మీ తల్లి పేరుతో మొక్కను నాటండి: ప్రధాని మోదీ | pm narendra modi mann ki baat 111 episode speech details | Sakshi
Sakshi News home page

మీ తల్లి పేరుతో మొక్కను నాటండి: ప్రధాని మోదీ

Published Sun, Jun 30 2024 12:53 PM | Last Updated on Sun, Jun 30 2024 1:20 PM

pm narendra modi mann ki baat 111 episode speech details

ఢిల్లీ: ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 111వ ఎపిసోడ్‌ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ఆదివారం పలు అంశాలపై మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం మోదీ పాల్గొన్న తొలి మన్‌ కీ బాత్‌ కార్యక్రమం. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడారు.  

మన్‌ కీ బాత్‌ కార్యక్రమం 111వ ఎపిసోడ్‌ దార్వా మరోసారి మీ ముందుకు వచ్చాను. ఫిబ్రవరిలో చెప్పినట్లుగానే మళ్లీ  మీ ముందుకు వచ్చాను.  మా ప్రభుత్వంపై ప్రజలు పూర్తి విశ్వాసం చూపించారు. దేశంలో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. రుతుపవనాలు రాక ప్రజలంతా సంతోషంగా ఉన్నారు.

 

ఎన్నికల కారణంగా మన్‌ కీ బాత్‌ కార్యక్రమం కొన్ని నెలల పాటు ఆగిపోయింది. కానీ దాని లక్ష్యం మాత్రం దేశంలో కొనసాగుతోంది. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలు ప్రపంచంలోనే చాలా పెద్దవి. సుమారు 65 కోట్ల మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ విషయంలో తాను కేంద్ర ఎన్నికల సంఘాన్ని అభినందిస్తున్నానని తెలిపారు.

 


ఈరోజు చాలా ప్రాధాన్యం  ఉన్న రోజు. మన గిరిజన సోదరసోదరీమణులు ఈరోజును ‘హల్‌ దివాస్‌’గా జరుపుకుంటారు. వీర్‌ సిధు, కాన్హూలకు సంబంధించిన రోజు. వారు బ్రిటిష్‌ వారి వివక్ష చట్టాలు, నిబంధనలను వ్యతిరేకిస్తూ సంతాలి ప్రజలకు కోసం  పోరాటం చేశారని గుర్తు చేశారు.

 

పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ప్లాంట్‌ ఫర్‌ మదర్‌’ పేరుతో కొత్త ప్రచారం చేపడుతున్నాం. అమ్మ పేరుతో నేను ఒక మొక్క నాటాను. మీరు మీ తల్లితో లేదా, మీ అమ్మ పేరుతో మొక్కను నాటండి’ అని అన్నారు.

 

అదే విధంగా ఒలింపిక్స్‌లో  మన దేశ క్రీడాకారులు మంచి ప్రదర్శన చేస్తారని ఆశిస్తున్నాను. ‘చీర్‌4భారత్‌’ హ్యాష్‌ ట్యాగ్‌తో  ఆటగాళ్లను ప్రజలు ప్రోత్సహించాలన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement