
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాధికారక కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను భారత్ ఓడించాలంటే పౌరులంతా స్వీయ క్రమశిక్షణతో, అప్రమత్తతో వ్యవహరించాలని ప్రధాని మోదీ హితవు పలికారు. వైరస్‌పై యుద్ధంలో పై చేయి సాధించాలంటే పౌరుల వ్యక్తిగత అప్రమత్తతే అసలైన బలమని ఆయన వ్యాఖ్యానించారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రేడియోలో ప్రధాని మోదీ దేశంలోని తాజా స్థితిగతులపై తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాల్లో కొన్ని..
► ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న టీకా ప్రక్రియలతో పోలిస్తే భారత్ కోవిడ్ వ్యాక్సినేషన్ రేటులో అద్భుతమైన పురోగతిని సాధించింది. అయినాసరే, ప్రజలు ఒమిక్రాన్ విషయంలో
జాగ్రత్తవహించాల్సిందే.
►ఒమిక్రాన్ గుట్టుమట్లను తెల్సుకునేందుకు మన శాస్త్రవేత్తలు అనుక్షణం పరిశోధనలు కొనసాగిస్తున్నారు. దీంతో అందివస్తున్న కొత్త విషయాలు, సమాచారానికి తగ్గట్లు కేంద్రప్రభుత్వం సైతం తగు చర్యలకు పూనుకుంటోంది
►మహమ్మారిగా పరిణమించిన కోవిడ్‌ను ఎదుర్కోవడంలో 2019 నుంచీ మన రెండేళ్ల అనుభవం ఎంతగానో దోహదపడుతోంది. అందుకే ‘దేశ ఆరోగ్య పరిస్థితి’చేయిదాటిపోకుండా అడ్డుకోగలిగాం. ఇదంతా మన సమష్టి కృషి ఫలితమే. ఇంతే బాధ్యతాయుతంగా ఉంటూ 2022 కొత్త ఏడాదిలోకి అడుగుపెడదాం.
►వ్యాక్సినేషన్‌లో 141 కోట్ల మైలురాయిని దాటేశాం. ఇదంతా ప్రతీ ఒక్క భారతీయుడి విజయం. వ్యవస్థపై, శాస్త్రంపై, శాస్త్రవేత్తలపై భారతీయులు పెట్టుకున్న విశ్వాసానికి నిదర్శనం.
►ప్రతీ ఏడాదిలాగే ఈసారీ ‘పరీక్షా పే చర్చ’కార్యక్రమం ద్వారా ప్రతీ విద్యార్థితో మాట్లాడతాను. Myజౌఠి. జీn ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోండి.
► భిన్నజీవ జాతులకు నెలవైన అరుణాచల్ ప్రదేశ్‌లో పక్షుల వేటను ఆపేస్తూ ఎయిర్‌గన్‌లను ప్రజలు స్వచ్ఛందంగా త్యజించడం గొప్ప మార్పు.
►కూనూర్‌లో వాయుసేన హెలికాప్టర్ కూలిన ఘటనలో తీవ్రంగా గాయపడి తుదివరకు పోరాడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్.. శౌర్య చక్ర వంటి పురస్కారాలు సాధించినా తన మూలాలను మర్చిపోలేదు. తన పాఠశాల విద్యకు సంబంధించిన వివరాలతో వరుణ్ సింగ్ రాసిన ఉత్తరాన్ని మోదీ గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment