సాక్షి, నిజామాబాద్/ ఇందూరు, న్యూస్‌లైన్:
జిల్లా ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలపై చా లాకాలం తర్వాత సుదీర్ఘ చర్చ జరిగింది. జిల్లా అధికా ర యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి పలు సంక్షే మ, అభివృద్ధి పథకాల అమలు తీరును సమీక్షించా రు. ఈ సమీక్షకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు దూరంగా ఉండటం గమనార్హం. ఈ సమావేశంలో పలు అంశాలపై తీర్మానాలు చేసి రాష్ట్ర సర్కారుకు నివేదించాలని నిర్ణయించారు. ఆర్‌డబ్ల్యూఎస్, డ్వామా, ఆర్వీఎం, హౌసింగ్, పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖల పథకాల అమలు తీరుపై ఐదున్నర గంటల పాటు చర్చ జరిగింది. నేతలు ఎక్కడా రాజకీయ రచ్చ లేకుండా ప్రజా సమస్యలపైనే చర్చించారు.
గ్లాసు నీళ్లకు దిక్కులేదు
ఆర్‌డబ్ల్యూఎస్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఎస్‌ఈ నుంచి కింది స్థాయి అధికారులకు వరకు నిర్లక్ష్యమే కనిపిస్తోంది. నిజామాబాద్ నియోజకవర్గానికి రూ.60 కోట్లతో మంచినీటి పథకం మంజురై తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా పనులు పూర్తి కాలేదు. ఒక్క గ్లాసు నీళ్లు ఇచ్చింది లేదు. ఈ పని పూర్తి కాకముందే మరో రూ.200 కోట్లకు ప్రతిపాదనలు పెట్టడం హాస్యాస్పదం. చాలా గ్రామాల్లో తాగునీటి పథకాలు పడకేశాయి. రూరల్ నియోజకవర్గంలో దాదాపు 30 నుంచి 40 అదనపు పాఠశాల తరగతి గదులు నిధులు లేక మధ్యలో నిలిచిపోయా యి. కొన్ని గ్రామాల్లో రెండు కిలోమీటర్ల రోడ్డు వేయడానికి కూడా నిధులు లేని పరిస్థితి ఉంది. వీటిని పట్టించుకునే వారే కరువయ్యారు. బోధన్‌లోని ఎన్డీఎస్‌ఎల్ నష్టాల్లో కూరుకుపోవడానికి ప్రభుత్వమే కారణం.
-మండవ వెంకటేశ్వర్‌రావు, ఎమ్మెల్యే
నోటితో చెప్పితే సరిపోతుందా?
జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో టాయిలెట్లు పూర్తయ్యాయని చెబుతున్నారు.వాటిని పర్యవేక్షించిన దాఖలాలు లేవు.టాయిలెట్లు గర్భిణులకు, బాలింతలకు ఉపయోగకరంగా లేవు. 1100 అద్దె భవనాల్లో తాగునీటి, టాయిలె ట్ల సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. బోర్‌వెల్స్‌కు హ్యాండిల్స్ బిగించడం లేదు. సీపీడబ్ల్యూ పథకంలో ఏర్పాటు చేసిన బోరు మోటార్లు కాలిపోతున్నాయి.
-పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే
గడువు ముంచుకొస్తున్నా
పట్టింపులేదు
కామారెడ్డి నియోజకవర్గానికి రూ.140 కోట్లు వెచ్చించి తాగునీటి పథకాన్ని ప్రారంభిం చారు. సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పట్టింపులేకుండా ఉన్నారు. ఇప్పటికే వేసిన పైపులు పగిలిపోతున్నాయి. గడువు ముంచుకొస్తున్నా పట్టించుకోవడం లేదు.
-గంప గోవర్ధన్, ఎమ్మెల్యే
400 మంది విద్యార్థులకు
నలుగురే టీచర్లు
ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట్, మాక్లూర్ మండల కేంద్రాల్లో ఉన్న పాఠశాలల్లో 400 మంది విద్యార్థులుంటే కేవలం నలుగురు టీచర్లు మాత్రమే ఉన్నారు. ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పైన కూడా పంపడంలేదు. పదవ తరగతిలో చాలామంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. నందిపేట్ మండలం కంఠం గ్రామ పంచాయతీ శిథిలావస్థకు చేరుకుందని గత సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కొత్త భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకోలేదు.
-ఏలేటి అన్నపూర్ణమ్మ, ఎమ్మెల్యే
రోడ్డు నరకంగా మారింది
బాన్సువాడ నుంచి బిచ్కుందకు వెళ్లే రోడ్డు ఎలా ఉందో తెలుసుకోవాలంటే నలుగురు అధికారులతో ఆ రోడ్డుపై నుంచి వాహనాలను నడిపించాలి. నిధులు మంజూరైనా ఇంతవరకు రోడ్డు పనులు ప్రాంభించలేదు. జుక్కల్ నియోజకవర్గానికి 314 ఇందిరమ్మ ఇళ్లు కావాలని హౌసింగ్ అధికారులను కోరితే మంజురు చేయడం లేదు. బయోమెట్రిక్ మిషన్‌లో లోపాల వలన పింఛను కోసం వృద్ధులు, వితంతులు, వికలాంగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు గంటల తరబడి ఎండలో నిల బడాల్సి వస్తోంది.
-హన్మంత్ సింథే, ఎమ్మెల్యే
భవన నిర్మాణాలకు నిధుల మంజూరు లేదు
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పాఠశాలల భవనాలు స్లాబు, గోడల స్థాయిలో ఉన్నాయి. నిర్మాణాలకు నిధులు లేక మధ్యలో నిలిచిపోతున్నాయి. అధికారులు నిధులు మంజురు చేయడం లేదు.
- ఏనుగు రవీందర్ రెడ్డి, ఎమ్మెల్యే
బడ్జెట్ ఉంది.. రోడ్లేవి!
నిజామాబాద్ నగరంలో చెడిపోయిన ఆర్‌అండ్‌బీ రోడ్లకు సంబంధించి టెండర్లు పూర్తయ్యాయి. నిధులు కూడా పుష్కలంగా ఉన్నాయి. కాని ఇంతవరకు రోడ్లు వేసిన దాఖలాలు లేవు. రూ.56 కోట్లతో నగరంలో తాగునీటి పథకం పనులు పూర్తి చేశారు. మూడు నెలల నుంచి ట్రయల్ రన్ చేస్తున్నారు. నగర ప్రజలకు ఎప్పుడు నీరం దిస్తారో తెలియని పరిస్థితి ఉంది. నందిపేట్ మండలం గాదేపల్లి గ్రామ శివారులో ఉన్న గోదావరిలో 65 లక్షల చేపపిల్లలను వదిలిపెట్టారని అధికారులు అంటున్నారు. కాని నిజానికి ఒక్క చేప పిల్లలను కూడా గోదావరిలో వదిలి పెట్టలేదు. వాటిని అక్రమంగా వేరే చోటికి తరలించారు. దీనిపై విచారణకు ఆదేశించాలి. బోధన్‌లోని ఎన్‌డీఎస్‌ఎల్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.
-యెండల లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే
కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసమే
అధికారులు కాంట్రాక్టర్లను పెంచి పోషిస్తున్నారు. గతంలో పాఠశాలల్లో టాయిలెట్ నిర్మించడానికి రూ.20 వేలు ఖర్చు అయ్యేది. ఇప్పుడు రూ.8 వేలతో వ్యక్తిగత మరుగుదొడ్లు ఎలా పూర్తవుతాయి. నిర్మించినా ఉపయోగకరంగా ఉండదు. వీటి నిర్మాణాల్లో ఐసీడీఎస్,ఆర్‌డబ్ల్యూస్ అధికారుల సమన్వయ లోపం ఉంది. కాగా టీచర్ల ప దోన్నతుల, బదిలీల విషయంలో అర్హుల జాబితాను పారదర్శకంగా తయారు చేయడంలేదు. జీపీఎఫ్ వివరాలు కూడా ఆన్‌లైన్‌లో పెట్టడంలేదు.
-పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ
కాంట్రాక్టర్‌లు సిండికేట్
అవుతున్నారు
కాంట్రాక్టర్లు సిండికేట్‌గా మారి పనులను పంచుకుంటున్నారు. నగరంలో అండర్ డ్రైనేజీ పనులు నిలిచి పోయాయి, నిధుల వినియోగంలో గోల్‌మాల్ జరిగింది. దీనిపై విచారణ చేపట్టాలి. పనులను వదిలి పెట్టిన కాంట్రాక్టర్‌లకే మళ్లీ పనులను అంటగడుతున్నారు. నిజాంసాగర్ కాలువ మరమ్మతుల్లో కూడా కాంట్రాక్టర్లు సిండికేటుగా మారారు. వీటిని రద్దు చేయాలి
-అరికెల నర్సారెడ్డి, ఎమ్మెల్సీ
ఉపాధి నిధులు ల్యాప్స్
అవుతున్నాయి
గత సంవత్సరం ఉపాధిహామీ పథకంలో అధికారుల నిర్లక్ష్యంతో రూ. 20 కోట్లు ల్యాప్స్ అయ్యాయి. పనులు చేయించడంతో అధికారులు నిర్లక్ష్యం చేశారు. న్యాల్‌కల్ ప్రాజెక్టు పనులు సాగదీసి, మళ్లీ నిధులు తీసుకువచ్చిన అధికారులు టెండరు వేయకుండానే అదే కాంట్రాక్టర్‌కు అప్పగిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రజా ప్రతినిధులకు తెలియకుండానే టాయిలెట్ల ఏర్పాటుకు సర్వే జరుగుతోంది. ఇది మాకు అవమానం.
- వి. గంగాధర్‌గౌడ్, ఎమ్మెల్సీ
సమస్యల పరిష్కారానికి కృషి
ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా. 250 అంగన్‌వాడీలకు సొంత భవనాలు మంజూరయ్యాయి. పనుల్లో నాణ్యత లేకపోతే కాంట్రాక్టర్ పేరును బ్లాక్ లిస్టులో పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాను. జనవరిలోగా నగర ప్రజలకు నీరందించే బాధ్యత నాది. అధికారుల మధ్య సమన్వ యం కొరవడడంతో పనులు ముం దుకు సాగ డం లేదు. సారగంపూర్ షుగర్ ఫ్యాక్టరీ నిధులు ఎక్కడికీ తరలిపోవు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీపై ప్రజా ప్రతినిధులు చేసిన తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపిస్తా. బాన్సువాడ-బిచ్కుంద రోడ్డు పనులు ప్రారంభిస్తాం.
-ప్రద్యుమ్న, కలెక్ట
గళమెత్తిన ప్రజాప్రతినిధులు
Published Sun, Dec 8 2013 2:51 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement