సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని చింతలపాలెం ఎంపీటీసీ దంపతులపై హత్యాయత్నం జరిగింది. చింతలపాలెం మండలం టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీటీసీ లకావత్ రామారావుపై మేళ్లచెరువులో కత్తితో దాడి చేశారు. అదే విధంగా రామారావు భార్య సుభద్రపై కూడా నిందితుడు దాడికి దిగాడు.