జిల్లా పరిషత్‌లో నామినేషన్ల దాఖలుకు బారులు తీరిన అభ్యర్థులు
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ స్థానిక సంస్థల్లో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. బుధవారం శుభ మూహూర్తం ఉండడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఘట్టం 17న ప్రారంభం కాగా.. గడిచిన రెండు రోజుల్లో కేవలం మూడు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. ఇప్పటి వరకు జిల్లాలోని 50 జెడ్పీటీసీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఇప్పటి వరకు 158 నామినేషన్లు దాఖలైనట్లు నామినేషన్ల స్వీకరణ అధికారులు తెలిపారు.
అభ్యర్థులను పోటీకి దింపే ప్రయత్నాల్లో పార్టీలకు చెందిన నేతలు కింది స్థాయి నాయకులతో మంతనాలు చేయడంలో జరుగుతున్న ఆలస్యం వల్ల నామినేషన్లు వేయడంలో జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది. గురువారం ఆఖరు రోజు అయినందున పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు తరలివస్తారని అధికారులు భావిస్తున్నారు.
పరిశీలనతో ఆలస్యం..
జెడ్పీటీసీగా పోటీ చే సే అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారికి అందించేముందు ఏఆర్‌ఓలు పరిశీలన చేసి వారి నుంచి దరావత్తు తీసుకుని రశీదు ఇస్తారు. బుధవారం నామినేషను ్ల ఏఆర్‌ఓలు సునిశితంగా పరిశీలన చేసి పలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో నామినేషన్‌లు వేసే అభ్యర్థులు మళ్లీ వస్తామని వెళ్లిపోయారు. కొంత మంది అక్కడే ఉండి అధికారులతో నింపించడంతో సమయం అంతా వృథా అయింది. దీంతో కేవలం 155 నామినేషన్ల స్వీకరణకు రాత్రి 10 గంటలు అరుుంది. మహబూబాబాద్ నుంచి పోటి చేసే అభ్యర్థులు రాత్రి 9.30 గంటలకు వచ్చి నామినేషన్లను దాఖలు చేశారు.
ఈ విషయంపై ఆరా తీయగా కొంత మంది ఇప్పుడే వచ్చారని, కొంత మంది లైన్‌లో ఉండి రశీదు తీసుకున్నారని చెప్పడం గమనార్హం. గురువారం ఆఖరి రోజు అయినందున సుమరు 300 వరకు నామినేషన్లు దాఖలవుతాయని అధికారులు భావిస్తున్నారు. నామినేషన్లు స్కృట్నీ చేయకుండా తీసుకుంటేనే సమయానికి ముగుస్తుందని పలువురు భావిస్తున్నారు.
బోణీ కాని మండలాలు...
జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమై మూడు రోజులు గడిచినా ఐదు మండలాల నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నర్సింహులపేట, దేవరుప్పుల, కొడకండ్ల, మద్దూరు. హన్మకొండ, వర్ధన్నపేట మండలాలకు చెందిన ఏ పార్టీ వారు కూడా నామినేషన్లు వేయలేదు. గురువారం ఆఖరు రోజైనందున ఈ మండలాలతో పాటు జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన అభ్యర్థులు భారీ ఎత్తున నామినేషన్లు వేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.