టీడీపీ నేతల ఆగడాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. అధికార పార్టీ అండచూసుకుని కొందరు నేతలు మోసాలకు పాల్పడుతున్నారు. విశాఖపట్నానికి చెందిన ఓ మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ టీడీపీ ఎంపీటీసీ ఆమె వద్దనుంచి లక్షలు కాచేశాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం ఎ.కొత్తపల్లికి చెందిన ఎంపీటీసీ పెద్దాడ వెంకటరమణ అంగన్‌వాడీ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి సంతోష కుమారి అనే మహిళ దగ్గర 4లక్షలు వసూలు చేశాడు.