ఆ యాప్ ను తీసేసింది | Google confirms removing Taliban app from Play Store | Sakshi
Sakshi News home page

ఆ యాప్ ను తీసేసింది

Published Tue, Apr 5 2016 2:53 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM

ఆ యాప్ ను తీసేసింది

ఆ యాప్ ను తీసేసింది

న్యూయార్క్: తాలిబాన్ యాప్ ను తొలిగించినట్టు ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ధ్రువీకరించింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి తాలిబాన్ యాప్ ను తీసేసినట్టు స్పష్టం చేసింది. గతవారం ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లో ఉంచింది. విద్వేష ప్రసంగాలు, హింస, చట్టవ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించే యాప్స్ ను గూగుల్ అనుమతించదు.

టెర్రరిస్టుల ఆన్ లైన్ కార్యకలాపాలను కనిపెట్టేందుకు అంతకుముందు 'సైట్' అనే సంస్థ పనిచేసేది. అయితే ఆన్ లైన్ లో తీవ్రవాద కార్యకలాపాలు పెరగడంతో ఆండ్రాయిడ్ డెవలర్ల కోసం గూగుల్ సమీక్ష విధానాన్ని అమలుచేస్తోంది. తాము ఆమోదించిన వాటినే గూగుల్ ప్లే స్టోర్ లో పెడుతోంది. గతేడాది పలు యాప్స్ ను గూగుల్ తొలగించింది. తాజాగా తాలిబాన్ యాప్ ను తీసేసింది. అయితే దీనిపై ఎటువంటి వివరణ ఇవ్వలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement