సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనలో కీలకమైన సచివాలయంలో ఇరు రాష్ట్రాలకు బ్లాకుల కేటాయింపుతో పాటు ఏ పనులు ఎప్పటిలోగా పూర్తి చేయాలనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, అలాగే సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి శివశంకర్ వేర్వేరుగా అంతర్గత మెమోలు జారీ చేశారు. ఏ, బీ, సీ, డీ బ్లాకులను తెలంగాణ ప్రభుత్వానికి, సౌత్ హెచ్, నార్త్ హెచ్, జె. కె. ఎల్ బ్లాకులను సీమాంధ్ర ప్రభుత్వానికి కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సీమాంధ్ర సీఎం కార్యాలయానికి కేటాయించిన సౌత్ హెచ్ బ్లాకులో పనులన్నింటినీ ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాల్సిందిగా సీఎస్ ఆదేశించారు. ఈ బ్లాకులో ఉన్న ఆంధ్రా బ్యాంకును జె బ్లాకులోని పాత స్థలానికి తరలించాలని స్పష్టం చేశారు.
సౌత్ హెచ్ బ్లాకు ప్రధాన ద్వారాన్ని ఆంధ్రాబ్యాంకు వైపునకు మార్చాలని సూచించారు. సౌత్ హెచ్ బ్లాకులోని రెండో అంతస్తును సీమాంధ్ర ముఖ్యమంత్రి కార్యాలయంగా తీర్చిదిద్దాలని, అందుకు అవసరమైన చేర్పులు మార్పులు వచ్చే 15వ తేదీకల్లా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం హెలిపాడ్ పక్కనే ఉన్న స్కూల్‌ను తొలగించి అక్కడ తెలంగాణ ప్రభుత్వ రాకపోకలకు గేట్లను ఏర్పాటు చేయాలని, దీన్ని కూడా 15వ తేదీ కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. స్కూల్‌ను ఎ బ్లాకు వెనక ప్రాంతానికి తరలించాలన్నారు. సౌత్ హెచ్ బ్లాకులో గల హోమియో డిస్పెన్సరీని డి బ్లాకుకు తరలించాలని, మింట్ కాంపౌండ్ వైపు ఖాళీగా ఉన్న స్థలాన్ని తీసుకుని అప్రోచ్ రహదారి నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.
15లోగా సీమాంధ్ర సీఎం కార్యాలయం సిద్ధం!
Published Sun, May 4 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 AM
Advertisement
Advertisement