నీకు వేరే దారే లేదా .. రూల్స్‌ బ్రేక్‌ వీడియో వైరల్‌ | Mptc Suresh Yadav rules break video Viral | Sakshi
Sakshi News home page

నీకు వేరే దారే లేదా .. రూల్స్‌ బ్రేక్‌ వీడియో వైరల్‌

Published Mon, Apr 22 2019 3:02 PM | Last Updated on Mon, Apr 22 2019 7:25 PM

Mptc Suresh Yadav rules break video Viral - Sakshi

ఇట్స్‌ నాట్‌ యువర్‌ ప్రాపర్టీ, నువ్వేం పోలీసువు కాదంటూ ర్యాష్‌గా..

సాక్షి, హైదరాబాద్‌ : ట్రాఫిక్‌ నిబంధనలు ఎందుకు పాటించడంలేదని ప్రశ్నిస్తూ ప్రజాప్రతినిధిని ఓ యువతి వీడియో తీస్తే.. మమ్మల్నే వీడియో తీస్తావా అంటూ ప్రజాప్రతినిధి కూతురు కూడా ఫోన్‌తో చిత్రీకరిస్తున్న ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నిజాంపేటలో ఎంపీటీసీ సురేష్‌ యాదవ్‌ సర్వీస్‌ రోడ్డుకు అడ్డంగా కారును పార్క్‌ చేశారు. అయితే అదే రోడ్డుగుండా వెలుతున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రిషికా రోడ్డుపైనే కారును పార్క్‌ ఎందుకు చేశారంటూ నిలదీసింది. 

నీ ఇష్టమొచ్చింది చేసుకో, అసలు నువ్వెందుకు ఈ రూట్లో వచ్చావు, నీకు వేరే దారే లేదా అంటూ సురేష్‌ యాదవ్‌ దబాయించాడు. అంతేకాకుండా సురేష్‌ యాదవ్‌ కూతురు కూడా వీడియో తీస్తూ యువతిని ఇట్స్‌ నాట్‌ యువర్‌ ప్రాపర్టీ, నువ్వేం పోలీసువు కాదంటూ ర్యాష్‌గా మాట్లాడింది. అయితే ఈ ఘటనపై రిషికా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడంతో సైబరాబాద్‌ పోలీసులు స్పందించారు. ఎంపీటీసీ కారుకు చలానా విధించారు. గురువారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement