దేశంలో రోజురోజుకీ సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా, అధికారులు, కంపెనీలు ఇలా అన్నీ సైబర్‌లో వలలో చి కుటున్నాయి. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అధికారిక యూట్యూబ్ ఛానల్ శుక్రవారం హ్యాక్‌కు గురైంది. యూట్యూబ్ ఛానల్‌ను హ్యాక్ చేసిన నేరగాళ్లు.. అందులో క్రిప్టో కరెన్సీని ప్రమోట్ చేస్తున్నట్లుగా ఉన్న వీడియోలను పోస్టు చేశారు.
సాధారణంగా ఈ యూట్యూబ్ ఛానల్‌ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించే వాటితో పాటు కొన్ని కీలక కేసులను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ఆ వీడియోలకు బదులుగా అందులో ప్రస్తుతం అమెరికాకు చెందిన రిపిల్ ల్యాబ్స్ అభివృద్ధి చేసిన క్రిప్టో కరెన్సీ ఎక్స్ఆర్పీని ప్రచారం చేసే వీడియోలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అప్రమత్తమైన సుప్రీంకోర్టు ఐటీ విభాగం చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment