రౌడీషీటర్‌ దారుణ హత్య  | Hyderabad: Rowdy sheeter hacked to death in old city | Sakshi
Sakshi News home page

రౌడీషీటర్‌ దారుణ హత్య 

Mar 11 2021 8:18 AM | Updated on Mar 11 2021 8:18 AM

Hyderabad: Rowdy sheeter hacked to death in old city - Sakshi

సాక్షి, డబీర్‌పురా: ఓ రౌడీషీటర్‌ను దారుణంగా హత్య చేసిన సంఘటన రెయిన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ అంజనేయులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

యాకుత్‌పురా జవహర్‌నగర్‌ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్‌ మహ్మద్‌ పర్వేజ్‌ ఆలియాస్‌ ఫర్రు డాన్‌ (26)పై 20 చోరీ కేసులు ఉన్నాయి. మంగళవారం రాత్రి చోటాపూల్‌ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై కత్తులు, డాగర్‌లతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న రెయిన్‌బజార్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరించింది. దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement