అన్నాడీఎంకేకు చెందిన వెబ్‌సైట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. అందులో పాకిస్థాన్ జిందాబాద్ వంటి నినాదాలు పొందుపరిచారు. దీంతో ఆ వెబ్‌సైట్ సేవలను తాత్కాలికంగా నిలిపేశారు.విచారణ కు సైబర్ క్రైం రంగంలోకి దిగింది.సాక్షి, చెన్నై: వె బ్‌సైట్ల మీద ఆధారపడే వారి సంఖ్య ఆధునిక యుగంలో పెరిగింది. సమాచార మార్గాలుగా అనేక వెబ్‌సైట్లు మారాయి. ఈ అవకాశాల్ని రాజకీయ పార్టీలు అందిపు చ్చుకున్నాయి. ప్రభుత్వ, ప్రరుువేటు రంగ సం స్థలకు సంబంధించిన వెబ్‌సైట్లు కోకొల్లలుగా ఆన్‌లైన్‌లో ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని రాజకీ య పార్టీలకూ అధికారిక వెబ్‌సైట్లు ఉన్నాయి. వీటి ద్వారా తమ సమాచారం, సంక్షేమ కార్యక్రమాలు, సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నారుు. గుర్తు తెలియని వ్యక్తులు తరచూ వెబ్‌సైట్ల హ్యాకింగ్‌కు పాల్పడుతున్నారు. ఇటీవల చెన్నై పోలీసు కమిషనరేట్ వెబ్‌సైట్ హ్యాకింగ్ కు గురైంది. దీనికి పాల్పడ్డ వారెవరో ఇంత వరకు గుర్తించలేదు. ఈ పరిస్థితుల్లో అధికార పక్షానికి చెందిన వెబ్‌సైట్ సైతం హ్యాక్ కావ డం చర్చనీయాంశంగా మారింది.
విచారణ ప్రారంభం:అన్నాడీఎంకే నేతృత్వంలో ఏఐఏడీఎంకే ఆల్ ఇండియా.ఆర్గ్ వెబ్‌సైట్ ఉంది. ఇందులో పార్టీ కార్యక్రమాలు, ఫొటో లు, వివరాలను ఎప్పటికప్పుడు పొందుపరుస్తున్నారు. ఈ వెబ్‌సైట్ రెండు రోజుల క్రితం హ్యాక్ కావడాన్ని ఆ పార్టీ వర్గాలు గుర్తించాయి. అందులో పాకిస్థాన్ జెండాతో కూడిన పుర్రె బొమ్మను, పాకిస్థాన్ జిందాబాద్, ఇస్లాం జిందాబాద్ వంటి నినాదాల్ని పొందుపరిచారు. తమకు న్యాయం కావాలని, శాంతి కావాలని అందుకే హ్యాక్ చేశామంటూ ప్రకటించి ఉన్నారు. ఈ విషయూన్ని అన్నాడీఎంకే నేతలు చెన్నై పోలీసు కమిషనర్ జార్జ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సైబర్ క్రైం రంగంలోకి దిగింది. అలాగే క్రైం బ్రాంచ్ సైతం విచారణ చేపట్టింది. వెబ్‌సైట్ సేవల్ని తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఈ వెబ్‌సైట్‌ను ఎక్కడి నుంచి హ్యాక్ చేశారు, దీని వెనుక ఎవరున్నారనే విషయూలపై విచారణ సాగుతోంది.
అన్నాడీఎంకే వెబ్‌సైట్ హ్యాక్
Published Tue, Nov 5 2013 3:41 AM | Last Updated on Sat, Mar 23 2019 8:37 PM
Advertisement