భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మన్ కీ బాత్‌లో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలుగు నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు పేరును మోదీ ప్రస్తావించారు. ఆయన వల్లే తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచస్థాయికి వెళ్లిందని గుర్తు చేసుకున్నారు.
ఏఎన్నార్ నటించిన చిత్రాల్లో మన సంప్రదాయాలు, విలువలు చక్కగా చూపించారని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రస్తుతం ప్రపంచదేశాలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు చూస్తున్నాని ప్రధాని మోదీ అన్నారు. వచ్చే ఏడాది వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. మన్ కీ బాత్‌లో మన తెలుగు సినీ దిగ్గజం నాగేశ్వరరావును ప్రశంసించండంతో టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment