వర్సిటీ వెబ్‌సైట్‌ హ్యాక్‌ రెండో సారి | VSU website hacked for the second time | Sakshi
Sakshi News home page

వర్సిటీ వెబ్‌సైట్‌ హ్యాక్‌ రెండో సారి

Published Mon, Aug 1 2016 10:58 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM

వర్సిటీ వెబ్‌సైట్‌ హ్యాక్‌ రెండో సారి

వర్సిటీ వెబ్‌సైట్‌ హ్యాక్‌ రెండో సారి

 
  •  వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌పై కేసు నమోదు
  •  2013లోనూ ఓ సారి హ్యాక్‌   
నెల్లూరు (క్రైమ్‌) :  
సింహపురి వర్సిటీ వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌ చేయడం ఇది రెండో సారి. 2014 ఆగస్టులో నకిలీ సర్టిఫికెట్ల ముఠా హ్యాకింగ్‌కు పాల్పడినట్లు వర్సిటీ అధికారులు గుర్తించి అప్పట్లో ఒకటో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సైబర్‌ క్రైం కింద కేసు నమోదు చేశారు.  వర్సిటీ ఆధీకృత www.simhapuriuniv.org వెబ్‌సైట్‌ ని 2008లో ప్రారంభించింది. దాని పర్యవేక్షణ హైదరాబాద్‌కు చెందిన ఐసీఎం. స్పాట్‌ సంస్థ నిర్వహిస్తోంది. 2012లో వెబ్‌సైట్‌లో మార్పులు చేర్పులు చేసి పాత వెబ్‌సైట్‌కు బదులుగా www.simhapuriuniv.ac పేరిట కొత్త వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. పాత వెబ్‌సైట్‌ను తొలగించాలని ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ నెట్‌ (ఈఆర్‌ఎన్‌ఈటీ)ని వర్సిటీ రిజిస్ట్రార్‌ కోరారు. అప్పటి నుంచి ఆ వెబ్‌సైట్‌ గురించి వర్సిటీæ అధికారులు పట్టించుకోలేదు. 2013 అక్టోబర్‌లో ఓ గుర్తుతెలియని వ్యక్తి వర్సిటీ పాత వెబ్‌సైట్‌ను హ్యాకింగ్‌ చేశాడు. అందులో నకిలీ ఐడీని క్రియేట్‌ చేసి 116 కోర్సులను వర్సిటీ నిర్వహిస్తుందని, అందుకు సంబంధించిన ఫీజు వివరాలను అందులో పొందు పరిచాడు. చిరునామా, సెల్‌ఫోన్‌ నంబర్లను అందుబాటులో ఉంచాడు. దీంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు కరస్పాండెంట్‌ కోర్సుల్లో చేరేందుకు ఆ సెల్‌ఫోన్‌ నంబర్లను సంప్రదించారు. వారి వద్ద నుంచి సదరు హ్యాకర్‌ పెద్ద మొత్తంలో నగదు వసూలు చేశాడు. నకిలీ సర్టిఫికెట్లను వారికి మంజూరు చేశాడు. ఈ నేపథ్యంలో 2014 ఆగస్టు మొదటి వారంలో కర్ణాటక హోసూరుకు చెందిన నూర్‌ఇస్తా హ్యాకర్‌ వద్ద నుంచి ఎంఈడీ సర్టిఫికెట్‌ పొంది పైచదువులకు మైగ్రేషన్‌ సర్టి్టఫికెట్‌ కోసం యూనివర్సిటీకి వచ్చాడు. అధికారులు వాటిని పరిశీలించి అవి నకిలీవిగా తేల్చారు.  అవి  ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తమ పాత వెబ్‌సైట్‌ను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హ్యాకింగ్‌ చేసి మోసాలకు పాల్పడుతున్నారన్న విషయం తేట తెల్లమైంది. దీంతో 2014 ఆగస్టు 12వ తేదీన యూనివర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఎస్‌.మురళీమోహన్‌రెడ్డి ఒకటోనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఒకటోనగర ఇన్‌స్పెక్టర్‌ మద్ది శ్రీనివాసరావు సైబర్‌ క్రైమ్‌ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు వరంగల్‌లో ఐడీని క్రియేట్‌ చేశాడని, తన కార్యకలాపాలు బెంగళూరు, హరయనా నుంచి సాగిస్తున్నాడని  పోలీసులు గుర్తించారు. అయితే ఇంత వరకు ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదు. పోలీసులు సైతం కేసు నమోదుతో సరిపెట్టుకున్నారు. తాజాగా తీవ్రవాదులు  వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరపాలని వర్సిటీ అధికారులు కోరుతున్నారు. 
తాజాగా మళ్లీ కేసు నమోదు
విక్రమ సింహపురి యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను తీవ్రవాదులు  హ్యాకింగ్‌ చేయడంపై వర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ మురళీమోహన్‌ ఫిర్యాదు మేరకు సోమవారం ఒకటో నగర ఇన్‌స్పెక్టర్‌ అబ్దుల్‌ కరీం  సైబర్‌ క్రైమ్‌ కింద కేసు నమోదు చేశారు.  నెల్లూరు విక్రమసింహపురి యూనివర్శిటి అధికారిక వెబ్‌సైట్‌ www.simhapuriuniv.ap.inను   బెంగళూరుకు చెందిన శ్రీవా టెక్నాలజీస్‌ సంస్థ నిర్వహిస్తోంది. శనివారం సాయంత్రం వె»Œ సైట్‌ హ్యాకింగ్‌కు గురైంది. ఆదివారం కొందరు విద్యార్థులు, అధ్యాపకులు వర్సిటీకి చెందిన వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయడంతో హోమ్‌ పేజీపై దేశప్రధాని, బాలీవుడ్‌ హీరో షారూఖ్‌ఖాన్‌లకు హెచ్‌ఈఎక్స్‌786 పేరిట హెచ్చరికలు ఉండటాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. ఈ విషయం వర్సిటీ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు వెంటనే శ్రీవా టెక్నాలజీస్‌ ద్వారా సైట్‌ను పునరుద్ధరించారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement