వారసత్వ ఆరాటం
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో పలువురు సీనియర్ నేతలు తమ వారసులను రాజకీయ రంగ ప్రవేశం చేయించేందుకు ఉవ్విళ్లూరుతున్నా రు. తమ రాజకీయ వారసత్వాన్ని తమ కుమారు లు, కుటుంబసభ్యుల ద్వారా కొనసాగించేందు కు ప్రయత్నిస్తున్నారు. రాజకీయాల్లో తమ పరపతి ఉన్నప్పుడే తమ వారికి పదవులు దక్కేలా పావు లు కదుపుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు, ఎమ్మెల్సీలు పదవుల్లో కొనసాగుతున్న ఈ నేతలు రానున్న ఎన్నికల్లో వారసులను పోటీ చేయిం చేందుకు రంగం సిద్ధం చేస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. అధికార టీఆర్‌ఎస్ పార్టీతో పాటు, కాంగ్రెస్ పార్టీలోని ఒకరిద్దరు ముఖ్యనేతలు ఈ దిశగా పావులు కదుపుతున్నా రు. కాగా ఈ నేతల వారసులు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో అధికారిక కార్యక్రమాల్లో చురు గ్గా పాల్గొంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో సైతం పాలు పంచుకుంటున్నారు. టీఆర్‌ఎస్ పార్టీలో ఈ రాజకీయ వారసత్వంపై ప్రధాన చర్చ జరుగుతోంది. తమ వారసులను ఎమ్మెల్యే అభ్యర్థులు గా బరి లోకి దించితే తమ ప్రధాన అనుచరుల నుంచి వచ్చే అంతర్గత అసంతృప్తులను ఎదుర్కొనేందు కు పావులు కదుపుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
- బాన్సువాడలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వారసులు ఈ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో కి వచ్చే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.పార్టీలో సీనియర్ మంత్రులు ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగుతారనే ప్రచారం అప్ప ట్లో తెరపైకి వచ్చింది. దీంతో ఎమ్మెల్యేగా తన వారసుల్లో ఒకరిని పోటీ చేయించే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది. పోచారం చిన్న కుమారుడు భాస్కర్‌రెడ్డి ఇప్పటికే పీఏసీఎస్ చైర్మన్ పదవిలో ఉన్నారు. ఆయన రెండో కుమారుడు సురేందర్‌రెడ్డి సైతం స్థానిక రాజకీయాల్లో చరుగ్గా పాల్గొంటున్నారు. ఎన్నికల సమయానికి పెద్ద కుమారుడు రవీందర్‌రెడ్డి పేరు
తెరపైకి వచ్చే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
- నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తన కుమారుడు జగన్‌ను ఎమ్మెల్యేగా పోటీలో నిలిపే అవకాశాలున్నట్లు ఆయన అనుచరవర్గం చర్చించుకుంటోంది. ఇప్పటికే జగన్ అధి కారిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. నియోజకవర్గం పెద్దది కావ డం, ఒకవేళ బాజిరెడ్డికి వెళ్లడానికి వీలు కాని పక్షం లో ముఖ్యఅథితిగా జగన్ వెళ్తున్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ ప్రత్యక్ష రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారనే చర్చ సాగుతోంది.
- సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ తన పెద్ద కుమారుడు, మాజీ మేయర్ సంజయ్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్వి ళ్లూరుతున్నారు. ఆయన చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీగా బరిలోకి దిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు, తన వ్యక్తిగతంగా తన పట్టును నిలుపుకునేందుకు అన్ని ప్రయత్నా లు చేస్తున్నారు.
- శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ తన కుమారుడు ఇలియాస్ ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో పాలు పం చుకుంటున్నారు. ఎమ్మెల్సీ పదవీకాలం మరో మూడేళ్లు ఉండటంతో షబ్బీర్ ఈ ఎన్నికల్లో తన కుమారుడిని బరిలోకి దింపుతారనే ప్రచారం పార్టీలో సాగుతోంది. కాగా ఇటీవల టీడీపీ నేత మదన్‌మోహన్‌రావును కాంగ్రెస్ పార్టీలోకి తేవడం, జహీ రాబాద్ ఎంపీగా బరిలోకి దింపేందుకు షబ్బీ ర్ అలీ పావులు కదుపుతున్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇది ఆయన ప్రధాన అనుచరనేతలకు మింగుడు పడటం లేదు. తమకు అవకాశం ఇప్పించకుండా కొత్తవారిని తెరపైకి తేవడంతో అంతర్గతంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న ఈ నేతలు రానున్న ఎన్నికల్లో తన కుమారుడిని ప్రత్యక్ష ఎన్నికల్లో నిలిపితే ఏ మేరకు సహకరిస్తారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.
- ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఏనుగు రవీందర్‌రెడ్డి ఈసారి తన సతీమణి మంజులారెడ్డిని ఎన్నికల్లో పోటీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె ఈసారి ఎల్లారెడ్డి అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే ప్రచారం సాగుతోంది. మొత్తమ్మీద ప్రధాన పార్టీలోని ముఖ్యనేతలు తమ వారసులను తెరపైకి తేవడం ఏ మేరకు కలిసొస్తుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో సర్వ త్రా చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment