన్నిచోట్లా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకండా ఓట్లు రావడంతో గిరిజన గ్రామాల అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని, రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నాయకులనే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment