‘ఈ దుస్తులు కొనండి’.. ప్రధాని మోదీ | PM Modi announced Khadi Gramodyog business surpassing Rs 1.5 lakh crore | Sakshi
Sakshi News home page

Mann Ki Baat: ‘ఈ దుస్తులు కొనండి’.. ప్రధాని మోదీ

Published Mon, Jul 29 2024 2:46 PM | Last Updated on Mon, Jul 29 2024 3:56 PM

PM Modi announced Khadi Gramodyog business surpassing Rs 1.5 lakh crore

గ్రామాల్లో తయారుచేస్తున్న ఖాదీ వల్ల దేశవ్యాప్తంగా రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారం సాగుతుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహిళల్లో పెరుగుతున్న ఆదరణ, ఉద్యోగాల కల్పన కారణంగా 400 శాతం ఖాదీ, చేనేత దుస్తుల అమ్మకాలు పెరిగాయని పేర్కొన్నారు. భారత పౌరులు ఖాదీ దుస్తులు కొనుగోలు చేయాలని మన్ కీ బాత్ ప్రసారంలో భాగంగా మోదీ పౌరులకు సూచించారు.

ప్రధాని నరేంద్ర మోదీ మన్‌ కీ బాత్‌లో మాట్లాడుతూ..‘దేశవ్యాప్తంగా గ్రామాల్లో తయారుచేస్తున్న ఖాదీ వ్యాపారం తొలిసారిగా రూ.1.5 లక్షల కోట్లకు చేరింది. గతంతో పోలిస్తే వీటి విక్రయాలు 400 శాతం పెరిగాయి. ఖాదీ, చేనేత విక్రయాలు పెరిగి పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఈ పరిశ్రమ పురోగతి వల్ల దీనిపై ఎక్కువగా ఆధారపడిన మహిళలకు ప్రయోజనం చేకూరుతోంది. ఇంతకుముందు ఖాదీ ఉత్పత్తులను ఉపయోగించని చాలా మంది ప్రజలు ఇప్పుడు గర్వంగా వీటిని ధరిస్తున్నారు. ఇప్పటి వరకు ఖాదీ దుస్తులు కొనకపోతే వాటిని కొనడం ప్రారంభించండి’ అని మోదీ చెప్పారు.

ఇదీ చదవండి: అప్పు చెల్లించని వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌!

ఇదిలాఉండగా, ప్రభుత్వం చేనేత, ఖాదీ ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహకాలు అందించాలని మార్కెట్‌ వర్గాలు కోరుతున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో నేషనల్‌ హ్యాండ్యూమ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ కోసం రూ.200 కోట్లు కేటాయించారు. రానున్న బడ్జెట్‌లో ఆ నిధులను పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ విధానాలతో గార్మెంట్‌ ఉత్పత్తులు తయారుచేస్తున్న కార్పొరేట్‌ కంపెనీలకు వెంటనే నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉండకపోవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement