మహిళలు అన్నిరంగాల్లో రాణిం చాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఆకాంక్షించారు.
రిమ్స్‌క్యాంపస్ :మహిళలు అన్నిరంగాల్లో రాణిం చాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఆకాంక్షించారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్భయ మహిళా వేదిక ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని డాక్టరు శ్రీధర్ ఆస్పత్రిలో మహిళలకు ఉచిత వైద్య శిబిరాన్ని శని వారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మహిళల్లో చైతన్యం పెరగాలన్నారు. ప్రస్తుతం మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల కోసం ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ వేధింపులు మాత్రం ఆగకపోవటం విచారకరమన్నారు.
నిర్భయ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆడవారు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన కుటుం బం సాధ్యమన్నారు. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఎం.వి.పద్మావతి మాట్లాడుతూ మహిళలు మంచి ఆహారాన్ని తీసుకోవాలన్నారు. నిర్భయ మహిళా వేదిక అధ్యక్షురాలు గీతా శ్రీకాంత్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించకూడదన్నారు. డాక్టరు ధానేటి శ్రీధర్ మహిళలకు వైద్య పరీక్షలను నిర్వహించారు. అనంతరం రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో బంగారు పతకం సాధించిన రోజా, ఐసీడీఎస్‌లో ప్రాజెక్టు లీడర్‌గా పనిచేస్తూ..సమాజ సేవలో పాలుపంచుకుంటున్న రాజేశ్వరిలను సన్మానించారు. ఈ సందర్భంగా రక్తహీనతపై మహిళల్లో అవగాహన పెంచుతూ కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్భయ మహిళా వేదిక సహాయ కార్యదర్శి స్వాతి, పీఆర్‌వో పద్మ పాల్గొన్నారు.