కోల్‌కతా: ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం నాశనం చేస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. ‘ఇంధన ధరలు రోజు రోజుకీ పైకెగబాకుతున్నా కేంద్రం ప్రభుత్వం లో చలనం లేదు. మన ప్రధానమంత్రి మాత్రం ‘మన్‌కీ బాత్’తో బిజీ అయిపోయారు. అందుకు బదులుగా ఆయన ‘పెట్రోల్, వ్యాక్సిన్‌కీ బాత్’నిర్వహిస్తే బాగుంటుంది’ అని ఎద్దేవా చేశారు.
బీజేపీ ఎంపీ జాన్ బార్లాను కేబినెట్‌లోకి తీసుకో వచ్చన్న వార్తలపై ఆమె స్పందిస్తూ..ఉత్తర బెంగాల్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలంటూ బార్లా డిమాండ్ చేసిన కొన్ని రోజులకే మంత్రి పదవి లభించింది. దీనిని బట్టి కాషాయపార్టీ విభజన రాజకీయాలు అవగతమవు తున్నాయి’ అని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment