LinkedIn profiles
-
భారత్‌లో కొత్త కొలువుల సందడి..
సాక్షి, న్యూఢిల్లీ : వేగంగా మారుతున్న ఆర్థిక వ్యవస్థలో పరిశ్రమలు, మార్కెట్లు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. భారత్‌లో ప్రముఖంగా ముందుకొచ్చిన టాప్ 10 ఉద్యోగాల జాబితాను లింకెడ్ఇన్ విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం మెషీన్ లెర్నింగ్ ఇంజనీర్ అగ్రస్ధానంలో నిలిచింది. అప్లికేషన్ డెవలప్మెంట్ అనలిస్ట్, బ్యాకెండ్ డెవలపర్ తర్వాతి స్ధానాల్లో ఉండగా, ఫుల్‌స్టాక్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, కస్టమర్ సక్సెస్ మేనేజర్, డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, బిగ్ డేటా డెవలపర్, సేల్స్ రిక్రూటర్, పైథాన్ డెవలపర్లు తదుపరి హాట్ జాబ్స్‌గా టాప్ 10 జాబితాలో చోటుదక్కించుకున్నాయి. టెక్నాలజీ కొలువులకు భారీ డిమాండ్ నెలకొన్నా ఇవి కేవలం టెక్నాలజీ కంపెనీలకే పరిమితం కాలేదని నివేదిక పేర్కొంది. ఫార్మా, బ్యాంకింగ్, రిటైల్ సహా పలు రంగాలకు చెందిన కంపెనీల్లో టెక్నికల్ జాబ్స్‌కు భారీ డిమాండ్ ఉందని, ఏటా ఈ కొలువుల్లో 50 లక్షల మంది చేరుతున్నాయని అంచనా వేసింది. భారత్‌లో 5 కోట్ల మంది తమ సభ్యుల ప్రొఫైల్ అనుభవాలను విశ్లేషించిన లింకెడ్ఇన్ ఈ నివేదికను వెల్లడించింది. సాంకేతిక రంగంలో దూసుకెళ్లేందుకు సాఫ్ట్‌స్కిల్స్ కీలకంగా మారాయని లింకెడ్ఇన్ టాలెంట్, లెర్నింగ్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఫియోన్ యాంగ్ వెల్లడించారు. -
ఆ 10 కోట్లలో మీరూ ఉన్నారేమో చెక్ చేశారా?
కాలిఫోర్నియా : లింక్డ్ ఇన్ మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న విద్యాధికులు, ప్రముఖులకు పరిచయం అక్కర్లేని పేరు. మిలియన్ల కొద్దీ యూజర్లు రిజస్టర్ అయి ఉన్న ఈ ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ , కెరియర్ ఓరియెంటెడ్ ప్లాట్ ఫాం ఖాతాలు ఇపుడు ప్రమాదంలో పడ్డాయి. దాదాపు 10కోట్ల( 100 మిలియన్ ప్రొఫైల్స్)కు పైగా ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయని తాజా నివేదికలు వెల్లడి చేశాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన లింక్డ్ ఇన్ స్వయంగా సంస్థ ప్రతి ఖాతాదారుడిని ఈమెయిల్స్ ద్వారా అలర్ట్ చేసింది. 100 మిలియన్ లింక్డ్ ఇన్ ప్రొఫైళ్లకు చెందిన ఈమెయిల్ డాటాబేస్‌లు, పాస్వర్డ్లు హ్యాక్ అయ్యాయని అవి ఆన్లైన్లో అందరికీ కనిపించేలా అందుబాటులోకి వచ్చాయని నివేదికలు చెబుతున్నాయి. దీంతో అప్రమత్తమైన సంస్థ, 167మిలియన్ల ప్రొఫైల్స్,వ్యక్తిగత వివరాలు హ్యాక్ అయ్యాయని అంగీకరించింది. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు ఖాతాదారులను ఈ మెయిల్ ద్వారా అప్రమత్తం చేసింది. పాస్ వర్డ్స్ ను రద్దుచేశామని.. రీసెట్ చేసుకోవాలని కోరింది. 400 మిలియన్ యూజర్లకు పాస్‌వర్డ్‌ల విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని బలమైన పాస్వర్డ్లు పెట్టుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ నిపుణుడు ట్రాయ్ హంట్ ఈ ఖాతాల సేఫ్టీని కనుగొనేందుకు సహాయపడేలా హేవ్ ఐ బీన్ పీఓన్డ్ అనే వెబ్ సైట్ ను క్రియేట్ చేశారు. దీని సహాయంతో మన ఖాతాను చెక్ చేసుకోవచ్చని సూచించారు. కాగా 2009లో లాంచ్ అయిన లింక్డ్ ఇన్ 2012 లో హ్యా కింగ్ బారిన పడింది. 6.5 మిలియన్ల ప్రొఫైల్స్ ను రష్యాలోని సైబర్ క్రిమినల్స్ హ్యాక్ చేశారు. ఆ తర్వాత సుమారు 4 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇంత పెద్ద మొత్తంలో ప్రొఫైళ్లు హ్యాకవ్వడం ఇదే తొలిసారి అని సైబర్ నిపుణలు వ్యాఖ్యానించారు.