మణిపూర్ అల్లర్లు మొదలై నెల రోజులు దాటుతోంది. కానీ ఇంతవరకు ప్రధానమంత్రి నోరు మెదపలేదు. ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు, అఖిలపక్షాల వారిని ఎందుకు పిలిచి మాట్లాడలేదని ప్రశ్నించారు కాంగ్రెస్ అధినేత మల్లిఖార్జున్ ఖర్గే. "మన్ కీ బాత్"లో ముందు "మణిపూర్ కీ బాత్" గురించి మాట్లాడండని ధ్వజమెత్తారు.
మే 3న మొదలైన మణిపూర్ అల్లర్లలో సుమారుగా 80 మంది ప్రాణాలు కోల్పోయారు. మెయిటీ వర్గానికి ఎస్టీల్లో చేర్చాలన్న ప్రతిపాదన విషయమై రాజుకున్న గొడవల్లో కుకీ వర్గానికి, మెయిటీ వర్గానికి తీవ్ర ఘర్షణలు జరిగాయి. ఊహించని ప్రాణనష్టం తోపాటు భారీగా ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. మధ్యలో కొద్దిరోజులు శాంతించిన ఇరువర్గాలు ఇప్పుడు మళ్ళీ విజృంభిస్తున్నాయి. ఒకపక్క ఈశాన్య రాష్ట్రంలో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతుంటే భారత ప్రధాని నరేందర్ మోదీ మాత్రం చలనం లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు మల్లిఖార్జున్ ఖర్గే.
మణిపూర్ కీ బాత్..
ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. మొదట మీ "మన్ కీ బాత్"లో "మణిపూర్ కీ బాత్"ని చేర్చండి. సరిహద్దు రాష్ట్రంలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. మీరు ఇంతవరకు నోరు విప్పింది లేదు, ఒక సమావేశం నిర్వహించింది లేదు, అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది లేదు. మణిపూర్ భారత్ దేశానికి చెందినది కాదనుకుంటున్నారా.. ఇది సహించదగినది కాదు. రాష్ట్రం తగలబడిపోతుంటే పట్టించుకోరా? రాజధర్మాన్ని అనుసరించండి. శాంతికి భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించండి. ప్రజల్లో ధైర్యాన్ని నింపుతూ సాధారణ పరిస్థితులను నెలకొల్పండి. రాష్ట్రంలో పరిస్థితిని మెరుగుపరచడానికి అఖిలపక్షాలను ఆహ్వానించండని రాశారు.
.@narendramodi ji,
Your ‘𝐌𝐚𝐧𝐧 𝐊𝐢 𝐁𝐚𝐚𝐭’ should have first included ‘𝐌𝐚𝐧𝐢𝐩𝐮𝐫 𝐊𝐢 𝐁𝐚𝐚𝐭’, but in vain.
The situation in the border state is precarious and deeply disturbing.
▫️You have not spoken a word.
▫️You have not chaired a single meeting.
▫️You have…
— Mallikarjun Kharge (@kharge) June 18, 2023
ఇది కూడా చదవండి: మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తత... కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ జవాను మృతి
Comments
Please login to add a commentAdd a comment