ఆ 10 కోట్లలో మీరూ ఉన్నారేమో చెక్ చేశారా? | OvOver 100 million LinkedIn profiles hacked: Here’s a quick way to find out if you’re one of them | Sakshi
Sakshi News home page

ఆ 10 కోట్లలో మీరూ ఉన్నారేమో చెక్ చేశారా?

Published Mon, May 30 2016 4:50 PM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM

ఆ 10 కోట్లలో మీరూ ఉన్నారేమో చెక్ చేశారా?

ఆ 10 కోట్లలో మీరూ ఉన్నారేమో చెక్ చేశారా?

కాలిఫోర్నియా : లింక్డ్ ఇన్ మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న విద్యాధికులు, ప్రముఖులకు పరిచయం అక్కర్లేని పేరు. మిలియన్ల కొద్దీ యూజర్లు రిజస్టర్ అయి ఉన్న ఈ ప్రముఖ సోషల్‌ నెట్ వర్కింగ్  సైట్‌ ,  కెరియర్ ఓరియెంటెడ్  ప్లాట్ ఫాం ఖాతాలు ఇపుడు ప్రమాదంలో పడ్డాయి. దాదాపు 10కోట్ల( 100 మిలియన్  ప్రొఫైల్స్)కు పైగా  ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయని  తాజా నివేదికలు వెల్లడి చేశాయి.  దీంతో వెంటనే అప్రమత్తమైన లింక్డ్ ఇన్   స్వయంగా  సంస్థ ప్రతి ఖాతాదారుడిని  ఈమెయిల్స్ ద్వారా  అలర్ట్ చేసింది.  

 100 మిలియన్‌ లింక్డ్ ఇన్  ప్రొఫైళ్లకు చెందిన ఈమెయిల్‌ డాటాబేస్‌లు, పాస్‌వర్డ్‌లు హ్యాక్‌ అయ్యాయని అవి ఆన్‌లైన్‌లో అందరికీ కనిపించేలా అందుబాటులోకి వచ్చాయని నివేదికలు చెబుతున్నాయి. దీంతో  అప్రమత్తమైన  సంస్థ, 167మిలియన్ల ప్రొఫైల్స్,వ్యక్తిగత వివరాలు  హ్యాక్ అయ్యాయని అంగీకరించింది.  దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.  ఈ మేరకు ఖాతాదారులను ఈ మెయిల్ ద్వారా  అప్రమత్తం చేసింది.    పాస్ వర్డ్స్ ను  రద్దుచేశామని.. రీసెట్ చేసుకోవాలని కోరింది.  400 మిలియన్‌ యూజర్లకు పాస్‌వర్డ్‌ల విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని బలమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ నిపుణుడు  ట్రాయ్ హంట్   ఈ ఖాతాల   సేఫ్టీని కనుగొనేందుకు సహాయపడేలా హేవ్ ఐ బీన్ పీఓన్డ్  అనే వెబ్ సైట్ ను క్రియేట్ చేశారు.  దీని  సహాయంతో  మన ఖాతాను చెక్  చేసుకోవచ్చని సూచించారు.

కాగా 2009లో లాంచ్ అయిన  లింక్డ్ ఇన్ 2012 లో హ్యా కింగ్ బారిన పడింది.  6.5 మిలియన్ల ప్రొఫైల్స్ ను  రష్యాలోని సైబర్‌ క్రిమినల్స్‌ హ్యాక్‌ చేశారు. ఆ తర్వాత సుమారు  4 సంవత్సరాల తర్వాత  మళ్లీ ఇంత పెద్ద మొత్తంలో ప్రొఫైళ్లు హ్యాకవ్వడం ఇదే తొలిసారి అని సైబర్ నిపుణలు వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement