ట్రక్కుతో రెండు సార్లు రెక్కీ నిర్వహించి మరీ.. | France Attacker Visited Site With Truck Twice | Sakshi
Sakshi News home page

ట్రక్కుతో రెండు సార్లు రెక్కీ నిర్వహించి మరీ..

Published Sun, Jul 17 2016 3:40 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

ట్రక్కుతో రెండు సార్లు రెక్కీ నిర్వహించి మరీ..

ట్రక్కుతో రెండు సార్లు రెక్కీ నిర్వహించి మరీ..

నీస్: ఫ్రాన్స్లో ట్రక్కుతో మారణహోమం సృష్టించిన ఉగ్రవాది మహమ్మద్ లహోయిజ్ బహులల్ పక్కా ప్రణాళికతోనే దాడికి దిగినట్లు విచారణలో తేలింది. నీస్ నగరంలో బాస్టిల్ డే ఉత్సవాల్లో పాల్గొన్న జనంపైకి ట్రక్కుతో దూసుకెళ్లి 84 మంది మృతికి కారణమైన బహులల్.. ఆ ఘటనకు రెండు రోజుల ముందుగానే ఆ ప్రాంతంలో అద్దెకు తీసుకున్న ట్రక్కుతో రెక్కీ నిర్వహించాడని అధికారులు గుర్తించారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే వందలాది మందిని విచారించారు. గతంలో బహులల్ ఎప్పుడూ మతపరమైన ఆలోచనలు ఉన్న వ్యక్తిలా కనిపించేవాడు కాదని విచారణలో తేలింది. అయితే అతడు చాలా అనతికాలంలోనే ఉగ్రవాద భావజాలంవైపు ఆకర్షితుడయ్యాడని అధికారులు గుర్తించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement