స్థలం కనపడితే కబ్జానే | site kabja | Sakshi
Sakshi News home page

స్థలం కనపడితే కబ్జానే

Published Fri, Sep 30 2016 9:57 PM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM

site kabja

–అధికార పార్టీ ఎంపీటీసీ దౌర్జన్యం
–దళితులపై దాడి జరిగినా పట్టించుకోని పోలీసులు
–బాధితులకు జరగని న్యాయం
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు ః
బలహీనులైతే చాలు వారి పేరుతో ఉన్న భూములను ఏదోవిధంగా సొంతం చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు వెనకాడటం లేదు.  అవసరమైతే వారిపై దాడులకు కూడా వెనుకాడటం లేదు.  ఈ దాడులపై విడియో సాక్ష్యం ఉన్నా కొంతమంది పోలీసు అధికారులు స్పందించడం లేదు. తమ బంధువులపై దాడి జరుగుతోందని ఎస్‌ఐకి ఫోన్‌ చేస్తే నువ్వు వెళ్లి విడదీయమంటూ ఉచిత సలహా ఒక్కటి ఇచ్చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేకి బంధువు అని చెప్పుకుంటున్న ఆ అధికారి తెలుగుదేశం పార్టీ నేతల కన్నా ఎక్కువగా స్పందిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ...
వివరాల్లోకి వెళ్తే....
లింగపాలెం మండలం కె. గోకవరం శివారు అన్నపనేనివారి గూడెం గ్రామానికి చెందిన రాచప్రోలు రమణమ్మకు సర్వే నెంబర్‌ 317–3డిలో 64 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిలో గత 30 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ఇటీవల అదే గ్రామానికి చెందిన ఇరువురు వ్యక్తులు, వారికి మద్దతుగా స్థానిక తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ కలిసి ఈ భూమిని ఆక్రమించారు. దీంతో బాధితురాలు  జిల్లా కోర్టును ఆశ్రయించి ఇంజక్షన్‌ ఆర్డర్‌ తెచ్చుకున్నారు. కోర్టు ఆదేశాలతో వారు తమ స్థలం చుట్టూ ఫెన్సింగ్‌ వేసుకున్నారు. మరుసటిరోజున ఎంపీటీసీ, ఇతరులు జెసీబీ సాయంతో వీటిని తొలగించారు. అడ్డువెళ్లిన వారిపై దాడి చేశారు. దళిత మహిళ అని కూడా చూడకుండా జుట్టుపట్టి ఈడ్చేశారు. వారి పనులను అడ్డుకున్న రమణమ్మను స్థంబాల కోసం వేసిన గోతిలోనే ఉంచి పూడ్చివేసే ప్రయత్నం ఎంపీటీసీ చేశారు.ఈ తతంగమంతా స్థానికులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. దీనిపై స్థానిక ఎస్‌ఐకి ఫిర్యాదు చేసినా ఆయన స్పందించలేదు. పైగా ప్రత్యర్ధులు ఇచ్చిన ఫిర్యాదు తీసుకుని æ ఎదురు కేసులు పెట్టారు. గొడవ జరిగిన రోజున గ్రామంలో లేనివారిపై కూడా కేసులు పెట్టారు. దీంతో బాధితులు గత నెల నాల్గవ తేదీన దర్మాజీగూడెం స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అదే నెల ఏడున ఎస్‌ఐ బా«ధితులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి ఆ భూమిని వదులుకోకపోతే అందరిపై కేసులు కట్టి రిమాండ్‌కు పంపిస్తానని బెదిరించారని బాధితులు ఆరోపిస్తున్నారు.  బాధితులను స్టేషన్‌లోనే ఉంచి అదే రోజున ఆ స్థలంలో ప్రత్యర్ధులు మట్టి తోలించారు. ఆ స్థలంలో చిన్న షెడ్‌ వేసి అక్కడ ప్రజావైద్యశాల అంటూ బోర్డు పెట్టారు. గత నెల 4న దాడి జరిగినా ఇప్పటివరకూ బాధితులకు న్యాయం జరగలేదు. ప్రత్యర్ధులను అరెస్టు కూడా చేయలేదు. ఎస్‌సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కావడంతో డీఎస్పీ విచారణ ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకూ పురోగతి లేదని బాధితురాలు ఆరోపిస్తున్నారు. దాడి చేసిన వారు తెలుగుదేశంపార్టీ ప్రజాప్రతినిధులు కావడంతో ఎస్‌ఐ కూడా వారికి సహకరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా తమ ప్రాణాలకు హాని కల్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బాధితులు సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి విన్నవించుకున్నారు.  ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement