ఎన్నికల్లో భాగంగా పోలీస్ కవాతు | Elections As part of police marching | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో భాగంగా పోలీస్ కవాతు

Published Sun, Mar 23 2014 1:21 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

ఎన్నికల్లో భాగంగా పోలీస్ కవాతు - Sakshi

ఎన్నికల్లో భాగంగా పోలీస్ కవాతు

 మెదక్ మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : పురపాలక సంఘ ఎన్నికల్లో నిర్వహిస్తున్న బందోబస్తులో భాగంగా పట్టణ సీఐ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో శనివారం పోలీస్ కవాతు నిరహించారు. పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన కవాతు రాందాస్ చౌరస్తా, పాత బస్టాండ్, పిల్లిడి, మార్కెట్, పెద్ద బజార్, పిట్లం బెస్ మీదుగా చమన్ చౌరస్తా, భారత్ గ్యాస్ రోడ్, హెడ్ పోస్టాఫీస్, బస్ డిపో వరకు సాగింది.

ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణంలోని 16 పోలింగ్ కేంద్రాలను అతి సమస్యాత్మకమైనవిగా గుర్తించినందున ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ కవాతులో పట్టణ ఎస్‌ఐ హన్మంతు, ఏఎస్‌ఐ రాజశేఖర్‌లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement