Site
-
ప్రముఖ సైట్‌పై ప్రభుత్వ నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఫైల్ షేరింగ్ సైట్ ‘వీ ట్రాన్స్ఫర్.కామ్’పై టెలికమ్యూనికేషన్స్ శాఖ(డాట్) నిషేధం విధించింది. జాతి, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొద్దిరోజుల క్రితం సైట్‌లోని ఓ మూడు యూఆర్ఎల్స్ను నిషేధించాలంటూ డాట్ ఇంటర్నెట్ ప్రొవైడర్లకు నోటీసులు జారీచేసింది. అనంతరం మూడవ నోటీసులో సైట్‌ను పూర్తిగా నిషేధించాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్లు తమ వినియోగదారులకు ఈ సైట్‌ను అందుబాటులో లేకుండా చేశాయి. అయితే ప్రభుత్వం ఎందుకు ఈ సైట్‌ను నిషేధించిందో తెలియరాలేదు. ( సరికొత్త వెర్షన్లో జూమ్ యాప్..) కాగా, వీ ట్రాన్స్ఫర్ సైట్‌కు ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ల యూజర్లు ఉన్నారు. లాక్డౌన్ సమయంలో ఈ సైటు భారత్‌లో విపరీతమైన ప్రాచూర్యాన్ని పొందింది. దీని ద్వారా దాదాపు 2జీబీ సైజు గల ఫైళ్లను ‘వీ ట్రాన్స్ఫర్’లో ఎటువంటి అకౌంట్లు అవసరం లేకుండా ఎదుటి వ్యక్తి ఈ మెయిల్‌కు పంపించవచ్చు. ఉచితంగా ఫైళ్లను పంపించుకునే అవకాశం ఉండటంతో నెటిజన్లు దీనిపై ఎక్కువగా మొగ్గుచూపారు. ( పబ్జి ప్రియులకు శుభవార్త ) -
గౌరి లంకేష్ హత్యకేసులో సీసీ పుటేజి విశ్లేషణ
-
స్థలం కనపడితే కబ్జానే.....
–అధికార పార్టీ ఎంపీటీసీ దౌర్జన్యం –దళితులపై దాడి జరిగినా పట్టించుకోని పోలీసులు –బాధితులకు జరగని న్యాయం సాక్షి ప్రతినిధి, ఏలూరు ః బలహీనులైతే చాలు వారి పేరుతో ఉన్న భూములను ఏదోవిధంగా సొంతం చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు వెనకాడటం లేదు. అవసరమైతే వారిపై దాడులకు కూడా వెనుకాడటం లేదు. ఈ దాడులపై విడియో సాక్ష్యం ఉన్నా కొంతమంది పోలీసు అధికారులు స్పందించడం లేదు. తమ బంధువులపై దాడి జరుగుతోందని ఎస్ఐకి ఫోన్ చేస్తే నువ్వు వెళ్లి విడదీయమంటూ ఉచిత సలహా ఒక్కటి ఇచ్చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేకి బంధువు అని చెప్పుకుంటున్న ఆ అధికారి తెలుగుదేశం పార్టీ నేతల కన్నా ఎక్కువగా స్పందిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ... వివరాల్లోకి వెళ్తే.... లింగపాలెం మండలం కె. గోకవరం శివారు అన్నపనేనివారి గూడెం గ్రామానికి చెందిన రాచప్రోలు రమణమ్మకు సర్వే నెంబర్ 317–3డిలో 64 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిలో గత 30 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ఇటీవల అదే గ్రామానికి చెందిన ఇరువురు వ్యక్తులు, వారికి మద్దతుగా స్థానిక తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ కలిసి ఈ భూమిని ఆక్రమించారు. దీంతో బాధితురాలు జిల్లా కోర్టును ఆశ్రయించి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. కోర్టు ఆదేశాలతో వారు తమ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నారు. మరుసటిరోజున ఎంపీటీసీ, ఇతరులు జెసీబీ సాయంతో వీటిని తొలగించారు. అడ్డువెళ్లిన వారిపై దాడి చేశారు. దళిత మహిళ అని కూడా చూడకుండా జుట్టుపట్టి ఈడ్చేశారు. వారి పనులను అడ్డుకున్న రమణమ్మను స్థంబాల కోసం వేసిన గోతిలోనే ఉంచి పూడ్చివేసే ప్రయత్నం ఎంపీటీసీ చేశారు.ఈ తతంగమంతా స్థానికులు సెల్ఫోన్లో చిత్రీకరించారు. దీనిపై స్థానిక ఎస్ఐకి ఫిర్యాదు చేసినా ఆయన స్పందించలేదు. పైగా ప్రత్యర్ధులు ఇచ్చిన ఫిర్యాదు తీసుకుని æ ఎదురు కేసులు పెట్టారు. గొడవ జరిగిన రోజున గ్రామంలో లేనివారిపై కూడా కేసులు పెట్టారు. దీంతో బాధితులు గత నెల నాల్గవ తేదీన దర్మాజీగూడెం స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అదే నెల ఏడున ఎస్ఐ బా«ధితులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి ఆ భూమిని వదులుకోకపోతే అందరిపై కేసులు కట్టి రిమాండ్‌కు పంపిస్తానని బెదిరించారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులను స్టేషన్లోనే ఉంచి అదే రోజున ఆ స్థలంలో ప్రత్యర్ధులు మట్టి తోలించారు. ఆ స్థలంలో చిన్న షెడ్ వేసి అక్కడ ప్రజావైద్యశాల అంటూ బోర్డు పెట్టారు. గత నెల 4న దాడి జరిగినా ఇప్పటివరకూ బాధితులకు న్యాయం జరగలేదు. ప్రత్యర్ధులను అరెస్టు కూడా చేయలేదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కావడంతో డీఎస్పీ విచారణ ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకూ పురోగతి లేదని బాధితురాలు ఆరోపిస్తున్నారు. దాడి చేసిన వారు తెలుగుదేశంపార్టీ ప్రజాప్రతినిధులు కావడంతో ఎస్ఐ కూడా వారికి సహకరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా తమ ప్రాణాలకు హాని కల్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బాధితులు సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి విన్నవించుకున్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. -
స్థలం కనపడితే కబ్జానే

కలాం విగ్రహ ఏర్పాట్లు సందర్శించిన ప్రత్యేక బృందం
రామేశ్వరంః మాజీ రాష్ట్రపతి, దివంగత ఎపిజె అబ్దుల్ కలాం కాంస్య విగ్రహాన్ని రామేశ్వరంలో ప్రతిష్టించనున్నారు. జూలై 27న జరగనున్న విగ్రహ స్థాపనకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రక్షణ మంత్రిత్వశాఖ, ఇండియన్ కోస్ట్ గార్డు అధికారులతో కూడిన బృందం ఆ ప్రదేశాన్ని సందర్శించింది. రక్షణ మంత్రిత్వశాఖ, ఇండియన్ కోస్ట్ గార్డు అధికారులు రామేశ్వరంలో పర్యటించారు. మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం కాంస్య విగ్రహం ఏర్పాటుకోసం జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. మాజీ రాష్ట్పపతి మొదటి వర్థంతి సందర్భంలో జూలై 27న ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. అదే ప్రాంతంలో కలాం స్మారక చిహ్నంగా ఓ లైబ్రరీని, మ్యూజియం ను సైతం నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే సిబ్బందికోసం హౌసింగ్ క్వార్టర్స్ ను కూడా నిర్మించనున్నట్లు వెల్లడించారు. పర్యవేక్షణ బృందంతోపాటు మండపం కోస్ట్ గార్డ్ కమాండర్ రామ్మోహన్ రావు, అబ్దుల్ కలాం మేనల్లుడు షేక్ సలీం కూడా హాజరై విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించారు. -
ట్రక్కుతో రెండు సార్లు రెక్కీ నిర్వహించి మరీ..
నీస్: ఫ్రాన్స్‌లో ట్రక్కుతో మారణహోమం సృష్టించిన ఉగ్రవాది మహమ్మద్ లహోయిజ్ బహులల్ పక్కా ప్రణాళికతోనే దాడికి దిగినట్లు విచారణలో తేలింది. నీస్ నగరంలో బాస్టిల్ డే ఉత్సవాల్లో పాల్గొన్న జనంపైకి ట్రక్కుతో దూసుకెళ్లి 84 మంది మృతికి కారణమైన బహులల్.. ఆ ఘటనకు రెండు రోజుల ముందుగానే ఆ ప్రాంతంలో అద్దెకు తీసుకున్న ట్రక్కుతో రెక్కీ నిర్వహించాడని అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే వందలాది మందిని విచారించారు. గతంలో బహులల్ ఎప్పుడూ మతపరమైన ఆలోచనలు ఉన్న వ్యక్తిలా కనిపించేవాడు కాదని విచారణలో తేలింది. అయితే అతడు చాలా అనతికాలంలోనే ఉగ్రవాద భావజాలంవైపు ఆకర్షితుడయ్యాడని అధికారులు గుర్తించారు. -
మరో అణుపరీక్షకు సిద్ధమైన జగడాల మారి
ప్యాంగ్యాంగ్: జగడాల మారి ఉత్తర కొరియా మరో ప్రయోగానికి దిగుతోంది. నెల వ్యవధిలోనే మరో అణుపరీక్షకు సిద్దమవుతోంది. ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నా ఈ దేశం మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. కీలక వర్గాల సమాచారం మేరకు మే మొదటివారంలో మరోసారి అణుపరీక్ష నిర్వహించాలని భావిస్తోంది. ఇదే జరిగితే ఈ పరీక్ష నిర్వహించడం ఇది ఐదోసారి అవుతుంది. మరో అణుపరీక్ష నిర్వహిణ కోసం ఇప్పటికే ఉత్తర కొరియా స్థలాన్ని పరిశీలిస్తోందని తమ వద్ద సమాచారం ఉన్నట్లు దక్షిణ కొరియా తెలిపింది. తమ దేశంలో ఆయుధ సంపత్తిని అమాంతం పెంచుకోవాలని ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సూచనల మేరకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుందని తెలుస్తోంది. మొన్న శుక్రవారం నిర్వహించిన బాలిస్టిక్ క్షిఫణి పరీక్ష విఫలం కావడం, ఆ విషయం అందరికీ తెలియడంతో దానిని అవమానంగా భావించిన ఉత్తర కొరియా తాజాగా వారాల వ్యవధిలోనే ఏకంగా అణుపరీక్షకు సిద్ధమైందని అత్యంత కీలక వర్గాల సమాచారం. -
ఆ యాప్ ను తీసేసింది
న్యూయార్క్: తాలిబాన్ యాప్ ను తొలిగించినట్టు ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ధ్రువీకరించింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి తాలిబాన్ యాప్ ను తీసేసినట్టు స్పష్టం చేసింది. గతవారం ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లో ఉంచింది. విద్వేష ప్రసంగాలు, హింస, చట్టవ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించే యాప్స్ ను గూగుల్ అనుమతించదు. టెర్రరిస్టుల ఆన్ లైన్ కార్యకలాపాలను కనిపెట్టేందుకు అంతకుముందు 'సైట్' అనే సంస్థ పనిచేసేది. అయితే ఆన్ లైన్ లో తీవ్రవాద కార్యకలాపాలు పెరగడంతో ఆండ్రాయిడ్ డెవలర్ల కోసం గూగుల్ సమీక్ష విధానాన్ని అమలుచేస్తోంది. తాము ఆమోదించిన వాటినే గూగుల్ ప్లే స్టోర్ లో పెడుతోంది. గతేడాది పలు యాప్స్ ను గూగుల్ తొలగించింది. తాజాగా తాలిబాన్ యాప్ ను తీసేసింది. అయితే దీనిపై ఎటువంటి వివరణ ఇవ్వలేదు. -
ఉప్పల్-యాదాద్రి ‘మెట్రో’కు స్థల పరిశీలన
-
ఫేస్బుక్లో మాజీలను తొలగించే అవకాశం.!
ప్రపంచ వ్యాప్తంగా సుమారు 150 కోట్ల వినియోగదారులున్న ఫేస్బుక్ సంస్థ యూజర్లకు ఓ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఫేస్బుక్ లోని ఫ్రెండ్స్ లిస్టులో విసుగు కలిగిస్తున్న, పాత స్నేహితులను లిస్టు నుంచి తొలగించేందుకు ప్రత్యేక సౌకర్యం కల్పిస్తోంది. అయితే ఈ కొత్త సౌకర్యాన్ని పొందే ముందు వినియోగదారులు కాస్త అసౌకర్యాన్ని కూడా భరించాల్సి వస్తుందని ఆ సంస్థ చెబుతోంది. కొత్త టూల్ ను ప్రారంభించిన తర్వాత అందుబాటులోకి ఓ కొత్త మొబైల్ యాప్ ను తెస్తామని, ఈ కొత్త యాప్... యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు ఫేస్బుక్ నిర్వాహకులు చెప్తున్నారు. కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫేస్బుక్ లో మీ స్థితి మార్చినపుడు ఇంతకు ముందు మీ ఫ్రెండ్స్ పోస్టు చేసిన ఫొటోలు, వీడియోలు.. మెసేజ్ లు డిలీట్ చేయాలా? వద్దా? అన్నది అడుగుతుంది. ఇలా చేసిన తర్వాత మీ వాల్ పై మీ పోస్ట్ లు, మెసేజ్ లు, ఫొటోలు మీరు లిస్టు నుంచి తొలగించిన వారికి కనిపించే అవకాశం ఉండదు. అలాగే గత పోస్ట్ వివరాలను కూడా చూసే సామర్థ్యాన్ని పరిమితం చేసుకునే అవకాశాన్ని ఈ కొత్త యాప్ కలిగిస్తుంది. అలాగే కొంతమందికి మాత్రమే మీ వివరాలు, పోస్ట్ లు కనిపించేట్టుగా ఎంపిక చేసుకునే అవకాశం కూడా కల్పిస్తోంది. ఫేస్బుక్ ద్వారా తమ వినియోగదారుల జీవితాల్లో కలుగుతున్నకష్టాలను తీర్చేందుకు ఓ ప్రయత్నమని ఫేస్బుక్ ప్రొడక్ట్ మేనేజర్ కెల్లీ వింటర్స్ తన బ్లాగ్ స్పాట్ లో తెలిపారు. ఈ సౌకర్యం ప్రజలకు కలిగిస్తున్న అసౌకర్యాలను కూడా సులభంగా తొలగిస్తుందని నమ్ముతున్నట్లు ఆయన తెలిపారు. అయితే మీ నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో... మీ స్నేహితులు, పార్టనర్ కు తెలిసే అవకాశం కూడా ఉండదన్నారు. ఈ కొత్త టూల్ వల్ల ప్రజలు మరింత సౌలభ్యం, సౌకర్యం పొంది, ఫేస్బుక్ తో మంచి సంబంధాలను కొనసాగించేందుకు సహాయపడుతుందని ఆశిస్తున్నట్లు కెల్లీ వింటర్ తెలిపారు.