ఢిల్లీ: ప్రధాని మోదీ నేడు(ఆదివారం) మన్‌కీ బాత్ 104వ ఎపిసోడ్‌లో ముచ్చటించారు. ఈ సందర్భంగా చంద్రయాన్-3 విజయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్-3 ప్రాజెక్టు మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచిందని ప్రశంసించారు. అలాగే, జీ-20 సమావేశాలపై మాట్లాడారు.
కాగా, మోదీ మన్‌కీ బాత్‌లో మాట్లాడుతూ.. సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగే జీ-20 సమావేశాలకు భారత్ సిద్ధమవుతోందన్నారు. భారత్ జీ-20 అధ్యక్షత బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి గర్వించదగిన పరిణామాలు చాలా చోటు చేసుకున్నయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 40 దేశాలకు చెందిన ప్రతినిధిలు హాజరుకానున్నారని వెల్లడించారు. తొలిసారి భారత్ ఈ స్థాయి జీ-20లో భాగస్వామి అవుతోందని.. గ్రూపును మరింత బలోపేతం చేస్తుందన్నారు. జీ-20కి భారత్ నేతృత్వం అంటే.. ప్రజలే అధ్యక్షత వహిస్తున్నట్లు భావించాలని మోదీ స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు ఈ సదస్సులు జరిగిన నగరాల్లో ప్రజలు విదేశీ అతిథులను సాదరంగా ఆహ్వానించారు. భారత్‌లోని వైవిధ్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని చూసి విదేశీ అతిథులు చాలా ప్రభావితమయ్యారు. భారత్‌కు చాలా ఉజ్వల భవిష్యత్తు ఉందని వారు తెలుసుకొన్నారు. జీ-20 సదస్సు శ్రీనగర్‌లో జరిగిన తర్వాత పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.
During his 104th episode of Mann Ki Baat, Prime Minister Narendra Modi says, "The month of September is going to witness the potential of India. India is fully prepared for the G-20 Leaders Summit. Heads of 40 countries & many global organisations will be coming to Delhi to… pic.twitter.com/lgEdcd7XMy
— ANI (@ANI) August 27, 2023
అలాగే, ప్రపంచ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘సంస్కృత భారతీ’ ఆధ్వర్యంలో ‘సంస్కృతంలో మాట్లాడే క్యాంప్’ నిర్వహిస్తారు. ప్రజలకు ఈ భాషను బోధించడంలో భాగంగా జరిగే క్యాంపులో మీరూ పాల్గొనవచ్చు. సంస్కృతం అందరూ నేర్చుకోవాలన్నారు. అంతేకాదు.. తెలుగు కూడా సంస్కృతంలా పురాతనమైన భారతీయ భాష. ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలిపారు.
During his 104th episode of Mann Ki Baat, Prime Minister Narendra Modi says, "From the Red Fort I had said that we have to strengthen women-led development as a national character. Where the capability of women's power is added impossible is made possible. Mission Chandrayaan is… pic.twitter.com/6K7TE81dVh
— ANI (@ANI) August 27, 2023
Comments
Please login to add a commentAdd a comment