డెహ్రాడూన్: భోజపత్ర కాలిగ్రఫీని జీవనోపాధిగా మార్చుకున్న ఉత్తరాఖండ్‌లోని నీతి–మనా లోయ మహిళలను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆదివారం ‘మన్ కీ బాత్’లో వారి కృషిని ఆయన ప్రస్తావించారు. ‘పురాతన కాలంలో మహాభారతాన్ని భోజపత్రపైనే రాశారు. మన సంస్కృతిలో భాగమైన భోజపత్రతో నీతి–మనా లోయ మహిళలు కళాఖండాలు, సావనీర్లు రూపొందిస్తున్నారు. దీనితో తమ జీవితాలనే మార్చేసు కున్నా రు’అని కొనియాడారు.
ఈ లేఖనాలను అందరూ ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నార న్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సాంస్కృతిక వారసత్వాన్ని ఉపయోగించుకోవడం అభినందనీయమన్నారు. వీరి కృషి కారణంగా ఈ ప్రాంతం పర్యాటకపరంగా ప్రాచుర్యంలోకి వచ్చిందన్నారు. అక్టోబర్‌లో చైనా సరిహద్దు సమీపంలోని బద్రీనాథ్‌ను సందర్శించిన సమయంలో స్థానిక మహిళ ఒకరు అందమైన భోజపత్ర లేఖనాన్ని బహుమతిగా అందేజేసినట్లు గుర్తుకు తెచ్చుకున్నారు. నీతి–మనా లోయలోని మనా గ్రామాన్ని ప్రధాని మోదీ అప్పట్లో మొట్టమొదటి భారతీయ గ్రామంగా అభివర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment