హ్యాక్ అయిన దలైలామా సైట్
ధర్మశాల(హిమాచల్‌ప్రదేశ్): ప్రముఖ టిబెటిన్ ఆధ్యాత్మివేత్త 14వ దలైలామాకు చెందిన వెబ్సైట్ హ్యాక్ అయ్యింది. ఇది చైనీ భాషలో ఉన్న సైట్. ప్రముఖ ఇంటర్నెట్ సెక్యూరిటీ కంపెనీ ‘కాస్పర్‌స్కై ల్యాబ్’, సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ ( సిటిఏ) సైట్ హ్యాక్ అయ్యిందని ప్రకటించింది. ఇందు కోసం హ్యాకర్లు ‘మాలిక్యులస్ సాప్ట్వేర్’ను ఉపయోగించి ఉంటారని భావిస్తోంది.
టిబెట్.నెట్ అనేది సిటిఏ వారి అధికారిక వెబ్. ఇది ఉత్తరభారతంలోని ధర్మశాలలో ఉంది. 2011 నుంచి ఈ సైట్‌ను తరచుగా హ్యాక్ చేస్తున్నారని కాస్పర్‌స్కై ప్రకటించింది. అయితే ఇంత వరకు హ్యాక్ అయిన ప్రతిసారీ, సైట్‌కు ఆటంకం కలగకుండా ఈ సంస్థ అరికడుతోంది. ఈ హ్యాకర్లు అంతర్జాతీయ క్యాంపెయిన్ ఫర్ టిబెట్‌ను కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. కాస్పర్‌స్కై లాబ్ పరిశోధకులైన కర్ట్ బంగార్ట్నర్, ‘హ్యాకర్లు ‘వాటరింగ్ హోల్ అటాక్’ పద్ధతిలో ఈ సైట్‌ను హ్యాక్ చేశారు’ అని తెలిపారు. ఒరాకిల్‌లోని జావా సాప్టవేర్, ఈ హ్యాకర్లను బహుశ ఇంటిముఖం పట్టేస్తాయేమో వేచి చూడాలి. ‘‘ఇప్పుడు వీరు చేసినది చాలా చిన్నదే. కాని ముందుముందు, వాళ్లు ఇంపార్టెంట్ ఫైల్స్‌ని డౌన్లోడ్ చేసి, డిలీట్ చేసేస్తారేమో’’ అని సందేహం వెలిబుచ్చారు బంగార్ట్నర్.