Rowdy Sheeter Murdered
-
డాన్‌ను అంటూ బెదిరించినందుకే రౌడీషీటర్ హత్య
సాక్షి, చాంద్రాయణగుట్ట: డాన్‌ను అంటూ బెదిరించినందుకే రౌడీషీటర్ ఫర్రూ హత్యకు కారణమని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ఆరుగురు నిందితులను రెయిన్‌బజార్ పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. పురానీహవేళీలోని తన కార్యాలయంలో దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ వివరాలు వెల్లడించారు. జవహర్‌నగర్ సైనిక్‌పురికి చెందిన మహ్మద్ పర్వేజ్ అలియాస్ ఫర్రూ డాన్ (26) రియల్ ఎస్టేట్ చేసేవాడు. పలు నేరాలకు పాల్పడటంతో ఇతనిపై జవహర్‌నగర్ పోలీసులు రౌడీషీట్ తెరవడంతో పాటు 2015లో పీడీ యాక్ట్ కూడా నమోదు చేశారు. కాగా అతడికి యాకుత్‌పురా చోటాపూల్కు చెందిన షేక్ సులేమాన్‌తో పరిచయం ఉంది. ఈ క్రమంలో వారు ఇబ్రహీంపట్నంలోని గాలేబ్ షా దర్గా వద్ద పేకాట, సట్టా ఆడేవారు. ఈ నెల 8,9 తేదీల్లో ఫర్రూ, సులేమాన్, ఆమూదీ, సర్వర్, అక్బర్, ఆమేర్ పేకాట ఆడారు. ఈ క్రమంలో సులేమాన్ రూ.50 వేలు గెలిచాడు. అయితే ఫర్రూ ఆ డబ్బులను లాక్కొని...తాను గ్యాంగ్స్టర్నని, లోకల్‌గా తనను డాన్ అంటారని బెదిరించడంతో పాటు దుర్భాషలాడాడు. దీనిని అవమానంగా భావించిన సులేమాన్ ఫర్రూను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. కాగా యాకుత్‌పురా చంద్రానగర్‌కు చెందిన రౌడీషీటర్ షేక్ ఫెరోజ్ అలియాస్ ఫిట్టల్ ఫెరోజ్(24) బంధువు సాజిద్ అలియాస్ చాచాను 2020లో కొందరు వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటనలో ఫర్రూ హస్తం ఉందని అనుమానించిన ఫెరోజ్ అదును కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో సులేమాన్, ఫెరోజ్‌తో పాటు తన సోదరులు షేక్ ఇసా, షేక్ అవేజ్, స్నేహితులు సయ్యద్ జమీన్, సయ్యద్ సాదిక్‌తో కలిసి ఈ నెల 9న రాత్రి షేక్ ఇసా ఫర్రూ వద్దకు వెళ్లి ఇబ్రహీం పట్నంలో పేకాట ఆడుదామంటూ స్విప్ట్ కారులో ఎక్కించుకొని బయల్దేరారు. మధ్యలో సులేమాన్ ఫోన్ చేసి తాను కూడా వస్తానని చెప్పడంతో అతడి మాటలు నిజమేనని నమ్మిన ఫర్రూ ఇసా కారులో రాత్రి 9.30 గంటల రెయిన్‌బజార్‌కు చేరుకున్నాడు. పథకంలో భాగంగా ఫర్రూ కారు దిగగానే షేక్ ఫెరోజ్ అతని కళ్లల్లో కారం చల్లాడు. అతడు రోడ్డుపై పడిపోగానే సులేమాన్, ఫెరోజ్ కత్తులతో దాడి చేసి హత్య చేశారు. టాస్క్‌ఫోర్స్, రెయిన్‌బజార్ పోలీసులు సోమవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు డీసీపీ సయ్యద్ రఫిక్, నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ గుమ్మి చక్రవర్తి, రెయిన్‌బజార్, దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు పి.ఆంజనేయులు, ఎస్.రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రతీకారంతో మరో రౌడీషీటర్.. చాంద్రాయణగుట్ట: రౌడీషీటర్ హత్య కేసులో ఆరుగురు నిందితులను ఫలక్‌నుమా పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. డీసీపీ గజరావు భూపాల్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫలక్‌నుమా ముస్తఫానగర్‌కు చెందిన మహ్మద్ జాబెర్ (27) గత జూలై నెలలో కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన మహ్మద్ షానూర్ ఘాజీ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. తన సోదరుడిని హత్య చేసిన జాబెర్‌ను ఎలాగైనా మట్టుబెట్టాలని ఘాజీ సోదరుడు మహ్మద్ షానవాజ్ ఘాజీ నిర్ణయించుకున్నాడు. కాగా హత్య కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న సమయంలో జాబెర్‌కు మహ్మద్ ఇస్మాయిల్ అనే వ్యక్తితో గొడవ జరిగిందని....అతను కూడా జాబెర్‌పై కోపంతో ఉన్నట్లు షానవాజ్‌కు తెలిసింది. దీంతో షాన్వాజ్ అతడిని సంప్రదించి హత్యకు పథకం పన్నాడు. తన స్నేహితులైన షాహిన్నగర్కు చెందిన సైఫ్ అలీ ఖాన్, కాలాపత్తర్‌కు చెందిన మహ్మద్ సమీర్, సయ్యద్ హాశం, మహ్మద్ జుబేర్, మరో ఇద్దరు మైనర్లతో కలిసి హత్య చేసేందుకు సిద్ధమయ్యారు. హత్య అనంతరం బెయిల్, ఇతర ఖర్చులన్నీ తానే భరిస్తానని వారిని ఒప్పించాడు. పథకంలో భాగంగా ఈ నెల 12న అన్సారీ రోడ్డులో జాబెర్‌పై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడు రోజుల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు. చదవండి: పాలవ్యాన్ ఢీకొని అన్నదమ్ముల దుర్మరణం -
రౌడీషీటర్ దారుణ హత్య
సాక్షి, డబీర్‌పురా: ఓ రౌడీషీటర్‌ను దారుణంగా హత్య చేసిన సంఘటన రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ అంజనేయులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాకుత్‌పురా జవహర్‌నగర్ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ మహ్మద్ పర్వేజ్ ఆలియాస్ ఫర్రు డాన్ (26)పై 20 చోరీ కేసులు ఉన్నాయి. మంగళవారం రాత్రి చోటాపూల్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై కత్తులు, డాగర్లతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న రెయిన్‌బజార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
రౌడీషీటర్ దారుణ హత్య
సాక్షి, చాంద్రాయణగుట్ట: రౌడీ షీటర్ దారుణ హత్యకు గురైన ఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది. ఇన్స్పెక్టర్ ఆర్.దేవేందర్ వివరాల ప్రకారం.. అచ్చిరెడ్డినగర్‌కు చెందిన మహ్మద్ జావెద్ ఖాన్ అలియాస్ జాడో (28) రౌడీషీటర్. ఎన్నో నేరాలకు పాల్పడ్డ ఈ నిందితుడు పలుమార్లు జైలు జీవితం గడిపాడు. అయినా ప్రవర్తనలో మార్పు లేకుండా దాడులు, బెదిరింపులు, న్యూసెన్స్‌లు చేస్తుంటాడు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కామాటీపురా ప్రాంతంలో అటుగా వెళ్తున్న ముస్తఫా ఘాజీ అనే యువకుడి ద్విచక్ర వాహనాన్ని ఆపి గంజాయి ప్యాకెట్ లాక్కొని బెదిరించి పంపించాడు. (కూతురు ఫోన్ రికార్డుతో బయటపడ్డ మర్డర్ స్కెచ్) ఈ విషయాన్ని మనసులో ఉంచుకున్న ముస్తఫా రాత్రి 9.30 గంటల తన స్నేహితులు సయ్యద్ బాబా, ఆనంద్ కుమార్ మిశ్రా, నాజంతో కలిసి కత్తులు, నకల్ పంచ్‌తో అన్సారీ రోడ్డులో జావెద్‌పై దాడి చేసి పొడిచారు. ఛాతి, కడుపు భాగాల్లో దాదాపు ఏడెనిమిది పోట్లు దిగడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఫలక్‌నుమా ఇన్స్పెక్టర్ దేవేందర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఘటనా స్థలాన్ని దక్షిణ మండలం ఇన్‌ఛార్జి డీసీపీ గజరావు భూపాల్, ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ మజీద్ పరిశీలించి.. ఘటన జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు గంజాయి మత్తులోనే ఈ హత్యకు తెగబడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు. -
మంగళగిరిలో రౌడీ షీటర్ దారుణహత్య
గుంటూరు : గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో దారుణం చోటుచేసుకుంది. మంగళగిరి 4వ వార్డులో రౌడీ షీటర్ ఉమాయాదవ్ దారుణహత్యకు గురయ్యారు. దుండగులు అతన్ని కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి చంపారు. కాగా, ఉమాయాదవ్ ఓ హత్య కేసుతోపాటు, పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. -
బ్లేడ్ బ్యాచ్ ఎఫెక్ట్... రౌడీ షీటర్ హత్య
రాజమహేంద్రవరం క్రైం: బ్లేడ్ బ్యాచ్ ముఠా తగాదాలలో మరో రౌడీ షీటర్ హత్యకు గురయ్యాడు. కంబాలపేటకు చెందిన చల్లా భరత్ (25) అనే రౌడీ షీటర్‌ను ప్రత్యర్థులు బుధవారం పథకం ప్రకారం హత్య చేశారు. రెండు నెలలుగా హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం చోడేశ్వరనగర్‌లోని చింతతోపులో భరత్ మద్యం సేవిస్తున్నట్లు భరత్ స్నేహితుడి ద్వారా తెలుసుకున్న వీరభద్రనగర్కు చెందిన గంజాయి వ్యాపారి రింగ్(అలియాస్ రెడ్డి దుర్గ), బాలాజీపేటకు చెందిన పెద్దజగ్గ (అలియాస్ అల్లం జగదీష్), తాడితోటకు చెందిన సూరి (అలియాస్ బూరా సురేష్) మోటారు సైకిల్‌పై సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మద్యం సేవించేందుకు సిద్ధమవుతున్న భరత్‌ను ముందుగా సర్వే కర్రతో తలపై బలంగా కొట్టడంతో తల పగిలిపోయింది. దీనితో పక్కకు పడిపోయిన భరత్‌ను నిందితులు వెంట తెచ్చుకున్న బటన్ నైఫ్‌తో గుండెల్లో పొడిచి హత్య చేశారు. కొన ఊపిరితో ఉన్న భరత్‌ను అతని స్నేహితులు కిషోర్, జోగేంద్ర, విజయ్ కుమార్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు. ఎలా జరిగిందంటే... రెండు నెలల క్రితం చంపేస్తామని ప్రత్యర్థి వర్గం భరత్ ఇంటికి వచ్చి గోడవ చేశారు. భరత్ ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే భరత్ తమ్ముడు శరత్ మృతి చెంది బుధవారానికి మూడు నెలలు కావడంతో కుటుంబ సభ్యులతో కలసి రాజమహేంద్రవరం, ప్రకాష్‌నగర్‌లోని చిన ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉదయం పూజలు చేసి 8 గంటల సమయంలో తల్లి, భార్యను ఇంటికి పంపేశాడు. తన స్నేహితులు కిషోర్, జోగేంద్ర, విజయ్ తదితరులతో కలసి మద్యం సేవించేందుకు చోడేశ్వరనగర్‌లోని చింతతోపు వద్ద కూర్చొని తన ఇద్దరు స్నేహితులను మద్యం తీసుకువచ్చేందుకు పంపించా డు. అయితే స్నేహితుల ద్వారా భరత్ చోడేశ్వరనగర్‌లో ఉన్నట్లు తెలుసుకున్న ప్రత్యర్థులు మోటారుసైకిల్ పై వచ్చి సర్వే కర్ర, చాకులతో హత్య చేశారు. మృతుడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. అడిషనల్ ఎస్పీ కె.లతామాధురి, డీఎస్పీలు జె.కులశేఖర్, యు.నాగరాజు, త్రీటౌన్ సీఐ శేఖర్‌బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిపై పైలు కేసులు మృతుడి పై త్రీటౌన్, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు కేసులు ఉన్నాయి. బ్లేడ్ బ్యాచ్ ముఠాలుగా ఏర్పడి అమాయకులను టార్గెట్ చేసుకొని వారిపై దాడులు చేసి నగదు చోరీ చేయడం, మద్యం షాపులలో గొడవలు పడడం వంటి నేరాలలో మృతుడు భరత్‌పై కేసులు ఉన్నాయి. దీనితో త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ తెరిచారు. మృతుడి తమ్ముడు చల్లా శరత్ గంజాయికి బానిసై ఆత్మహత్య చేసుకున్న తరువాత కొంత వరకూ గొడవలు తగ్గించుకున్నప్పటికీ పాత కక్షల నేపథ్యంలో ప్రత్యర్థి వర్గం భరత్‌ను హత్య చేసేందుకు అతని ఇంటి చుట్టూ తిరిగే వారు. బ్లేడ్ బ్యాచ్ ముఠా ఆధిపత్య పోరు రాజమహేంద్రవరం నగరంలో రెండు బ్లేడ్ బ్యాచ్ ముఠాలు ఆధిపత్య పోరులో హత్యల పరంపర కొనసాగుతోంది. గతంలో రాజేంద్రనగర్‌కు చెందిన ధనాల దుర్గారావు అనే ఆటో డ్రైవర్‌ను బ్లేడ్ బ్యాచ్ ముఠా సభ్యులు హత్య చేశారు. ఈ హత్యకు ప్రతీకారంగా పేపర్ మిల్లు వద్ద గల పెట్రోల్ బంక్ వెనుక శివ అనే యువకుడిని హత్య చేశారు. అప్పటి నుంచి నగరంలో బ్లేడ్ బ్యాచ్ ఆధిపత్య పోరు కొనసాగుంతోంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న దారా మహేష్, ఉప్పు శివ, తదితరులకు ఈ హత్యతో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. బ్లేడ్ బ్యాచ్‌లకు చెందిన ఇరువర్గాల వారికి రాజకీయ ప్రాబల్యం ఉండడంతో పోలీసులు వీరిని వివిధ కేసులలో అరెస్ట్ చేసి జైల్‌కు పంపించినప్పటికీ బెయిల్ పై బయటకు వచ్చేస్తున్నారు. దీంతో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు నగరంలో పెచ్చుమీరుతున్నాయి. పోలీసులు ఉక్కుపాదంతో అణిచివేస్తే తప్ప వీరి ఆగడాలకు అడ్డుకట్టపడదు. -
రౌడీషీటర్ దారుణ హత్య
కేకే.నగర్: విల్లుపురంలో రౌడీషీటర్ దారుణహత్యకు గురి కాగా, చె న్నైలో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. వివరాలు.. విల్లుపురం జిల్లాలో మంగళవారం బాంబుతో దాడి జరిపి రౌడీని వేటకత్తులతో దారుణంగా హత్య చేసిన సంఘటన సంచలనం కలిగించింది. విల్లుపురం జిల్లా వానూర్ తాలూకా కుయిలాపాళయం శక్తికోవిల్ వీధికి చెందిన జనార్ధనన్(23) రౌడీషీటర్‌గా చలామణి అవుతున్నాడు. ఇతనిపై హత్య, కిడ్నాప్ వంటి పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జనార్ధనన్ అనుచరులకు, మరొక రౌడీ రాజ్‌కుమార్ అనుచరులకు మధ్య తరచూ ఘర్షణలు జరిగేవి. ఈ ఘర్షణల్లో ఇరు వర్గాలకు చెందిన కొందరు హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తిరుకోవిలూర్ ప్రాంతానికి చెందిన చెల్లపాండి అనే ఉపాధ్యాయుడిని కిడ్నాప్ కేసుపై విచారణ విల్లుపురం జిల్లా సెషన్స్ న్యాయస్థానంలో మగళవారం ఉదయం జరిగింది. ఈ కేసులో రౌడీ జనార్ధనన్, సురేష్‌లు హాజరయ్యారు. కేసు విచారణ అనంతరం జనార్ధనన్, సురేష్ ద్విచక్ర వాహనాలపై పుదుచ్చేరికి వెళుతున్నారు. ఆ సమయంలో ఐదు మందికి పైగా వ్యక్తులు మోటారు బైకుపై వారిని వెంబడించారు. రైల్వే వంతెనపై వెళుతుండగా వారిపై నాటు బాంబులను విసిరారు. దీనితో వారు అదుపుతప్పి కింద పడ్డారు. సురేష్ స్పల్ప గాయాలతో తప్పించుకుని పారిపోగా జనార్ధనన్‌పై ఆ ముఠా కత్తులతో దాడి చేసి హత్య చేశారు. వెంటనే ఆ ముఠా బైకులపై పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జనార్ధనన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ముండియపాక్కం ప్రభుత్వాసుపత్రికి పంపారు. పరారీలో ఉన్న హంతకుల కోసం గాలిస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం : పల్లికరనై సమీపంలోని కోవిలంపాక్కం, తుైరె పాక్కం- పల్లావరం రేడియల్ రోడ్డుపై టాస్మాక్ దుకాణం ఉంది. ఈ దుకాణం సమీపంలోని చెట్టుకు 40 ఏళ్ల వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించింది. అతని శరీరంపై గాయాలు ఉన్నాయి. దీనిపై సమాచారం అందుకున్న పల్లికరనై పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. మద్యం మత్తులో ఏర్పడిన తగాదాలో అతడిని హత్య చేసి చెట్టుకు వేలాడదీశారా? లేక పాతకక్షలు కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.