
చివరిరోజు భారీగా నామినేషన్లు
{పముఖుల్లో కేసీఆర్, జైపాల్‌రెడ్డి, పొన్నాల, కిషన్‌రెడ్డి, దినేష్‌రెడ్డి, ఎర్రబెల్లి
నేడు నామినేషన్ల పరిశీలన..
12న ఉపసంహరణకు ఆఖరి రోజు
హైదరాబాద్: తెలంగాణలో సాధారణ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు బుధవారం ఆఖరి రోజున పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. అన్ని రాజకీయ పార్టీల నుంచి ప్రధాన అభ్యర్థులంతా చివరిరోజునే నామినేషన్లు దాఖలు చేశారు. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను దశల వారీగా మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత , బుధవారం ఉదయం కూడా ప్రకటించడంతో ‘బీ’ ఫారాలు తీసుకోవడం, నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ యూవత్తూ హడావుడిగా సాగింది. దశమి మంచిరోజు అనే ఉద్దేశంతో పలువురు ప్రముఖులు బుధవారం వరకు వేచి చూసి నామినేషన్లు దాఖలు చే శారు. మధ్యాహ్నం మూడు గంటల వరకే గడువు కాగా.. కొన్నిచోట్ల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అరుుతే సమయంలోగా క్యూలో నిలబడినవారికి టోకెన్లు ఇచ్చి వారంతా నామినేషన్లు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. చివరిరోజున నామినేషన్లు దాఖలు చేసిన ప్రముఖుల్లో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (మెదక్ పార్లమెంటు, గజ్వేల్ అసెంబ్లీ), ఆయన కుమార్తె కవిత (నిజామాబాద్ లోక్‌సభ), కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి (మహబూబ్‌నగర్ లోక్‌సభ), టీపీసీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య (జనగామ), పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ (నిజామాబాద్ రూరల్), మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ (ఆంధోల్), మాజీ మంత్రి కె.జానారెడ్డి (నాగార్జునసాగర్), వైఎస్సార్‌సీపీ తరఫున మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి (మల్కాజిగిరి లోక్‌సభ), పీజేఆర్ కుమార్తె విజయూరెడ్డి (ఖైరతాబాద్), ఎం.ఎ.రహమాన్ (మహబూబ్‌నగర్ లోక్‌సభ), తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి (అంబర్‌పేట), బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ (సికింద్రాబాద్ లోక్‌సభ), టీడీపీ సీనియర్లు ఎర్రబెల్లి దయాకర్‌రావు (పాలకుర్తి), మోత్కుపల్లి నర్సింహులు (మధిర), సీపీఐ నాయకుడు నారాయణ (ఖమ్మం లోక్‌సభ) తదితరులు ఉన్నారు. గురువారం ఉదయం 11 గంటల నుంచీ అభ్యర్థుల నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. ఈ నెల 12 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. తెలంగాణలోని 119 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలకు ఈనెల 30వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.
నిజామాబాద్ లోక్‌సభ, నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీకి అత్యధిక నామినేషన్లు
నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి అత్యధికంగా 68 నామినేషన్లు దాఖలయ్యూరుు. అత్యల్పంగా నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానానికి 6 నామినేషన్లు దాఖలయ్యూరుు. ఇక అసెంబ్లీకి వస్తే అత్యధికంగా నిజామాబాద్ అర్బన్‌కు 55 మంది, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా ముథోల్‌కు 9 మంది నామినేషన్లు దాఖలు చేశారు.