
అమెరికా ప్రభుత్వశాఖల కంప్యూటర్ నెట్‌వర్క్ హ్యాకింగ్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్తో పాటు వివిధ సంస్థలు, విదేశాంగ శాఖ, తపాలా శాఖ, జాతీయ వాతావరణ శాఖలకు చెందిన కంప్యూటర్ నెట్‌వర్క్‌లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. దీంతో తమ నెట్‌వర్క్‌లను తాత్కాలికంగా షట్‌డౌన్ చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. అధికారిక రహస్య సమాచారానికి సంబంధించిన కంప్యూటర్ నెట్‌వర్క్‌లు మాత్రం హ్యాకింగ్‌కు గురికాలేదని తెలిపింది.
బహిరంగ సమాచారంతో కూడిన ఈ-మెయిల్ వ్యవస్థలపైనే హ్యాకర్లు దాడి చేశారని పేర్కొంది. హ్యాకింగ్‌కు పాల్పడిన వారి గురించి ఇంకా తెలియదని తెలిపింది. ఈ-మెయిల్ వ్యవస్థలను సోమవారం తిరిగి పునరుద్ధరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
**