హీరోయిన్ అకౌంట్ హ్యాక్ | Who has paid Kareena Kapoor Khan's tax? | Sakshi
Sakshi News home page

హీరోయిన్ అకౌంట్ హ్యాక్

Oct 1 2016 6:08 PM | Updated on Sep 27 2018 3:54 PM

హీరోయిన్ అకౌంట్ హ్యాక్ - Sakshi

హీరోయిన్ అకౌంట్ హ్యాక్

బాలీవుడ్ నటీ కరీనా కపూర్ ఖాన్ ఇన్కం ట్యాక్స్ చెల్లింపుల అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది.

ముంబై: బాలీవుడ్ నటీ కరీనా కపూర్ ఖాన్ ఇన్కం ట్యాక్స్ చెల్లింపుల అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఈ మేరకు ఆమె గత శుక్రవారం ముంబై సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీనా అకౌంట్ ను హ్యాక్ చేసిన హ్యాకర్ ఆమె చెల్లించాల్సిన ట్యాక్స్ మొత్తాన్ని కూడా చెల్లించినట్లు తెలిసింది.

ట్యాక్స్ చెల్లింపు కోసం అకౌంట్ ను ఓపెన్ చేయడానికి కరీనా చార్టెడ్ అకౌంటెంట్ ప్రయత్నించగా లాగిన్ కాకపోవడంతో సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీనా పాన్ కార్డు నంబర్ తెలుసుకున్న హ్యాకర్ దానిని ఉపయోగించి ఆమె అకౌంట్ ను హ్యాక్ చేశాడని పోలీసులు నిర్ధారించారు. హ్యాకింగ్ తర్వాత ఈ-ఫైలింగ్ పాస్ వర్డ్ ను కూడా హ్యాకర్ మార్చినట్లు తెలిసింది.

ఐటీ అకౌంట్ ను హ్యాక్ చేయడం తీవ్రమైన నేరమని సైబర్ పోలీసులు తెలిపారు. ఐటీ అకౌంట్ ను హ్యాక్ చేయడం ద్వారా తప్పుడు స్టేట్ మెంట్లు ఇచ్చి సదరు వ్యక్తి ఎక్కువ ట్యాక్స్ లు కట్టేలా చేసే అవకాశం ఉందని వెల్లడించారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే అకౌంట్ ను తిరిగి ఆధీనంలోకి తీసుకున్నామని చెప్పారు. నేరస్తుడి కోసం దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement