
తమ సోషల్ మీడియా అకౌంట్‌లు హ్యాక్ అయ్యాయంటూ చెబుతున్న హీరోయిన్‌ల సంఖ్య పెరుగుతోంది. రెండు, మూడు రోజుల క్రితమే త్రిష తన ట్విట్టర్ ఖాతాని ఎవరో ఆగంతకులు హ్యాక్ చేశారని తెలిపింది. ఇప్పుడు ఈ కోవలోకి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేరారు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని రకుల్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తన అకౌంట్ నుంచి వచ్చే సందేశాలకు స్పందించవద్దంటూ రకుల్ అభిమానులను కోరారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రకుల్ కార్తీ దేవ్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.
Hey guys !! My Instagram account has been hacked ! Please do not respond to any links or messages till it’s recovered !! Thanks
— Rakul Preet (@Rakulpreet) October 24, 2018
Comments
Please login to add a commentAdd a comment