హ్యాక్ అయిన దలైలామా సైట్ | Dalai lama website hacked | Sakshi
Sakshi News home page

హ్యాక్ అయిన దలైలామా సైట్

Published Tue, Aug 13 2013 8:26 PM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM

Dalai lama website hacked

ధర్మశాల(హిమాచల్ప్రదేశ్):  ప్రముఖ టిబెటిన్ ఆధ్యాత్మివేత్త  14వ దలైలామాకు చెందిన వెబ్‌సైట్ హ్యాక్ అయ్యింది. ఇది చైనీ భాషలో ఉన్న సైట్. ప్రముఖ ఇంటర్నెట్ సెక్యూరిటీ కంపెనీ ‘కాస్పర్‌స్కై ల్యాబ్’, సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ ( సిటిఏ) సైట్ హ్యాక్ అయ్యిందని ప్రకటించింది. ఇందు కోసం హ్యాకర్లు ‘మాలిక్యులస్ సాప్ట్వేర్’ను ఉపయోగించి ఉంటారని భావిస్తోంది.

టిబెట్.నెట్ అనేది సిటిఏ వారి అధికారిక వెబ్. ఇది ఉత్తరభారతంలోని ధర్మశాలలో ఉంది. 2011 నుంచి ఈ సైట్‌ను తరచుగా హ్యాక్ చేస్తున్నారని కాస్పర్‌స్కై ప్రకటించింది. అయితే ఇంత వరకు హ్యాక్ అయిన ప్రతిసారీ, సైట్‌కు ఆటంకం కలగకుండా ఈ సంస్థ అరికడుతోంది. ఈ హ్యాకర్లు అంతర్జాతీయ క్యాంపెయిన్ ఫర్ టిబెట్‌ను కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. కాస్పర్‌స్కై లాబ్ పరిశోధకులైన కర్ట్ బంగార్ట్‌నర్, ‘హ్యాకర్లు ‘వాటరింగ్ హోల్ అటాక్’ పద్ధతిలో ఈ సైట్‌ను హ్యాక్ చేశారు’ అని తెలిపారు. ఒరాకిల్‌లోని జావా సాప్టవేర్, ఈ హ్యాకర్లను బహుశ ఇంటిముఖం పట్టేస్తాయేమో వేచి చూడాలి. ‘‘ఇప్పుడు వీరు చేసినది చాలా చిన్నదే. కాని ముందుముందు, వాళ్లు ఇంపార్టెంట్ ఫైల్స్‌ని డౌన్‌లోడ్ చేసి, డిలీట్ చేసేస్తారేమో’’ అని సందేహం వెలిబుచ్చారు బంగార్ట్‌నర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement