హైదరాబాద్: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేషన్ కమిటీ సభ్యుడు సి.వినోద్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మొదట తెలంగాణ జిల్లాల్లో, ఆపై సీమాంధ్ర జిల్లాల్లో సభ్యత్వ నమోదును పూర్తి చేస్తామని తెలిపారు. మరో నెలలో తెలంగాణ జిల్లాల్లో లక్షకు పైగా సభ్యత్వం నమోదు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు.
ప్రస్తుతం ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో సభ్యత్వ నమోదు జరుగుతోందన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో నియోజకవర్గాల సమన్వయకర్తల నియామకం పూర్తయిందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో పోటీ చేసే వారందర్ని స్థానిక ప్రజలే ఎన్నుకోవాల్సి ఉంటుందని అన్నారు. సభ్యత్వం తీసుకున్న తరువాత క్రియాశీలంగా పనిచేసి స్థానికుల్లో పేరు తెచ్చుకున్నవారికే టికెట్ ఇస్తామన్నారు.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ‘ఆప్’ పోటీ
Published Fri, Jan 3 2014 3:45 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement
Advertisement