రోజు రోజుకి టెక‍్నాలజీ అభివృద్ది చెందుతుంది. అయితే అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నే నష్టాలు ఉన్నాయని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మనం వాడే గాడ్జెట్స్ అంటే మొబైల్స్, కంప్యూటర్, స్మార్ట్ వాచెస్ వినియోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని అంటున్నారు. చదవండి: దేశంలో ఇళ్ల ధరలు పెరిగాయ్
ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగిపోయింది. కానీ వినియోగదారులు ఒక్కోసారి పూర్తిగా అవగాహాన లేకుండా ఫోన్ వినియోగించడంతో హ్యాకర్స్ దీన్ని అస్త్రంగా మార్చుకుంటున్నారు. భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయడం, లేదంటే వ్యక్తిగత సమాచారాన్ని బహిర్ఘతం చేసి రోడ్డు కీడ్చుతున్నారు. ఇలాంటి సమయాల్లో ఫోన్‌ను హ్యాక్ అయ్యేందో? లేదో తెలుసుకొని అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని టెక్ నిపుణులు సలహా ఇస్తున‍్నారు. ఇప్పుడు మన ఫోన్ హ్యాక్ అయ్యిందో? లేదో? తెలుసుకుందాం.
హ్యాక్ అయిన ఫోన్ గుర్తించండి ఇలా!:
♦మీరు ఫోన్‌ను జాగ్రత్తగానే ఉంచుకుంటారు. కానీ ఒక్కోసారి బ్యాటరీ ఛార్జీంగ్ అయిపోతుంది. అలా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోవడానికి కారణం హ్యాకింగ్‌కు గురైందని అర్ధం చేసుకోవాలి. వెంటనే వ్యక్తిగత సమాచారాన్ని స్టోర్ చేసుకొని, బ్యాటరీ మార్చుకోవాలి.
♦ఒక్కోసారి ఫోన్ డెడ్ అవుతుంటుంది. ఇలాఫోన్ డెడ్ కావడానికి హ్యాకర్లు మాల్ వేర్ ను మన సెల్ ఫోన్ లోకి సెండ్ చేస్తారు. అలా వచ్చిన మాల్ వేర్ ఫోన్ లో ఉన్న సమాచారాన్ని సేకరిస్తారు.
♦ ఒక్కోసారి మీ ఫోన్ నుంచి టెక్ట్స్, కాల్స్ చేయలేరు. అలా వస్తున్నాయంటే సైబర్ నేరస్తులు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున‍్నట్లే లెక్క. మాల్ వేర్ సాయంతో మీ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బును కాజేస్తుంటారు. మిమ్మల్ని ఏమార్చేందుకు అన్ వాంటెండ్ కాల్స్, మెసేజ్‌లు సెండ్ చేస్తుంటారు. కావాలంటే మీకు వచ్చే కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఒక్కసారి చెక్ చేయండి. కానీ మీరు గుర్తించలేరు.
♦ మీఫోన్ గూగుల్ క్రోమ్ లో మీకు కావాల్సిన సమచారం కోసం అన్వేషిస్తున్నారు. ఆ సమయంలో కొన్ని అనుమానాస్పద పాప్ అప్ యాడ్స్ వస్తుంటాయి. యాహు మీరు లక్షల్లో ఫ్రైజ్ మనీని గెలుచుకున్నారు. మీకు ఆఫ్రైజ్ మనీ కావాలంటే మేం అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానాలు ఇవ్వాలని రిక్వెస్ట్‌లు పంపిస్తుంటారు. మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారంటే మీకు కాల్స్ వస్తుంటాయి. మీ ఫోన్ కాల్ ఆధారంగా మీజేబును ఖాళీ చేస్తుంటారు. హ్యాకర్స్‌లో కొంతమంది క్లిక్ చేస్తే డబ్బులు వచ్చేలా పాప్ అప్ యాడ్స్ పంపుతుంటారు. మీతో బలవంతం క్లిక్ చేసే మీ బ్రెయిన్ ను వాష్ చేస్తుంటారు. కాబట్టి ఇలా యాడ్స్ పట్ల అప్రమత్తంగా ఉంటే మంచిది
♦ ఒక్కసారి హ్యాకర్ మీ ఫోన్‌లోకి ఎంటర్ అయ్యాడంటే.. మీ జీమెయిల్, బ్యాంక్ అకౌంట్లలోకి ఈజీగా వెళతాడు.పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయడం,ఈమెయిల్స్‌ను పంపుతుంటారు. మీ డేటాను సేకరించి.. మీపేరు మీద క్రెడిట్ కార్డ్ లు తీసుకోవడం. మీ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న మనీని కాజేస్తుంటారు. ఇదిగో ఇలాంటివి సమస‍్యలు మీకు ఎదురవుతుంటే మీ ఫోన్ ను హ్యాక్ కు గురవుతుందని గుర్తుంచుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment