
న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న క్రమంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆగస్టు 2 నుంచి 15 తేదీ వరకు వివిధ సోషల్ మీడియాల్లో తమ ప్రొఫైల్ పిక్చర్‌గా త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 91వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వివిధ అంశాలపై మాట్లాడారు. 75 ఏళ్ల స్వాతంత‍్య్రానికి గుర్తుగా దేశంలోని 75 రైల్వే స్టేషన్లకు స్వాతంత్య్ర సమరయోదుల పేర్లు పెట్టినట్లు గుర్తు చేశారు. అలాంటి స్టేషన్లను పిల్లలు సందర్శించాలని సూచించారు.
‘దేశం కోసం ప్రాణత్యాగం చేసిన షాహీద్ ఉద్ధమ్ సింగ్ జీకి సంతాపం తెలుపుతున్నాం. ఆజాదీకా అమృత్ మహోత్సవం ఒక ఉద్యమంగా సాగుతుండటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరు భాగస్వాములై.. ఆగస్టు 2-15 వరకు తమ ప్రొఫైల్ పిక్చర్‌గా మువ్వన్నెల జెండాను పెట్టుకోవాలి. అలాగే.. ఆగస్టు 13 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగమై.. మీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలి.’ అని ప్రజలను కోరారు ప్రధాని మోదీ. హిమాచల్‌ప్రదేశ్‌లో జరుగుతున్న మిజార్ మేళాను వీలైతే సందర్శించాలని ప్రజలను కోరారు మోదీ. మరోవైపు.. పీవీ సింధూ, నీరజ్ చోప్రాలకు శుభాకాంక్షలు తెలిపారు. యూకేలోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతోన్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో పాల్గొంటున్న భారత క్రీడాకారులు గొప్ప ఆట తీరును ప్రదర్శించాలని ఆకాక్షించారు.
ఇదీ చదవండి: Mann Ki Baat: ‘ఎమర్జెన్సీ’లో ప్రజాస్వామ్యాన్ని అణచే యత్నం
Comments
Please login to add a commentAdd a comment